మను బాకర్… ఒకే ఒలింపిక్ ఈవెంట్‌లో రెండు పతకాలు పొందిన ఏకైక ఇండియన్ లేడీ అథ్లెట్… ఇదొక రికార్డు… నిజంగానే ఆమె 20 M పిస్టల్ ఈవెంట్‌లో కూడా పతకం కొడితే అసలు ఆ కథ వేరే లెవల్…
అంతకుముందు ఎవరూ లేరా..? ఉన్నారు… అప్పుడెప్పుడో 124 ఏళ్ల క్రితం బ్రిటిష్- ఇండియన్ నార్మన్ ప్రిచార్డ్ 200 ఎం స్ప్రింట్, 200 ఎం హార్డిల్స్ ఈవెంట్లలో సిల్వర్ మెడల్స్ కొట్టాడనేది చరిత్ర… ఇండిపెండెంట్ ఇండియాలో ఆ రికార్డు మనూ బాకర్‌దే…
ఆమె తను భగవద్గీతను చదవడం వల్లే, దాని మహత్తు వల్లే పతకం పొందానని చెప్పలేదు… ఒత్తిడి తగ్గించుకోవడానికి ‘నీ కర్మ నువ్వు చేయి, ఫలితం పైవాడికి వదిలెయ్ అనే స్పూర్తి కోసం గీత చదివాననేది ఆమె మాటల సారాంశం… దానికి బోలెడు వక్రబాష్యాలు చెబుతూ బోలెడుమంది దుమ్మెత్తిపోస్తున్నారు… ఇండియా కదా… ఇక్కడ అంతే… 100 ఎం కంబైన్డ్ పిస్టల్ ఈవెంటులో ఆమె జోడీ సరబ్‌జోత్ సింగ్ కూడా తను తీవ్ర ఒత్తిడికి గురయ్యానని చెప్పుకున్నాడు తెలిసిందే కదా…
Ads
సరే, అదలా ఉంచితే… గీతను ఆదర్శంగా తీసుకునే ఆమే గతంలో ఇంగ్లండ్ ఒలింపిక్స్‌లో చివరి క్షణాల్లో పిస్టల్ స్టకప్ అయిపోయి, పోటీలో దారుణంగా వెనకబడిపోయి, కన్నీళ్లు పెట్టుకుంది… అదంతే, ఆ టైమ్… ఆ మూడ్… నిజానికి ఆమె షూటింగులోనే కాదు, తనకు చాలా క్రీడాంశాల్లో ప్రవేశం ఉంది… కాకపోతే దీన్ని సీరియస్‌గా తీసుకుంది…
స్పోర్ట్స్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఇంట్రస్టింగ్ అంశాన్ని చెప్పుకుంది ఓపెన్‌గా… ఆమెకు ఒలింపిక్స్ మెడల్స్ కొట్టిన పీవీ సింధు, నీరజ్ చోప్రా వంటి ప్లేయర్స్ మీద అడ్మిరేషన్… వాళ్లు చేసే కృషి, సాధన మీద… అందుకే ఓసారి పీవీ సింధు మీద ట్రోలర్స్ విరుచుకుపడుతూ విషం కక్కుతున్న సందర్భంలో… సహించలేక, మను బాకర్ తనే ఓ ఫేక్ మెయిల్ అకౌంట్‌తో సోషల్ మీడియా క్రియేట్ చేసి, ట్రోలర్స్ మీద ఎదురుదాడికి దిగిందట…
తనే చెప్పింది… ఈ విషయం చదివాక పీవీ సింధు కూడా రియాక్టయింది… వావ్, స్వీట్ హార్ట్, వెల్‌కమ్ టు డబుల్ ఒలింపిక్ మెడల్ క్లబ్ అంటూ రిప్లయ్ ఇచ్చింది… (రెండేసిసార్లు ఇండియా తరఫున ఒలింపిక్ మెడల్స్ కొట్టినవాళ్ల క్లబ్ అన్నమాట…) గుడ్… మనూ బాకర్ మూడో మెడల్ కొడితే, పీవీ సింధు కూడా మూడో మెడల్ కొడితే… వెంటనే ట్రిపుల్ ఒలింపిక్ మెడల్ క్లబ్ ఏర్పాటైపోతుందన్నమాట… ఈ ఇద్దరే ఆ క్లబ్ ప్రాథమిక సభ్యులు… వావ్…!!
Share this Article