మంచి స్టోరీ లైన్ … సూపర్‌గా పర్‌ఫామ్ చేయగల నటీనటులు… ఇంకేముంది..? దర్శకుడు రెచ్చిపోవాలి కదా… ఫాఫం, ఎక్కడో తేడా కొట్టింది… గందరగోళానికి గురయ్యాడు… ఏ గంట సేపు సినిమాకు ప్రాణమో, ఆ చివరి గంట చేతులెత్తేశాడు… దెబ్బతినేశాడు…
అప్పట్లో అపరిచితుడు అనే సినిమా బ్లాక్ బ్లస్టర్… విక్రమ్, ప్రకాష్‌రాజ్ నటనలో ఇరగదీశారు… ఇక విక్రమ్ లైఫ్ కెరీర్‌లో అలాంటి పాత్ర దొరకదు… శంకర్ దర్శకుడు… ప్రస్తుతం ఆయన పర్‌ఫామెన్స్, భారతీయుడు అట్టర్ ఫ్లాప్ కథ చూస్తే ఇక శంకర్ కూడా అపరిచితుడు టైపు సినిమా తీయలేడేమో…
ప్రస్తుతం డార్లింగ్ అని ఓ సినిమా వచ్చింది… ప్రస్తుతం కల్కి తప్ప మరో సినిమా లేదు థియేటర్లలో… భారతీయుడు సూపర్ ఫ్లాప్… ఈ స్థితిలో దీనికి మంచి చాన్స్ అనుకున్నారందరూ… నభా నటేష్ షీరో… అంటే హీరోయిన్ సెంట్రిక్ కథ… ఆమె కూడా బాగా చేసింది… ఆరు వేరియేషన్స్, ఆరు పాత్రల్ని ఆవిష్కరించగల పాత్ర… ఆమెకు మళ్లీ ఇలాంటి రోల్ దొరకదు…
Ads
కానీ దర్శకుడు చెడగొట్టాడు… హీరోయిన్ సెంట్రిక్ కథ అయితే దర్శకుడు హీరోను పరిచయం చేయడానికి ప్రయారిటీ ఇచ్చాడు ఫస్ట్ అవర్… ఇంటర్వెల్ బాగుంది… కానీ తీరా క్లైమాక్సు సమీపించేసరికి గందరగోళానికి గురై హేండ్సప్ అనేశాడు… తద్వారా ఓ మంచి హిట్ చాయిస్ మిస్సయ్యాడు…
ఇందులో ప్రియదర్శి హీరో… తనకు మంచి కామెడీ టైమింగు ఉంది… అపరిచితురాలు తరహా కథను అయితే సీరియస్ ప్రజెంటేషన్‌తో వెళ్లాలి, లేదంటే కామెడీతో ఇరగదీయాలి… ఇది అటూఇటూ గాకుండా పోయింది… ఉన్నంతలో కామెడీ పర్లేదు… కానీ స్టోరీ లైన్ వేస్టయిపోయినట్టయింది…
ఓ హీరో, ఓ చిన్న కొలువు… పెళ్లి గురించి బొచ్చెడు కలలు, తీరా పెళ్లయ్యే టైమ్‌కు కాబోయే పెళ్లాం ఎవడితోనో జంప్… సూసైడ్ చేయాలనుకునే టైమ్‌కు ఓ అపరిచితురాలు దొరుకుతుంది, పెళ్లి చేసుకుంటారు, ఆమె ఐదారు పాత్రల కలబోత… అంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్…
ఎందుకో… ఇలాంటి పాత్రలు సినిమాల్లోనే కనిపిస్తాయి… సినిమాలు కదా… ఆమెతో ఎలా వేగాడు, ఆమె అసలు కథ ఏమిటనేదే స్టోరీ లైన్… 1) పాటలు నాట్ ఇంప్రెసివ్… 2) కామెడీ అక్కడక్కడ మాత్రమే వర్కవుట్ అయ్యింది… 3) ఇంటర్వెల్ తరువాత దర్శకుడు గాడి తప్పాడు… ఐనా సరే, ఓటీటీలో క్లిక్ అయ్యే చాన్సయితే ఉంది… థియేటర్ దాకా వచ్చి నిలువుదోపిడీ చేయించుకునేంత సీన్ అయితే లేదు…
ఇలాంటి కథలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఎక్కించాలి… ఒక చంద్రముఖి, ఒక ఆ, ఆ అపరిచితుడు… సస్పెన్స్, థ్రిల్ మెయింటెయిన్ చేస్తూనే కథ ప్రేక్షకుడికి అర్థం చేయిస్తారు దర్శకులు… ఇక్కడ దర్శకుడే గందరగోళంలో ఉన్నాక ఇక ప్రేక్షకుడికి ఏం చెబుతాడు..? అక్కడ దెబ్బ కొట్టేసింది… పైగా ఏదో సందేశం ఇవ్వాలనే తపన…
ప్రియదర్శి ఎలాగూ మంచి యాక్టర్, వంక పెట్టేందుకు చాన్స్ లేదు, నభా నటేష్ అదుర్స్… కానీ అనన్య నాగళ్ల కూడా మంచి నటే… కానీ ఆమెకు తగిన పాత్ర లేకుండా పోయింది… ఆమె ఇలాంటి పాత్రలు ఎంచుకుంటే ఆమె కెరీర్ ఇక క్లోజ్… మిగతా టెక్నికల్ సమీక్షలు చెప్పుకునేంత సీన్ సినిమాలో లేదు… సెలవు…
Share this Article