నీరజ్ చోప్రా… తన రజత ప్రతిభను మెచ్చుకుందాం… గత ఒలింపిక్స్ స్వర్ణం, ఈ ఒలింపిక్స్ రజతం… గ్రేట్… కానీ తనపై ఈసారి కూడా బంగారు ఆశలు పెంచుకున్న కారణమేమో గానీ… ఫైనల్స్‌లో తన ఫౌల్ త్రోల సరళి వల్లనేమో గానీ… బాగా నిరాశపరిచాడు… తను కూడా మనూ బాకర్ తరహాలో ‘నా కర్మ నేను చేస్తా, ఫలితం దైవాధీనం’ అనే స్థిరచిత్తంతో వ్యవహరిస్తే బాగుండేది… కానీ బాగా ఫ్రస్ట్రేటైనట్టున్నాడు…
మొదటి త్రో ఫౌల్… మరోవైపు పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీం మొదటి త్రో కూడా ఫౌల్… రెండో త్రోలో నీరజ్ తేరుకుని 89.45 మీటర్లు విసిరాడు… అర్శద్ తన రెండో త్రోలో ఏకంగా 92.97 మీటర్లు (ఆల్మోస్ట్ 93) విసిరాడు… ఒలింపిక్ రికార్డు… ఇక తనకు సమీపంలో ఎవరూ రారనే ధీమాతో అతను తాపీగా, ఏ ఒత్తిడీ లేకుండా మిగతా త్రోలలో స్థిరంగా వ్యవహరించాడు… మరోసారి 91.79 మీటర్లు విసిరాడు… కూల్…
కానీ మన నీరజ్ ఏం చేశాడు..? రెండో త్రోలో తన సీజన్ బెస్ట్ ఇచ్చాడు… ఆ తరువాత ఇక అన్నీ పౌల్ త్రోలే… చాలా అసహనంగా కనిపించాడు… అసలు పాత నీరజ్‌నేనా మనం చూస్తున్నది అన్నట్టుగా ఉంది తన ధోరణి… తన ప్రత్యర్థి ఏకంగా ఒలింపిక్ రికార్డు బ్రేక్ చేసేసరికి, ఇక ఆ ఒత్తిడి నీరజ్‌పై బాగా పడి, తన జావెలిన్ అదుపు కోల్పోయింది… చివరకు ఆ 89.45తోనే సరిపుచ్చుకుని, రజతంతో మమ అనిపించేశాడు… చాలామంది అర్ధరాత్రి స్వర్ణం మీద ఆశలు పెట్టుకుని లైవ్ చూశారు, నిరాశకు గురయ్యారు…
Ads
నిజానికి ఈసారి ఒలింపిక్స్ దేశ క్రీడాభిమానులకు పెద్ద థ్రిల్ ఇవ్వడం లేదు… భారీ టీం వెళ్లింది గానీ… నాసిరకం ప్రదర్శన… నిఖత్ జరీన్, పీవీ సింధు, మీరాబాయి చాను వంటి ప్లేయర్ల మీద బాగా ఆశలుండేవి… ఆ ముగ్గురూ నిరాశపరిచారు… కొంతలోకొంత మనూ బాకర్ కాస్త ఇజ్జత్ నిలబెట్టింది… ఒక ఈవెంటులో నిరాశపరిచినా సరే…! ఒడిస్సా ప్రభుత్వ స్పాన్సర్‌షిప్‌తో బాగా రాటుదేలిన హాకీ టీం కాంస్యం గెలిచి కాస్త ఆనందాన్ని కలిగించింది కానీ…
వినేశ్ ఫోగట్… 100 గ్రాముల అధిక బరువుతో ఫైనల్‌కే దూరం కావడం చినికిచినికి ఓ రాజకీయ దుమారంగా కూడా మారింది… ఆమె గతంలో 2016లో కూడా అధిక బరువుతో వైదొలిగింది… అసలు 50 కిలోల కేటగిరీలో పోటీపడటం ఏమిటి..? జుత్తు కత్తిరించుకుంది, రక్తం తీసేసుకుంది, గ్రేట్ అంటూ ఒకటే హోరు… పైగా మోడీ తనే ఏదో స్వయంగా కుట్రపన్నినట్టుగా కార్టూన్లు, విమర్శలు, మీమ్స్, చివరకు పార్లమెంటులో రాజకీయ విమర్శలు… ఒకరైతే ఆమెకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్…
ఓ బీజేపీ ఎంపీ అకృత్యాల మీద బాగానే పోరాడింది, డిస్ట్రబ్ అయ్యింది… ఐనా సరే, ఫైటింగ్ స్పిరిట్ కోల్పోకుండా ఒలింపిక్స్‌లో మంచి ప్రతిభ ప్రదర్శించింది… చివరకు ఈ అధిక బరువు అనర్హత వేటు పడేసరికి, అందరూ దీన్ని యాంటీ-మోడీ క్యాంపెయిన్‌కు అవకాశంగా మల్చుకున్నారు… సరే, తన సపోర్టింగ్ స్టాఫ్ ఏదో కుట్ర పన్నారు అనుకుందాం… తనే కదా జాగ్రత్తగా ఉండాల్సింది, గతానుభవమూ ఉంది కదా… ఒలింపిక్స్ రూల్సన్నీ తెలుసు కదా… ఆ కోచ్ కూడా తన ఎంపికే కదా… నమ్మకస్తుడే కదా…
నిజానికి ఆమెకు కేంద్ర ప్రభుత్వం శిక్షణ, సపోర్టింగ్ స్టాఫ్ కోసం నిధులిచ్చింది… కేంద్రం ఏదో కుట్ర పన్నితే ఒలింపిక్స్ దాకా ఎందుకు పోనిస్తుంది..? ఫైనల్ దాకా ఎందుకు రానిస్తుంది..? ఈ అనర్హత వేటు దురదృష్టం… కానీ అనవసర దుమారం… ఈ అధిక బరువు తగ్గింపు ప్రయాస చాలామంది క్రీడాకారులు ఎదుర్కునేదే… ఇదేసమయంలో ఓ ఇటలీ క్రీడాకారిణిపై కూడా అనర్హత వేటు పడింది…
మరోవైపు అంతిమ్ అనే మరో క్రీడాకారిణి క్రమశిక్షణ, రూల్స్ ఉల్లంఘించి డిపోర్టేషన్‌కు గురైంది… చివరకు ఇప్పుడు మనం నాలుగు కాంస్యాలు, ఒక రజతంతో ఎక్కడో అడుగున ఉండిపోయాం పతకాల పట్టికలో… ఏమో, ఒకటో రెండో జత కలుస్తాయేమో… మొత్తానికి ఈసారి ఒలింపిక్స్ పెద్దగా ‘కిక్’ ఇవ్వలేదు…!!
Share this Article