ఏదైనా టీవీ షోకు థమన్ వంటి లీడర్ అవసరం… తనకు ఎంతిస్తున్నారో ఏమో తెలియదు గానీ… తెలుగు ఇండియన్ ఐడల్ షోకు ప్రాణం తనే… జడ్జిగా మాత్రమే కాదు, స్పాంటేసియస్ జోకులు వేసి, షోను వినోదాత్మకంగా మార్చడమే కాదు… తనకున్న అన్ని పరిచయాలనూ వినియోగించి గెస్టులను తీసుకొస్తాడు… గౌరవిస్తాడు… షోకు అదనపు విలువను సమకూరుస్తాడు…
అబ్బే, తను పెద్ద కాపీ మాస్టర్ అంటారా..? అదిక్కడ సందర్భం కాదు చెప్పుకోవడం…! ఈ షో తనపై పెట్టుకున్న నమ్మకానికి ఎలా విలువ ఇస్తున్నాడు అనేదే… నిజానికి తను చాలా బిజీ… ఐనా ఒక ఓటీటీ మ్యూజిక్ షో కోసం ఇంత వర్క్ చేయడాన్ని అభినందించాలి… డబ్బు తీసుకోవడం లేదా అంటారా..? చాలా షోలలో చాలా మంది డబ్బు తీసుకుంటున్నారు మరి… వస్తారు, పోతారు… ఈ ఇన్వాల్వ్ మెంట్ ఉండదు…
ఈసారి డ్రమ్స్ శివమణి వచ్చాడు… తను వచ్చాడు కదాని కంటెస్టెంట్లతో కూడా ఆ ఇన్‌స్ట్రుమెంట్ ప్రధానంగా సాగే హుషారైన గీతాల్ని ఎంచుకుని, సాధన చేసి ప్రజెంట్ చేశారు… మరీ ఓ కంటెస్టెంటయితే ప్రభుదేవా రేంజులో స్టెప్స్ వేశాడు… శివమణి, థమన్ డ్రమ్స్ వాయించారు… వెరసి వీనుల విందు…
Ads
(ఈ ఫోటోలో గీతామాధురి మాత్రం నల్ల కళ్లద్దాలు పెట్టుకోకపోవడం క్షమించలేం… హహహ)
తమిళ సినిమా ఫీల్డుకు సంబంధించి చాలామంది రకరకాల తెలుగు టీవీ షోలకు వస్తుంటారు… ప్రోగ్రామ్స్‌కు కూడా వస్తారు… కానీ శివమణి అత్యంత అరుదు ఇలాంటి షోలకు రావడం… (కార్తీక్ కూడా ప్రధానంగా తమిళ ఇండస్ట్రీయే…) (ఈమధ్యే అనుకుంటా పడమటి సంధ్యారాగం సినిమా వచ్చింది ఏదో టీవీలో… శివమణి కూడా రొనాల్డ్ అనే ఓ పాత్ర వేశాడు అందులో… అది గుర్తొచ్చింది…)
షో ప్రోమో ఆసక్తికరంగా ఉంది… ప్రత్యేకించి శివమణితో థమన్‌కు చిన్నప్పటి నుంచీ ఉన్న బంధం, శివమణికి బాలసుబ్రహ్మణ్యంతో ఉన్న అనుబంధం ప్రస్తావించడం, చెప్పుకోవడం బాగుంది… అయ్యప్ప దీక్షలో ఉన్న శివమణి 1995లో థమన్ నాన్న చనిపోయినప్పుడు మాల విప్పేసి రావడం చూసి తనకు ఏడుపు వచ్చిందని పాత సంగతి ఒకటి పంచుకున్నాడు… బాలును తలుచుకుని శివమణి కన్నీళ్లు పెట్టుకున్నాడు… బాలు వాయిస్ నోట్ కూడా వినిపించాడు (తమిళంలో ఉంది)…
ఏదో ఓ కొత్త పాట గురించి అనుకుంటా… ‘ఒరిజినల్ హుక్ స్టెప్ బయటకు వదల్లేదు, రేపు థియేటర్లలో రచ్చ రచ్చే, మామూలుగా ఉండదు అట… ఏముందిలే థమన్ భయ్… కుర్చీ మడతబెట్టి టైపు ఇంకేదో పట్టుకుని ఉంటావు… అంతే కదా… ఈసారి ఏఆర్ రెహమాన్‌ను పట్టుకురా బ్రదర్… ఆ లెవలే వేరు ఇక..!!
Share this Article