కథల్లేవు, కథల్లేవు అంటుంటారు మన ఇండస్ట్రీలో చాలామంది… అందుకే కాపీలు, రీమేకులు… కానీ అసలు నిజమేమిటంటే… కథలకు కొదువ లేదు… ఎటొచ్చీ వాటిని సరిగ్గా పట్టుకునేవాళ్లు లేరు, దొరికన కథను బాగా ప్రజెంట్ చేసేవాళ్లు కరువు…
వరుణ్ సందేశ్ నటించిన విరాజి సినిమా అంతే… స్టోరీ మెయిన్ లైన్ బాగుంది… ఒక వృత్తితో మరొకరికి సంబంధం లేని ఓ పది మంది… ఏదో ఈవెంట్ పేరిట ఊరికి దూరంగా ఉండే ఓ పిచ్చాసుపత్రికి రప్పించబడతారు… ఓ పోలీస్, ఓ డాక్టర్, ఓ స్టాండప్ కమెడియన్, ఓ ఫోటోగ్రాఫర్, ఓ నిర్మాత, ఓ సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్… ఇలా…
ఓ మరణంతో వీళ్లకు సంబంధం… తీరా ట్రాపులో పడ్డాక తప్పించుకోవడానికి ప్రయత్నాలు… ఇద్దరిని హతమార్చే ఆగంతకుడు… లేటుగా ఎంట్రీ ఇచ్చే హీరో… మిస్టరీ చేధించే ప్రయాస… వెరసి మంచి కథే… కొత్త దర్శకుడి చేతిలో పడి, సరైన స్క్రీన్ ప్లే లేక బోర్‌గా సాగుతుంది…
Ads
ఎవరైనా అనుభవమున్న దర్శకుడి చేతిలో పడి ఉంటే ఈ కథ రక్తికట్టేదేమో… అక్కడికి ఈ దర్శకుడు కూడా మెయిన్ ప్లాట్‌లోని సస్పెన్స్‌ను చివరి వరకూ బాగానే కంటిన్యూ చేశాడు… కాంటెంపరరీ ఇష్యూ టచ్ చేసి చివరి అరగంట ఆకట్టుకున్నాడు… ఎటొచ్చీ ఫస్టాఫ్ నీరసంగా సాగుతుంది పాత్రల పరిచయాలతో…
నిజానికి ఇది అరగంట, ముప్పావుగంట స్టోరీయే… కానీ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిమ్ పేరిట సాగదీయడంతో కథనంలో బిగి సడలి, టెంపో లూజ్ అయిపోయింది… అంత సాగదీసినా గంటానలభై నిమిషాలే సినిమా… ఇక అంతకుమించి గుంజలేకపోయాడు… వరుణ్ సందేశ్ నటన అక్కడక్కడా ఇంకా హేపీడేష్‌లో ఉన్నట్టే… ప్చ్, మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడైనా కాస్త నటనకు పదును పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది…
పైగా తన హెయిర్ స్టయిల్ వెరయిటీగా ఆకట్టుకుంటుంది అనుకున్నట్టున్నారు గానీ పెద్దగా లుక్కు బాలేదు… అక్కడక్కడా బీజీఎం పర్లేదు, కానీ మిగతా టెక్నికల్ అంశాల్లో పూర్… కొన్నిచోట్ల ఓవర్ డ్రామా, మరికొన్నిచోట్ల ల్యాగ్ సీన్లతో విసుగు తెప్పిస్తుంది… వరుణ్ సందేశ్ తప్ప వేరే ప్రముఖ నటులు లేరు… మ్యాగ్జిమం స్టోరీ ఒకే లొకేషన్…
నిజానికి ఇలాంటి కథలు ఎక్కువగా ఓటీటీల్లో కనిపిస్తున్నాయి… థియేటర్ దాకా రప్పించలేవు ఈ స్టోరీలు, ఈ నీరస కథనాలు… చాన్నాళ్లుగా ఓ మెరుగైన సినిమా లేదు మార్కెట్‌లో… మహారాజ, కల్కి తప్ప… ఓ మోస్తరుగా ఉన్నా నాలుగు రోజులు నడిచే స్కోప్ ఉన్న వాక్యూమ్ ఉంది… కానీ భర్తీ చేసే సినిమాలేవీ..?! అవునూ, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక ఇప్పటివరకూ ఒక్క హిట్ కూడా లేనట్టుంది కదా వరుణ్ సందేశ్‌కు… ఫాఫం..!!
Share this Article