మన టీవీ, మన సినిమా ఇండస్ట్రీలే కాదు… దేశమంతా దాదాపు సేమ్… ఒక్కసారి సినిమా హీరో అయితే చాలు, ఇక ఎక్కడాలేని ఇగో తలకెక్కుతుంది… అది చాలా చిన్న సినిమా కావచ్చుగాక… హీరో అనే పదం తనను తాను ఓ దైవాంశసంభూతుడిని చేస్తుంది… చకచకా కళ్లు నడినెత్తికి ఎక్కుతాయి… మేఘాల్లోకి చేరుకుంటారు… ఇక దిగిరారు… అతిశయాలు, ఆభిజాత్యాలు, అహంకారాలు, నానా ఎదవ్వేషాలు గట్రా చాలా అవలక్షణాలు వచ్చి చేరతాయి… అలాగే బతుకుతూ, అట్నుంచి అటే మేఘాల్లో కలిసిపోయేవాళ్లు కూడా బోలెడుమంది… ఇవన్నీ చాలా కామన్ అంటారా..? అవును, కామనే… కానీ కొందరు ఉంటారు… డౌన్‌టుఎర్త్… ఆస్తులు సంపాదించినా, స్టార్డం వచ్చిపడినా, అవకాశాలు కొన్ని వరించినా… తన రూట్స్, తన జర్నీ ప్రారంభమైన చోటు మరిచిపోరు, విడిచిపెట్టరు… సుడిగాలి సుధీర్‌ను చూస్తే ఈ కోణంలోనే కాస్త ముచ్చటేస్తుంది…
తను నిజంగా ఫీల్డులో ఎలా ఉంటాడో, సెట్లలో ఎవరితో ఎలా వ్యవహరిస్తాడో తెలియదు… కానీ తెరపై మాత్రం తనను తాను ఆవిష్కరించుకునే తీరు మాత్రం కాస్త మెచ్చుకోవాలి… ఓ చిన్న కమెడియన్‌గా అప్పుడెప్పుడో ఈటీవీ జబర్దస్త్ నుంచి తన జర్నీ స్టార్టయింది… టీం లీడరయ్యాడు… మరికొన్ని ప్రోగ్రాములూ చేశాడు… యాంకర్, పర్ఫామర్… మేజిక్కులు చేయగలడు, డాన్సులు చేస్తాడు, స్టంట్స్ చేస్తాడు… త్రీమంకీస్, సాఫ్ట్వేర్ సుధీర్, సహస్రా కాలింగ్ సినిమాల్లో హీరో… కొన్ని సినిమాల్లో చిన్నాచితకా వేషాలు… ఏం చేసినా సరే… తను ఉన్నచోటే ఉండిపోయాడు… అది మాత్రం వదలడు… అది తనూ, తన జబర్దస్త్, తన టీం, తన స్కిట్లు, తన రష్మి… అసలు అది కాదు… మరొకటి చెప్పుకోవాలి…
Ads
ఢీ షో చూస్తే… అందరూ తననే టార్గెట్ చేసి ఆడుకుంటారు… సెటైర్లు వేస్తారు… ఎడ్డివాడిని చేసి గేలి చేస్తారు… అఫ్ కోర్స్, అదంతా స్క్రిప్టులే భాగమే… వినోదం కోసమే… అయినా సరే, తనెక్కడా ఫీల్ కాడు… తనే బకరా కావటానికి కూడా ఇష్టపడతాడు… ఆ బకరా పాత్రలో జీవిస్తాడు… జబర్దస్త్ స్కిట్లలో కూడా చిన్నచిన్న వేషాలు, ప్లేబోయ్ ఇమేజీ… దేనికీ వెనక్కిపోడు… మొన్నామధ్య తనకు కడుపైనట్టు ఓ స్కిట్… టీం ఇతర సభ్యులు తనకు సీమంతం కూడా చేస్తారు… ఇప్పుడు ఏకంగా తనకు ఓ బాబు పుట్టినట్టు మరో స్కిట్… స్క్రిప్ట్ చెబితే అంతే… రెడీ… ఒక ప్లే బాయ్ ఇమేజీ నుంచి అకస్మాత్తుగా పిల్లల్ని కనే ఓ డిఫరెంట్ సరదా వేషం… ఒక సినిమా హీరో నుంచి దీన్ని ఎక్స్పెక్ట్ చేయగలమా..? ఎంత చిన్న హీరో అయినా సరే, చివరకు టీవీ సీరియళ్లలో హీరోలు కూడా అంగీకరించరు… (సుడిగాలి సుధీర్ ఇక్కడ.., నేనే పిల్లల్ని కన్నాను.., నువ్వెంతరా అని తనే ఆ స్కిట్లో ఆటో రాంప్రసాద్ మీద నవ్వుతూ పంచ్ వేస్తాడు కూడా…) ఒక కోణంలో ఇది స్పిరిట్… ఎప్పటిలాగే ఒదిగి ఉండటం, ఇలాంటి పాత్రల్ని అంగీకరించడం అందరివల్లా కాదు… మిగతా కమెడియన్లు టీవీ చానెళ్ల మధ్య రాజకీయ నాయకుల్లా జంపింగ్ జపాంగ్ అంటున్నా సరే, సుధీర్ ఈటీవీని మాత్రం వదల్లేదు… తనను ఈటీవీ నుంచి కత్తిరించే కథలు కొన్ని నడుస్తున్నా సరే, దాన్ని అంటిపెట్టుకునే ఉంటున్నాడు… ఈ క్రమంలో సీమంతాలు చేసుకుంటాడు, పిల్లల్నీ కంటాడు… ఇంకేమైనా చేస్తాడు… దటీజ్ సుధీర్… తన ఫ్యాన్స్ అవమానపడాల్సిన పని లేదు… తను వెళ్తున్నది సరైన తోవే…! చాలామందికి చేతకానిదే..!
Share this Article