వినేష్ ఫొగట్ వల్ల కాదు.. ఇదిగో ఇప్పుడు పోయింది ఇండియా పరువు!
ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా డిస్‌క్వాలిఫై అయ్యి అంతర్జాతీయ వేదికపై భారత పరువు తీసిందని కొంత మంది వాదిస్తుండగా.. అదేమీ లేదు. ఆమె దేశ్ కి బేటీ.. నిజమైన బంగారం. మన మహిళల సత్తా ఏమిటో నిరూపించిన ధీర వనిత అంటూ మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. దేశం ఇప్పుడు వినేష్ విషయంలో రెండుగా విడిపోయి వాదోపవాదాలు చేసుకుంటోంది. కానీ అదే సమయంలో నిజంగానే దేశం పరువు ప్యారీస్ వీధుల్లోకి ఈడ్చిపారేశారు.
వినేష్ ఫొగట్ వాస్తవానికి తలపడాల్సిన 53 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం నుంచి అంతిమ్ పంగల్ అనే క్రీడాకారిణి ఒలింపిక్స్‌కు సెలెక్ట్ అయ్యింది. తొలి రౌండ్‌లో 0-10 తేడాతో కేవలం 101 సెకెన్లలో టర్కీకి చెందిన జైనెప్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఆ బౌట్ ముగిసిన తర్వాత అంతిమ్.. ఒలింపిక్ విలేజ్‌కు వెళ్లకుండా నేరుగా హోటల్ రూమ్‌కి వెళ్లింది.
Ads
అక్కడ ఉన్న అంతిమ్ తన సోదరి నిషాకు అక్రిడిటేషన్ కార్డు ఇచ్చి.. స్పోర్ట్స్ విలేజ్‌లో ఉన్న తన వస్తువులు తీసుకొని రమ్మని పంపింది. నిషా స్పోర్ట్స్ విలేజ్‌లోకి అంతిమ్‌లాగా వెళ్లడానికి ప్రయత్నించగా.. అక్కడి భద్రతా సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు.
మరోవైపు అంతిమ్ సపోర్టింగ్ స్టాఫ్ ( ఆమె కోచ్‌లు భగత్ సింగ్, వికాస్) విపరీతంగా తాగి క్యాబ్‌లో ప్రయాణించారు. దిగిన తర్వాత డబ్బులు ఇవ్వడానికి నిరాకరించి డ్రైవర్‌తో గొడవపడ్డారు. దీంతో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఒకవైపు అంతిమ్ తన సోదరిని తనలా స్పోర్ట్స్ విలేజ్‌లోకి పంపించడం, మరోవైపు అంతిమ్ సపోర్టింగ్ స్టాఫ్ పోలీసు కేసులో ఇరుక్కోవడంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ను ఇరుకునపెట్టింది. ఐఓసీ, ఫ్రాన్స్ పోలీసులు పై నలుగురిని కూడా ఇండియాకు ‘డీపోర్ట్’ చేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఐఓఏకు చెప్పారు. చివరకు నలుగురి వీసాలు క్యాన్సిల్ చేసి ఇండియాకు డీపోర్ట్ చేశారు.
వినేష్ ఫొగట్ తలపడాల్సిన కేటగిరీలోకి అంతిమ్ రావడమే కాకుండా.. 101 సెకెన్ల వ్యవధిలో ఓడిపోవడం.. తర్వాత జరిగిన పరిణామాలతో ఇండియా పరువును తీసేశారు…. భాయ్‌జాన్ [ John Kora ]
Share this Article