చైనాలో మానవ నాగరికత మొదలైనప్పటినుంచి అక్కడ ఆయుర్వేదానికి ప్రాముఖ్యత ఎక్కువ. TCM అనే ట్రడిషనల్ చైనా మెడిసిన్, చైనాలో 2500 సంవత్సరాల నుంచి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. శరీరంపై పంచభూతాలు అగ్ని, గాలి, నీరు, భూమి, మెటల్ (లోహం) ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నాయి, ఇంకా శరీరం లోపలికి ఏమి వెళ్తుంది (YIN), ఏమి వస్తుంది(YANG) అనే వాటిని పరిశీలించి TCM వాడతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రూవల్ కూడా ఉంది.
2020 అప్పుడు కరోనా వైరల్ డిసీజ్ ని అరికట్టటంలో కూడా TCM చాలా ప్రాముఖ్యత వహించింది అని చైనా నుంచి ఇంగ్లీష్ లో విడుదల అయ్యే చైనా డైలీ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. చైనాలో 2 రకాలైన డాక్టర్స్ ఉంటారు 1. అల్లోపతి డాక్టర్స్ 2. TCM డాక్టర్స్. ఆల్లోపతి వాళ్ళు కూడా కొంతభాగం TCM గురించి తెలుసుకోవాలి.
ఒక్క చైనాలోనే కాదు, సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా, వియత్నాం, కొన్ని యూరప్ దేశాల్లో కూడా TCM ని వాడతారు. అమెరికాలోని FDA (Food and Drug Administration) కూడా దీని ప్రాముఖ్యతని గుర్తించి సప్లిమెంట్స్ అనే ఒక విభాగాన్ని చేర్చింది. NIH (నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ హెల్త్) ఏకంగా NCAM (నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్ నేటివ్ మెడిసిన్) అనే సంస్థని నెలకొల్పింది.
Ads
ఇంకా TCM విషయానికొస్తే ఈ మందులో 10% యానిమల్ ప్రొడక్ట్స్ 90% హెర్బ్స్ ఉంటై. చైనాలో అల్లోపతి డాక్టర్స్ కూడా 20% TCM ని వాడాలని చెప్తారు. TCM డాక్టర్స్ కూడా ప్రతి దానికి ఆయుర్వేదంలో మందు ఉంది అని చెప్పరు. వాళ్ళ పురాతన ఆయుర్వేద పుస్తకాలని ఇంగ్లీష్ లోకి మార్చి విస్తృతమైన అధ్యయనం కూడా చేస్తున్నారు. అల్లోపతి వలన నయం కాని ఎన్నో జబ్బులని నయం చేస్తున్నారు. ఈ మధ్య అమెరికా, యూరప్ డాక్టర్స్ కూడా TCM పై అవగాహన పెంచుకుంటున్నారు.
మన దగ్గర ఎక్కువ మంది ఆయుర్వేద వైద్యులు ప్రతిదానికీ మందు ఉంది అని చెప్పి ఏవేవో కల్లబొల్లి కబుర్లు చెప్తారు. ఒకరు పొద్దున్నే 5 లీటర్ల నీళ్ళు తాగమంటారు, ఇంకొకరు లీటర్ తాగమంటాడు. ఇంకోడు వేడి నీళ్ళు అంటాడు, మరొకడు గోరు వెచ్చని అంటాడు, ఇంకొకడు చల్లని నీళ్ళు అంటాడు. ఒక్క నీళ్ళ విషయంలోనే ఇన్ని బేధాలు ఉంటే మిగతా విషయాల్లో ఉన్న వైరుధ్యాలు మనకి తెలియనివి కావు.
అల్లోపతి డాక్టర్స్ లో కూడా చాలామంది అతి గాళ్ళే. ఏ కాలంలోనైనా, ఏ రోగం వచ్చినా ఏమైనా తినొచ్చు అంటారు. అల్లం, వెల్లుల్లి, పసుపు, ఆవిరి పట్టటం వేస్ట్ అన్నట్లు మాట్లాడతారు. సాధారణ తలనొప్పి, PCOD, మోకాళ్ళ నొప్పి తగ్గించలేనివాళ్లు ఆయుర్వేదం గురించి పూర్తి నెగటివ్ గా మాట్లాడటం ఆశ్చ్యర్యం కలిగిస్తుంది.
అల్లోపతిలో కొందరు మంచి డాక్టర్స్ ఉన్నారు. ఏ కాలంలో దొరికింది ఆ కాలంలో తినాలి అంటారు, తగిన వ్యాయామం, విశ్రాంతి ఉండాలి అంటారు. మన ఆచారాల్లోని మంచిని ఫాలో అవుతూ కావాల్సిన వాటికి ఇంగ్లీష్ మందులు కూడా వాడమంటారు. ఆయుర్వేదంలో కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు. ఏది ఏమైనా ప్రాచీన ట్రడిషనల్ మెడిసిన్ (మూలికావైద్యం, సిద్ధవైద్యం, యునాని, ఆయుర్వేదం, హోమియోపతి వంటి అన్ని దేశీయ వైద్యవిధానాలు) మీద ప్రతి కల్చర్, ప్రతి దేశం విస్తృత అధ్యయనం జరిపి వాటితో పాటు అల్లోపతి కాంబినేషన్ గా సమన్వయంతో ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటై అని ఎక్కువమంది అభిప్రాయం…… [ జగన్నాథ్ గౌడ్ ]
Share this Article