బిగ్‌బాస్ కన్నీటివరద శివజ్యోతి అలియాస్ సాఫిత్రక్క తెలుసు కదా… ఎమోటివ్… బిగ్‌బాస్ తనను సెలబ్రిటీని చేసింది… అందరితోనూ మంచిగా ఉంటది కాబట్టి తోటి ఆర్టిస్టులు కూడా తనను అభిమానిస్తారు… కాకపోతే ఆ ఏడుపు ఒక్కటే చిరాకు… ఒక లెవల్‌కు చేరుకున్న తరువాత ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలి… లేకపోతే నాలుక కూడా కంట్రోల్ తప్పుతుంది… మన పరువే పోతుంది… ఉదాహరణకు… జీటీవీ వాడు వుమెన్ డే స్పెషల్ ఈవెంట్ ఒకటి చేశాడు… ఈరోజే సాయంత్రం ప్రసారం… అందులో శివజ్యోతి మాట్లాడుతూ మళ్లీ ఏడ్చేసింది… ఎందుకు..? ‘‘వాడికేందిరా..? పెండ్లాం సంపాదిస్తుంటే కూసొని తింటుండు అని వెక్కిరిస్తారు, సపోర్ట్ చేసేవాళ్లను కూడా కిందపడేయాలని చూస్తరు… మీకేం తెలుసు మా లైఫ్ కష్టాలు..?’’ అని గరమైంది… నిజమే… ఆమె కోపంలో, ఆమె శోకంలో నిజాయితీ ఉంది, నిజం ఉంది… కానీ ఎవరో గుప్పెండు మంది అలా కామెంట్ చేసి ఉండవచ్చుగాక, సొసైటీలో అలాంటోళ్లు ఎప్పుడూ ఉంటారు… కానీ నువ్వేం చేశావ్..? మాట అదుపుతప్పి ఇప్పుడు ఓ మాస్ మీడియా తెర మీద ‘నా మొగుడు కూసుని తింటాడు, అయితే ఏమిటి..?’ అని నువ్వే ప్రకటించినట్టయింది… నష్టం తీవ్రత, బాధ్యత ఎవరిది..? ఎంత..?
అందుకే బుల్లితెర గానీ, వెండితెర గానీ… సోషల్ మీడియా సహా ఇంకా ఏదయినా పబ్లిక్ డొమెయిన్ గానీ… ఆవేశం పనికిరాదు… గంగులు అంటే మోటుగా ఉందని, గంగూలీ అని శానిగా పిలుచుకునే నువ్వే ఎక్కువ అవమానపరిచినట్టు కాలేదా..? సరే, ఆమె ఎపిసోడ్ పక్కన పెడితే… జీటీవీ వాడు వదిలిన ఆ ప్రోగ్రామ్ ప్రోమోకు యూట్యూబ్‌లో వన్ మిలియన్ వ్యూస్ కనిపించి ఆశ్చర్యపరిచింది… నిజానికి పండుగలు, పబ్బాలు, ఇంకేవో సందర్భాలు సహా రియాలిటీ షోలను పెంచుకుని నాన్-ఫిక్షన్ విభాగంలో రేటింగ్స్ పెంచుకోవాల్సిన తాపత్రయం జీవాడిది… కానీ జనాన్ని పిచ్చోళ్లను చేసే చెత్తా సీరియళ్లు, కామెడీ పేరిట దిక్కుమాలిన చవకబారు బూతుల్ని ప్రసారం చేసే ప్రోగ్రాముల నడుమ… వుమెన్ డే పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమం చేయడం అభినందనీయమే… 24 గంటల టీవీ చీకట్ల నడుమ చిన్న చిన్న మెరుపులు అన్నమాట ఇవి… వుమెన్ డే అనగానే ఏదో పిచ్చి కంటెంటు నింపకుండా కాస్త శ్రద్ధగా చేసినట్టు కనిపిస్తోంది…
Ads
ర్యాపర్ రోల్ రైడా పాట… తరువాత రీసెంటుగా కరెంటు సంస్థల్లో లైన్ వుమెన్‌గా ఎంపికైన ఇద్దరు ఉద్యోగుల పరిచయం… ఈమధ్య ఓ అనాథ శవాన్ని మోసి పాపులరైన ఎస్సయ్ శిరీష… శివజ్యోతి… చాలా రోజుల తరువాత మళ్లీ తెరపై వెటరన్ యాంకరిణి ఉదయభాను… రీసెంట్ అందాల కిరీటధారిణి వారణాసి మానసి… నర్సపెల్లే పాటతో బాగా పాపులారిటీ సంపాదించిన కనకవ్వ… వైణకురాలు శ్రీవాణి వీణానాదం… టీవీ ఆర్టిస్టు మేఘన… Dancer Sandhya Raju… మహిళ ప్రాధాన్యం తెలియజేస్తూ ఒకటీరెండు స్కిట్లు… రకరకాల అంశాల్ని ఓ బొకేగా చేశారు… కాన్సెప్టు, ప్రయత్నం బాగుంది… చాలామంది టీవీ, సినిమా సెలబ్రిటీలనూ పిలిచారు… వాస్తవానికి ఇలాంటివి ఈటీవీ చేసేది… అది ఈమధ్య ట్రాక్ తప్పింది కదా… ఇక మాటీవీ, జీటీవీ నాన్-ఫిక్షన్ రేటింగుల కోసమైనా సరే, కాస్త బుర్ర పెట్టి కొత్త ప్రోగ్రాముల్ని ఆలోచిస్తున్నారు… గుడ్… అన్నట్టూ, అప్పుడెప్పుడో పూర్వకాలంలోనే యాంకరిణిగా చేసి వెలిగిన ఉదయభాను ఇక తెరకు శాశ్వతంగా దూరమైనట్టేనా..?
Share this Article