జూనియర్ ఎన్టీయార్ తప్పు చేస్తున్నాడా..? లేక తన నిర్ణయం కరెక్టేనా..? టీవీ, సినిమా బిజినెస్ సర్కిళ్లలో ఇది ఆసక్తి రేపుతున్న ప్రశ్న… మీలో ఎవరు కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ చేస్తున్నాడు తను… దీనికోసం గత డిసెంబరులోనే సన్ నెట్‌వర్క్‌తో జూనియర్ ఎన్టీయార్‌కు ఒప్పందం కుదిరిందని ‘ముచ్చట’ ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని రాసింది… అదిప్పుడు కార్యరూపంలోకి వచ్చింది… సదరు ప్రోగ్రామ్ ప్రోమోల్లో హోస్ట్ మొహం చూపకుండా, ఏదో సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు గానీ… అది జూనియర్ ఎన్టీయారేనని అందరికీ తెలుసు… అయితే జూనియర్ నిర్ణయం సరైనదేనా అనే చర్చకు కొన్ని కారణాలున్నయ్… అవి బిజినెస్, రీచ్, రేటింగ్స్, యాడ్స్ కోణంలో సాగుతున్నయ్… ఇంట్రస్టింగే… ఆర్ఆర్ఆర్ తరువాత మళ్లీ ఆ రేంజ్ సినిమా ఏదో సైన్ చేస్తాడూ అనుకుంటే ఈ టీవీ రియాలిటీ షో చేస్తున్నాడేమిటి అనేది మొదటి ప్రశ్న… వీలయితే ప్రభాస్ తరహాలో ఓ పాన్ ఇండియా సినిమా చేయొచ్చుకదా అనే ఓ సందేహం…
నిజానికి టీవీ రియాలిటీ షోలను తేలికగా తీసేసే కాలం కాదు ఇది… అసలు వాటిదే భవిష్యత్తు కూడా… కాకపోతే సినిమాలకుండే బిజినెస్ రేంజ్ వేరు… వాస్తవానికి టీవీలు, ఓటీటీలే కదా ఇప్పుడు సినిమాలకు దీటుగా వెలుగుతున్నవి… ఇప్పుడే కాదు, టీవీల్లో రియాలిటీ షోలు చాలా ఏళ్లుగా ఫోకస్లో ఉన్నవే… సినిమాలకన్నా ఒక యాక్టర్‌ను ఇంటింటికీ తీసుకుపోయేవి టీవీ షోలే… బిగ్‌బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు వంటివి… వాటి బిజినెస్ రేంజ్ కూడా ఏటేటా భారీగా పెరుగుతోంది… పైగా టీవీ రియాలిటీ షోలలో హోస్టుగా అలరించడం అందరివల్లా కాదు… జూనియర్ పర్ఫెక్ట్… బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్‌తోనే నిరూపించుకున్నాడు… తరువాత సీజన్లు చేసిన నాని, నాగార్జున పర్లేదు గానీ జూనియర్ లెవల్లో క్లిక్ కాలేదు… మీలో ఎవరు కోటీశ్వరుడు (కౌన్ బనేగా కరోడ్పతికి తెలుగు రూపం) గతంలో మాటీవీలో వచ్చేది… నాగార్జున మొదటి మూడు సీజన్లూ చేశాడు… బాగా చేశాడు… నో కంప్లయింట్స్… ఆ షోతో తన యాటిట్యూడే మారిపోయినట్టు కూడా నిజాయితీగా చెప్పుకున్నాడు ఓసారి… ఎంతటి సుప్రసిద్ధ మెగా స్టార్ అయినా సరే చిరంజీవి ఇందులో ఫ్లాప్… ఈ దెబ్బకు మాటీవీ ఆ షో మొత్తమే ఆపేసింది…
Ads
ఇప్పుడు జూనియర్ సన్ టీవీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు… సో, మీలో ఎవరు కోటీశ్వరులు అని కాస్త కొత్త హంగులు, మేకప్పులతో వస్తోంది… గుడ్… నానా చెత్తా టీవీ సీరియళ్లు, జబర్దస్త్ వెగటు కామెడీతో పోలిస్తే ఈ ప్రోగ్రాం వంద కాదు, వేయి రెట్లు బెటర్… అయితే ఇది జెమినిలో రానుంది… దాని రీచ్ చాలా తక్కువ… ప్రమోషన్ ఉండదు, పూర్ మేనేజ్మెంట్… పేరుకు దక్షిణాదిన గొప్ప నెట్వర్క్ అయినా సరే, ఇప్పుడు తెలుగు వినోద చానెళ్లలో నాలుగో ప్లేసు… అసలు అది చెప్పదగిన స్థానం కూడా కాదు… దానికి ఎవరూ రెగ్యులర్ ప్రేక్షకులు లేరు… ఏవైనా కొత్త సినిమాలు వస్తే రేటింగ్స్… అంతే… ఇదే ప్రోగ్రాం గనుక మాటీవీ వాడు చేసి ఉంటే అది కార్తీకదీపం రేంజ్లో రేటింగ్స్ సంపాదించేది… మాటీవీ వాడు ఆ మాయోపాయం చేసేవాడు… దాని రీచ్ ఎక్కువ… దానితో పోటీపడుతున్నది జీతెలుగు… ఇలాంటి రియాలిటీ షోలకు ఈటీవీ పెట్టింది పేరు… ఈ మూడు గాకుండా జెమినిలో రాబోతోంది ఈ షో… అదే చర్చకు కారణం…
నో డౌట్… జెమిని వాడికి ఇది చాలా ప్లస్ పాయింట్… పుషింగ్ పాయింట్ కూడా..! కానీ వేరే చానెల్లో గనుక వచ్చి ఉంటే జూనియర్ ఇంకా విస్తృతంగా జనంలోకి వెళ్లే చాన్స్ ఉండేది… తనకు వేరే భాషల్లో పెద్దగా పాపులారిటీ లేదు కాబట్టి ఇది కేవలం జెమిని టీవీకి మాత్రమే పరిమితం… కాకపోతే జూనియర్‌కు ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే… పిల్లలు, మహిళలు, వృద్ధుల్లో తన పాపులారిటీ పెరుగుతుంది… ఇప్పుడు లేదని కాదు… కానీ మీలో ఎవరు కోటీశ్వరులు వంటి రియాలిటీ షోలు నేరుగా కుటుంబంతో కనెక్ట్ చేస్తాయి… పాపులారిటీ కన్సాలిడేట్ అవుతుంది… పైగా తను మంచి టీవీ హోస్ట్… ఈరోజుకూ కేబీసీ ఎలా రన్ అవుతుందో తెలుసు కదా… సో, ఈ జూనియర్ ప్రోగ్రాం కూడా ఆసక్తిని రేపుతోంది… గుడ్ లక్ జూనియర్…!! ఆ దిక్కుమాలిన ఫార్ములా సినిమాల్లోని రొటీన్ సూపర్ హీరో ఫైట్లు, పంచ్ డైలాగులు, వంశకీర్తనలు, గెంతులు, రొమాన్సులకన్నా… మీలో ఎవరు కోటీశ్వరుడు పూర్తి భిన్నమైన పంథా… ఈ కథ వేరే ఉంటది, దా, వచ్చెయ్….
Share this Article