Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎదురులేని ఎన్టీయార్… కసి పాటలతో అలవోకగా హిట్టు కొట్టేశాడు…

July 31, 2024 by M S R

ఎదురు లేని మనిషి . కరెక్ట్ టైటిల్ . NTR కు ఎదురేముంది ?! 1970s తర్వాత ఫుల్ ఆయనిష్టం . నిప్పులాంటి మనిషి తర్వాత ఆయన్ని ఏంగ్రీ మేన్ , వెంజెన్స్ ఇమేజి లోకి తెచ్చేసారు తెలుగు సినిమా కధా రచయితలు , దర్శకులు , నిర్మాతలు .

ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ స్వంత బేనర్ వైజయింతి మూవీస్ బేనర్ పై నిర్మించిన మొదటి సినిమా 1975 లో వచ్చిన ఈ ఎదురు లేని మనిషి సినిమా . హిందీలో హిట్టయిన జానీ మేరా నామ్ కు రీమేక్ మన తెలుగు సినిమా . హిందీలో దేవానంద్ , హేమమాలిని , ప్రాణ్ ప్రధాన పాత్రల్లో నటించారు .

రొటీన్ కధే . హీరో తండ్రిని అన్యాయంగా చంపుతారు . హంతకుల నుంచి అన్నదమ్ములు తప్పించుకుని పారిపోతూ విడిపోతారు . ఒకడు ఎదురు లేని మనిషి అవుతాడు , మరొకడు పోలీసు ఆఫీసర్ అవుతాడు . తమ తండ్రిని చంపిన హంతకులను తుదముట్టించి తన పగ తీర్చుకుంటాడు .

Ads

ఈ క్రమంలో ఓ హీరోయిన్ . వాణిశ్రీ ఇతర హీరోలతో నటించిన ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో తానే డామినేట్ చేస్తుంది . ఆమెకే ఎక్కువ పేరు వచ్చింది . ఒక్క NTR తో మాత్రం డామినేట్ చేయలేకపోయింది . కాస్త ఈ సినిమాలో సాంగ్సులో ధీటుగా నిలబడింది . యమగోల , అడవిరాముడు సినిమాల్లో హీరోయిన్ జయప్రద షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళాక , కాపు పెట్టించుకునేది . బహుశా ఈ సినిమాలో వాణిశ్రీ కూడా కాపు పెట్టించుకుని ఉండి ఉండాలి .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో రెండు మూడు పాటలు వీర హిట్టయ్యాయి . కసిగా ఉంది కసికసిగా ఉంది కలవక కలవక కలిసినందుకు కస్సుమంటుంది అనే పాట నిజంగానే కస్సు కస్సుమంటుంది . మిగిలిన పాటలు హే కృష్ణా ముకుందా మురారీ , ఎంతవాడు ఎంతవాడు , ఎక్కడో ఎక్కడో తగలరాని , కంగారు ఒకటే కంగారు కూడా హుషారుగా ఉంటాయి . పాటలన్నీ ఆత్రేయే వ్రాసారు .

NTR , వాణిశ్రీ , జగ్గయ్య , పద్మప్రియ , ప్రభాకరరెడ్డి , కాంతారావు , సత్యనారాయణ , రాజబాబు హేమలత , అల్లు రామలింగయ్య , నిర్మలమ్మ ప్రభృతులు నటించారు . మమిడిపాటి రాధాకృష్ణ మూర్తి డైలాగ్స్ బాగుంటాయి . కె బాపయ్య దర్శకులు .

కమర్షియల్ గా సక్సెస్ అయిన ఈ సినిమా అయిదు సెంటర్లలో వంద రోజులు ఆడింది . యూట్యూబులో ఉంది . చూడని NTR , వాణిశ్రీ అభిమానులు ఎవరయినా ఉంటే తప్పక చూడండి . డ్యూయెట్లు మిస్ కాకండి . అడవిరాముడు , యమగోల సినిమాల్లో పాటల్లాగా హుషారుగా ఉంటాయి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…… [ దోగిపర్తి సుబ్రహ్మణ్యం ]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాధన్ పండిట్… అబ్బో, కేఏ పాల్ గారికే పెద్దన్నలా ఉన్నాడు…
  • కేటీయార్ హేపీ… 2034 తరువాతనైనా సీఎం చాన్స్ దొరకొచ్చు…
  • మస్క్ పక్కన సమస్థాయిలో ఆమె… ఓ నమ్మశక్యం కాని గ్రాండ్ సక్సెస్ స్టోరీ…
  • శతృ సంతానం..! పాత జన్మ పగవాళ్లే ఈ జన్మలో పిల్లలుగా పుట్టి…!!
  • స్మి’తత్త్వమసి’… పాప్, ర్యాప్ అయిపోయాయి… ఇక తత్వ యాత్ర…
  • సరిహద్దుల్లో ఓ సైలెంట్ ఛేంజ్… India also Ready for AI War…
  • ‘మై జల్‌మురి ఖా రహాథా…’ బెంగాల్ గెలుపుపై అమెరికాలో సంబురాలు
  • ‘కాల్పనిక అమ్మతనం’… ఊహల ఉయ్యాలవే మనసా… మాయల దెయ్యానివే…
  • కేడీ, ది డెవిల్… ప్చ్, కంట్రవర్సీ ఎక్కువ- కంటెంటు తక్కువ…
  • అమెరికాలో ఆదానీ కేసు సెటిల్‌మెంట్..! ఆరోపణలన్నీ ఉఫ్…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions