బార్క్ రేటింగ్స్ తాజావి పరిశీలిస్తుంటే… (న్యూస్ చానెల్ రేటింగ్స్) ఆశ్చర్యం కలిగింది… ఆమధ్య నాలుగైదు టాప్ చానెళ్ల జాబితాలోకి కూడా చేరిన సాక్షి చానెల్ ఇప్పుడు ఏకంగా తొమ్మిదో ప్లేసులోకి వెళ్లిపోయింది… అసలు ఆ ప్లేసు అని కాదు, అసలు ఎవరూ పెద్దగా చూడరు అనే అభిప్రాయం, అదే రేంజ్ రేటింగ్స్ ఉంటే ఈటీవీ తెలంగాణ చానెల్ సరసన చేరిపోయింది సాక్షి టీవీ… ఫాఫం, చివరకు మహాన్యూస్ కూడా సాక్షితో పోటీపడే రేంజుకు వచ్చేసింది…
రాజకీయాల్లో వైసీపీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో చూశాం కదా… అదే రేంజ్ పతనం సాక్షి టీవీ విషయంలోనూ కనిపిస్తోంది… అఫ్‌కోర్స్, అది పార్టీ చానెలే కాబట్టి జగన్ మీద పెరిగిన నెగెటివిటీ ప్రభావం చానెల్ మీద కూడా కనిపించడం సహజం… కానీ మరీ ఈ పతనం ఆశ్చర్యకరం… టెన్ టీవీ, టీన్యూస్ కూడా దాన్ని దాటేశాయి… టాప్ వన్ ప్లేసులో ఉన్న టీవీ9 రేటింగులతో పోలిస్తే, వాటిల్లో సాక్సి రేటింగ్స్ అయిదో వంతు, ఆరో వంతు ఉన్నాయి…
Ads
ఒకప్పుడు ఎన్టీవీ, టీవీ9 పోటీపడ్డాయి… ఓ దశలో ఎన్టీవీ టాప్ వన్ ప్లేసులోకి వెళ్లిపోయింది… ఇప్పుడు చూస్తే టీవీ9 రేటింగ్సులో ఎన్టీవీ రేటింగ్స్ దాదాపు సగమే… అంటే, ఇప్పట్లో ఇక టీవీ9 కు పోటీ ఇచ్చే సీన్ లేకుండా పోయినట్టే… ఇదీ ఆశ్చర్యకరమైన పతనమే… ఏదో ఆంధ్రాలో టీవీ9, సాక్షి, ఎన్టీవీ గట్రా చానెళ్ల ప్రసారాలపై ఆంక్షలు, పరిమితులు అన్నారు గానీ… ఆ ప్రభావం రేటింగుల మీద ఏమీ కనిపించడం లేదు…
ఈరోజుకూ టాప్ టు చానెల్స్ టీవీ9, ఎన్టీవీ మాత్రమే… ఒకప్పుడు వీటితో పోటీపడిన ప్యూర్ తెలుగుదేశం చానెల్ ఇప్పుడు ఆ చానెల్ నంబర్‌కు తగినట్టు ఐదో ప్లేసులోకి జారిపోయింది… అనుకోకుండా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నాలుగో ప్లేసులోకి వచ్చింది… కొన్నాళ్లు పోతే అది ఎన్టీవీకి పోటీగా రెండో ప్లేసు కోసం ప్రయత్నిస్తుంది, ఖాయం… ఆల్రెడీ అది హైదరాబాద్ కేటగిరీలో సెకండ్ ప్లేస్…
సరే, సాక్షి గురించి చెప్పుకుంటున్నాం కదా… ఇతర కేటగిరీలు చూసినా ఇదే గతి… హైదరాబాద్ కేటగిరీలో సాక్షి టీవీ మరీ తొమ్మిదో ప్లేసు.,. ఆంధ్రా చానెల్‌గా పరిగణించే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ చానెల్ హైదరాబాద్ కేటగిరీలో మరీ పదో ప్లేసు ఫాఫం… 75 అర్బన్ కేటగిరీలో కూడా సాక్షి టీవీ తొమ్మిదో ప్లేసు… రూరల్ కేటగిరీలో ఏడో ప్లేసు… అర్బన్ కేటగిరీలో మరీ పదకొండో ప్లేసు… మొన్న వైసీపీకి ఎన్నికల్లో వచ్చిన సీట్ల సంఖ్యలాగే…! ఈ కేటగిరీలో మహాన్యస్ కూడా సాక్షిని దాటేసింది..! మరి సాక్షి పత్రిక గతేమిటీ అంటారా..? ఏమో, మళ్లీ ఏబీసీ వచ్చేవరకూ ఆగాల్సిందే..!
Share this Article