ఇజ్రాయెల్ తాను ఎంత శక్తిమంతమైనదో ప్రపంచానికి చాటి చెప్పింది! ఇరాన్ హుతిల డ్రోన్ దాడి తర్వాత కొంచెం సమయం తీసుకొని ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది యెమెన్ మీద!
యెమెన్ లోని సముద్ర తీరం లో ఉన్న పోర్టు నగరం అల్ – హోదేయా ( Al – Hodeideh) ను నేల మట్టం చేసింది! ఆపరేషన్ యద్ అరుక ! ఇజ్రాయెల్ పెట్టిన పేరు! Yad Aruka అంటే Long Arm . ఆపరేషన్ యద్ అరుక 1900 km దూరం ప్రయాణించి IAF ఫైటర్ జెట్ లు యెమెన్ మీద దాడి చేసి సురక్షితంగా వెనక్కి వెళ్లాయి!
విధ్వంసం ఎలా ఉంది?
హుతీ ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న అల్ – హోదీదేహ్ రేవు పట్టణంను నామరూపాలు లేకుండా చేసింది ఇజ్రాయేల్! Al – Hodeideh పోర్టు అనేది హుతీ ఉగ్ర గ్రూపుకు గుండె లాంటిది!
Ads
ఏవేవి ధ్వంసం అయ్యాయి!
1.పోర్టులో ఉన్న క్రూడ్ ఆయిల్ డిపోలు.
2. పొర్టులో ఉన్న ముడి చమురు శుద్ధి చేసే రిఫైనరీ.
3. శుద్ధి చేసిన పెట్రోల్, డీజిల్ ఇతర బై ప్రొడక్ట్స్ నిల్వలు.
4. ఇరాన్ సరఫరా చేసిన ఆయుధ నిల్వలు ఉన్న డిపోలు.
5. ఇరాన్ సరఫరా చేసిన రసాయన ఆయుధ నిల్వలు.
6. ఆహార నిల్వలు, మందులు ఉంచిన కోల్డ్ స్టోరేజ్!
7. ఇరాన్ సరఫరా చేసిన స్పీడ్ బోట్లు.
8. అల్ – సలీఫ్ మరియు రస్ – కతీబ్ అనే రెండు విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్లాంట్స్.
9. పోర్టుకి ఆనుకొని ఉన్న ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్.
********
వెస్ట్రన్ డిఫెన్స్ నిపుణులు ఏమన్నారు?
ఇది కాంప్లెక్స్ ఎటాక్! కాంప్లెక్స్ ఎటాక్ అంటే చాలా రకాల ఆయుధాలను ఒకేసారి ప్రయోగించి విధ్వంసం సృష్టించేందుకు వాడతారు.
కొన్ని బాంబులని మొదట ప్రయోగించి, అవి పేలుతున్న సమయంలో మరో రకం బాంబులను ప్రయోగిస్తారు అంటే మొదటి బాంబు పేలుళ్లతో కలిసి రెండో రౌండ్ లో ప్రయోగించే బాంబులు మొదటి దానితో కలిసిపోయి ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ తీవ్రతతో విధ్వంసం సృష్ఠిస్థాయి!
ఒకే ఆపరేషన్ తో మొత్తం పోర్టును నాశనం చేయడం కష్టం కానీ ఇజ్రాయెల్ ఆ మిషన్ ఇంపాజిబుల్ ను పాజిబుల్ చేసింది!
********
నేను గతంలో చెప్పాను కదా అమెరికా, బ్రిటన్ లు కలిసి దాడులు చేసినా ఉపయోగం లేకపోయింది అని కానీ ఇజ్రాయేల్ ఒకే ఒక్క Yad – Aruka ఆపరేషన్ తో ఎర్ర సముద్రంలో గత ఆరు నెలలుగా కొనసాగుతున్న అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టింది!
*********
ఒకే ఒక్క ఇజ్రాయేల్ పౌరుడిని చంపినందుకు హుతీ ల వెన్ను విరిచేసింది ఇజ్రాయేల్! ఇక ఇప్పట్లో హుతీ లు కోలుకోలేరు… హుతీలకి ఆదాయం క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసి అమ్మడం మీద వస్తుంది. అఫ్కోర్స్ ఆయిల్ ఉత్పత్తి చేసే రిగ్గులు యెమెన్ ప్రభుత్వానివి కానీ తిరుగుబాటు చేసి ప్రభుత్వం నుండి బలవంతంగా లాక్కున్నారు హుతీలు!
ఇంధన రిఫైనరీను మళ్లీ నిర్మించడం వీలు కాదు. ఆయుధాలు, స్పీడ్ బోట్లు, ఆహార నిల్వలు, మందులు ఏవీ లేవు ఇప్పుడు. పవర్ ప్లాంట్లని కొత్తగా నిర్మించుకోవాలి అంటే చైనా సహాయం చేయాలి కానీ సౌదీతో సంబంధాలు చెడగొట్టుకోదు చైనా. ఇరాన్ నుండి సరఫరా చేయడం కుదరదు, ఎందుకంటే సదరు రవాణా నౌక ఎర్ర సముద్రంలోకి రాగానే మాయం అవుతుంది అన్నమాట!
So! ఎక్కువ సంతోషించేది సౌదీ అరేబియా, UAE లు! అందుకే సౌదీ రాజు ఇజ్రాయేల్ F-35 లు తమ గగన తలాన్ని వాడుకోవడానికి అనుమతి ఇచ్చాడు!
******
ఇజ్రాయెల్ ను రెచ్చగొట్టకూడదు ! ఇజ్రాయెల్ ప్రతిస్పందించడం ఆలస్యం అవుతున్నది అంటే దానర్థం చేతకాకపోవడం కాదు సమూలముగా, శాశ్వతముగా నాశనం చేయడానికి కావాల్సిన వ్యూహం రచిస్తున్నది అని అర్థం!
******* [ పోట్లూరి పార్థసారథి ]
Share this Article