దర్శకుడు హరీష్ శంకర్ మరో జర్నలిస్టు మధ్య నడుమ సాగుతున్న మాటల యుద్ధం పరిశీలిస్తే… హరీష్ శంకర్ తొందరపాటే కనిపిస్తోంది… తను గతంలో కూడా నోరు పారేసుకున్న సందర్భాలున్నాయి… ఆవేశం ఎక్కువ… ఎందుకోగానీ సోషల్ మీడియాలో తన యాక్టివిటీకి సంబంధించి ఎవరో మిత్రుడు ‘మేల్ అనసూయ’ అన్నాడు…
ఈమధ్య ఎవరో ఏదో మీడియా మీట్‌లో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అడిగినప్పుడు… మితిమీరితే మీరు అడగలేకపోతే నేను స్పందించాల్సి వచ్చింది అని ఓ పిచ్చి జవాబు ఇచ్చింది ఆమె… విజయ్ ఫ్యాన్స్ మళ్లీ ట్రోలింగ్‌కు దిగేసరికి, అసలు ఎవర్రా మీరంతా..? పదే పదే ఆ వివాదాన్ని గెలికేవాళ్లను అడగండి అని ఉల్టా ఏదో ట్వీటినట్టుంది ఆమె…
Ads
అవును, మీడియా గోకగానే, అంటే అడగ్గానే ఎందుకు అలాంటి ఆన్సర్లు ఇవ్వడం, మాటలు పడటం… మీడియా అంటే అంతే, గోకడానికే ట్రై చేస్తుంది… ప్రశ్నను అవాయిడ్ చేయొచ్చు కదా… అబ్బే, అలా చేస్తే ఆమెను అనసూయ అని ఎందుకంటారు..?
ఆమధ్య ఎవరితోనో హరీష్ శంకర్‌కు మాటామాటా నడిచింది… ఇప్పుడు దేవిప్రియ కావచ్చు పేరు… ఫిలిమ్ జర్నలిస్టు… ఏదో హరీష్ శంకర్ సినిమా డిస్ట్రిబ్యూషన్ లెక్కలపై ఏదో రాశాడు… దాని మీద హరీష్ శంకర్ అభ్యంతరం… అంతేకాదు, భవదీయుడు భగత్‌సింగ్ పేరు లీక్ చేశాడని ఆరోపణ… అవును, తన ప్రివిలేజ్ అది… ఎక్స్‌క్లూజివ్‌గా ఏదైనా వార్త దొరికితే ముందుగా జనానికి చెప్పాలనే తాపత్రయం ఎవరికైనా ఉంటుంది..?
అంతేకాదు, మిస్టర్ బచ్చన్ అనే సినిమాకు సంబంధించిన వార్తలో లేదా ట్వీట్‌లో డిస్ట్రిబ్యూషన్ లెక్కల గురించి రాస్తే అభ్యంతరం దేనికి..? తప్పయితే ఖండించే వీలుంది కదా… దానికి అంత ఆవేశపడిపోయి, బీపీ పెంచుకుని రీచ్ పెంచుకుని, ఆదాయం పెంచుకునే ధోరణి అని నిందించడం దేనికి..? లేదా ఇలాంటి సంవాదాలతో సినిమాకు పబ్లిసిటీ వస్తుందనే ఏదైనా పేరాశ ఉందా..?
నువ్వేదో ఇంటర్వ్యూ అడిగావట అంటాడు హరీష్ శంకర్… నేనేమీ నీ ఇంటర్వ్యూ అడగలేదుగా అని సదరు దేవిప్రియ రిప్లయ్… సదరు దర్శకుడు గారు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాడట, కానీ తన కెమెరా కూడా పెట్టుకుంటాడట… అవును, అంత అనుమానం ఉంటే, వక్రీకరిస్తారనే అభిప్రాయం ఉంటే ఇంటర్వ్యూ ఇవ్వడం దేనికి..? నీ కెమెరా కూడా పెట్టు, మొత్తం వీడియో అప్‌లోడ్ చేస్తాను అని సదరు జర్నలిస్టు కౌంటర్… న్యూస్ సేకరించడం నా వృత్తి అంటాడు ఆ జర్నలిస్టు…
ఇక్కడ హరీష్ శంకర్ ఆయన్ని ఓ మాట అనడం దేనికి..? ఉల్టా మాటలు పడటం దేనికి..? ఆ జర్నలిస్టు ఎవరో, దేనికి వర్క్ చేస్తాడో తెలియదు… టీవీ..? పేపర్..? యూట్యూబ్…? సైట్..? ఓన్లీ సోషల్ మీడియా…? ఎవరో, హరీష్ శంకర్ ఎందుకింత ప్రాధాన్యమిస్తున్నాడో తనకే తెలియాలి… ఏమో, సంవాదం కూడా ఉద్దేశపూర్వకమేనేమో అనే సందేహాలు కలుగుతున్నాయి… ఎటొచ్చీ తన స్థాయినే తను దిగజార్చుకుంటున్నాడనే బేసిక్ సోయి లోపించినట్టు కనిపిస్తోంది… పాపం శమించుగాక..!!
ఒకటి గుర్తొచ్చింది… ఈ దర్శకుడే కదా… కొత్త పిల్ల భాగ్యశ్రీ బోర్సె బ్యాక్ జేబుల్లో రవితేజ చేతులు పెట్టి దరువేస్తున్నట్టుగా ఓ వెగటు స్టెప్పు షూట్ చేసింది… దాని మీద కూడా బోలెడంత విమర్శ వచ్చినట్టు గుర్తు సోషల్ మీడియాలో…!!
Share this Article