అసలు ఎవరు హీరోయిన్ అనేది కాదు ప్రశ్న… ప్రభాస్ పూర్తి చేయాల్సిన చాలా పెద్ద ప్రాజెక్టులున్నాయి చేతిలో… వేల కోట్ల ప్రాజెక్టులు అవి… రాజా సాబ్ వదిలేస్తే… సాలార్, కల్కి సీక్వెల్స్, స్పిరిట్… ఇవన్నీ ఎంతకాలం పడతాయో చెప్పలేం… కొత్తగా రాఘవపూడి హను దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడని వార్తలు… (కన్నప్పలో తన పార్ట్ షూటింగ్ అయిపోయిందట…)
ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నారట… పీరియాడిక్ డ్రామా ఓ యాక్షన్ ఓరియెంటెడ్ అట… మైత్రీ మూవీ మేకర్స్‌తో ఈమేరకు ప్రభాస్ కమిటయ్యాడని టాక్… తను ఇప్పట్లో ఏమేరకు డేట్స్ ఇవ్వగలడనేది డౌటే… పీరియాడిక్ డ్రామా అనగానే టెంప్ట్ అయినట్టున్నాడు ప్రభాసుడు…
సరే… ఇదంతా అఫిషియల్‌గా ఇంకా ఏమీ వెల్లడించలేదు ఎవరూ… కానీ ఆలూ లేదు, చూలూ లేదు అన్నట్టుగా అప్పుడే కథానాయిక దగ్గర దాకా వెళ్లిపోయాయి చర్చలు… ఇప్పటికైతే గాసిప్స్… ఇద్దరిలో ఒకరు అనుకుంటున్నాడట దర్శకుడు, అందులో ఒకరు పాకిస్థానీ నటి అట… మరొకామె డాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్…
Ads
మొదటి ప్రతిపాదిత హీరోయిన్ పేరు సజల్ అలీ… లాహోర్‌లో పుట్టింది… పాకిస్థాన్‌లో హైలీ పెయిడ్ ఆర్టిస్టు అట ఆమె ఇప్పుడు… గుడ్… కానీ ఆమె ప్రధానంగా టీవీ నటి… గతంలో శ్రీదేవి సినిమా మామ్‌లో కూడా నటించింది… మహా అయితే ఆమె కెరీర్‌లో నాలుగైదు సినిమాలు ఉంటాయేమో, అంతే…
వెబ్ సీరీస్, టీవీ సీరియల్స్, టీవీ షోస్, టెలిఫిలిమ్స్ ఎక్కువ… కాకపోతే సోషల్ మీడియాలో బాగా పాపులర్… మరి రాఘవపూడికి ఆమె పేరు ఎక్కడ కనెక్టయిందో తెలియదు… బాలీవుడ్‌లో కూడా పెద్ద పేరున్న నటి కూడా ఏమీ కాదు మరి… ఆమె సిస్టర్ కూడా నటే… అహద్ రజా మీర్ అనే పాకిస్థానీ-కెనడియన్ నటుడిని 2020లో పెళ్లి చేసుకుంది, రెండేళ్లలో విడాకులు… ఇదీ ఆమె కథ…
మరొకరి పేరు ఇమాన్ ఇస్తాయిల్… ఈమెది ఢిల్లీ… సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది… ఎంబీఏ చదివి, అమెరికాలో డాన్స్ ట్రెయినింగ్ తీసుకుంది… మ్యూజిక్ వీడియోలు ఎక్కువ… యూట్యూబ్‌లో పాపులర్… సొంత చానెల్ ఉంది… ఏమో, త్వరలో మూడో పేరు కూడా చర్చల్లోకి రావచ్చు… కానీ ఎటొచ్చీ డౌట్ ఏమిటంటే..?
ఒకామె ప్రధానంగా టీవీ నటి కమ్ మోడల్… చేసింది ఒకే ఒక హిందీ సినిమా, అదీ ఓ అప్రధాన పాత్ర… మరొకరు కొరియోగ్రాఫర్ కమ్ యూట్యూబర్… మరి అంతటి ప్రభాస్ సరసన వీళ్లు ఫిట్టవుతారా..? ఇమేజీ, ఇండస్ట్రీలో పాపులారిటీ, ఫేమ్ కూడా ముఖ్యమే పెద్ద ప్రాజెక్టులకు… పైగా స్టార్ కాస్టింగ్ ఆధారంగా బిజినెస్ జరిగే కాలం ఇది… కల్కి బజ్‌కు దీపిక, అమితాబ్, కమలహాసన్ వంటి అగ్రతారలు ఉండటం కూడా ఓ కారణమే…
అబ్బే, రాఘవపూడి హను అంటేనే కొత్త హీరోయిన్ల పరిచయకర్త, సో, వీళ్లలో ఒకరిని తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు కొందరు… లావణ్య త్రిపాఠీని అందాల రాక్షసితో పరిచయం చేస్తే ఇక్కడే తిష్ట వేసి ఏకంగా మెగా కోడలు అయిపోయింది… కృష్ణగాడి వీరప్రేమగాథలో మెహరీన్‌ను పరిచయం చేస్తే, త్వరలో ఆమె కూడా మరో మెగా కోడలు కాబోతోందని టాక్…
లై మూవీలో మేఘా ఆకాశ్, సీతారామం మూవీలో మృణాల్ ఠాకూర్… వాళ్లూ హిట్టయ్యారు… తీసిందే ఐదు సినిమాలు, నలుగురు కొత్త నాయికలు… ఏమో, ప్రభాస్ పక్కన ఆ పాకిస్థానీ అగ్రనటి కూడా మెరుస్తుందేమో..!!
Share this Article