ఒక వార్త చదవబడ్డాను… చివరి వరకూ ఏదేదో రాసుకుంటూ వచ్చాడు సదరు విలేకరి, వోకే… చివరలో హఠాత్తుగా మౌస్ ఆగిపోయింది… ఒకటికిరెండుసార్లు చదవబడింది…
ముందుగా ఆ వార్త ఏమిటంటే..? నాగచైతన్య బాగా ఆశలు పెట్టుకున్న సినిమా తండేల్… దాదాపు వంద కోట్లు పెడుతోందట గీతా ఆర్ట్స్ సంస్థ… పర్లేదు, ఫస్ట్ పోస్టర్ నుంచి టీజర్ దాకా అన్నీ కాస్త పర్లేదనే అనిపించాయి… చిత్రీకరణ చివరి దశలో ఉంది… నాగచైతన్య కష్టపడుతూ ఉన్నాడు…
క్రిస్టమస్‌కు రిలీజ్ అన్నారు గానీ, ఫిక్స్ కాలేదు, అప్పుడు గేమ్ చేంజర్ అనే మరో భారీ సినిమా రావల్సి ఉందట… సో, డబ్బులు కుమ్ముకోవడానికి తగిన గ్యాప్ ఎలాగూ ఇచ్చుకుంటారు కదా… మామూలుగా సినిమా కథను ముందుగా బయటపెట్టరు… థ్రిల్ పోతుందని… స్పాయిలర్ అవుతుందని… కానీ రీసెంటుగా మీడియాతో మాట్లాడుతూ బన్నీ వాసు ఆ సినిమా కథను చెప్పేశాడు…
Ads
కథ ఇంట్రస్టింగ్… మంచి స్టోరీ లైన్… ఇది వాస్తవంగా జరిగిన కథ అని మేకర్స్ చెబుతున్నారు… నిజమే అనుకుందాం కాసేపు… నిజమైన కథ అయినా సరే, నిజమో కాదో అన్నంతగా క్రియేటివ్ లిబర్టీ తీసుకుని మరీ ప్రజెంట్ చేస్తారు కదా మనవాళ్లు… అందుకే సినిమా వచ్చేదాకా ఆ విషయంలో సైలెన్స్…
21 మంది జాలర్లు శ్రీకాకుళం దగ్గరున్న మచిలేశ్వరం నుంచి గుజరాత్ దగ్గర పనిచేయడానికి కంట్రాక్టు బేసిస్ మీద వెళ్తారు… అక్కడి నుంచి పాకిస్థాన్ నడుమ ఉన్న సముద్రజలాల్లో విస్తృత మత్స్య సంపద ఉంటుంది… ఈరోజుకూ అక్కడ చేపల వేట చాలా ప్రధానమైన వృత్తి… గొడవలూ సాధారణమే… ఈ సినిమా కథలోనూ అలాంటి మన జాలర్లు అనుకోకుండా పాకిస్థాన్ ఆధీనంలోని జలాల్లోకి వెళ్తారు…
ఆ సైన్యానికి దొరికిపోతారు… అసలే అది ఇండియా పాకిస్తాన్ నడుమ ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్న సందర్భం… (ఎప్పుడు కాదు..?) మన దేశం మీద ఓ మేజర్ టెర్రర్ అటాక్ కూడా జరిగింది… ఐతే ఆ స్థితిలోనూ మనవాళ్లు బయటికి ఎలా వచ్చారనేదే కథ… దీనికి సమాంతరంగా ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది…
పట్టుబడిన ఆ 21 మంది జాలర్ల కోసం ఆడవాళ్లు ఎలా ఫైట్ చేశారనేది స్టోరీ మెయిన్ పాయింట్… నిజమే, కథ స్థూలంగా ఎలా ఉన్నా, ఎలా ప్రజెంట్ చేస్తారనేదే ముఖ్యం… ఇక్కడిదాకా సదరు బన్నీ వాసుడు బాగానే చెప్పాడు… కానీ చివరలో ప్రేక్షకులను మచిలేశ్వరం నుంచి కరాచీకి తీసుకెళ్తాం అని ముక్తాయించాడు…
ఎందుకు..? ప్రేక్షకుల్ని కరాచీకి తీసుకెళ్లడం దేనికి..? మా సినిమాల్లో చూపిందంతా నిజమే అని నిరూపించే ప్రయత్నమా..? అదేదో కథలో, కథనంలో బలంగా ప్రజెంట్ చేస్తే సరిపోతుంది కదా… పైగా కరాచీకి మన లోకల్ మత్స్యకారుల్ని తీసుకెళ్లడం అంత వీజీ కూడా కాదు… ఇది సినిమా షూటింగ్ కాదు, ఇలా పర్మిషన్ తీసుకొని అలా వెళ్లిరావడానికి… పైగా కరాచీ తీసుకుపోయి చెప్పేదేముంటుంది..? హేమిటో, ఈ సినిమావాళ్లు అస్సలు అర్థం కారు, అర్థమయ్యే సినిమాలూ తీయరు..! తెలుగులో సాయిపల్లవికి చాలా గ్యాప్ వచ్చింది కదా… ఇందులో ఆమే హీరోయిన్… అదీ ఓ ఆకర్షణే సినిమాకు..!!
Share this Article