ఓ ఎన్ఆర్ఐ మిత్రుడు చెప్పినట్టు… ‘‘Anna Karenina నవలని Leo Tolstoy “All happy families are alike; each unhappy family is unhappy in its own way” అని మొదలు పెడతాడు… అలా, బాగున్న సినిమాలకన్నా బాగాలేనివి ఎందుకు బాగాలేవో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే ఈ సినిమా చూడొచ్చు…’
ఏ సినిమా..? అదే… డబుల్ ఇస్మార్ట్… ఆమధ్య హిట్టయిన డ్యుయల్ సిమ్ బుర్రల మార్పిడి కథతో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఇది సీక్వెల్… మరీ లైగర్ అంత నాసిరకం గాకపోయినా ఇదీ పెద్ద చెప్పుకోదగిన సినిమా ఏమీ కాదు… ఒకప్పటి పూరి జగన్నాథ్ వెంట చార్మి ఉంది తప్ప ఆ పాత చార్మింగ్ దమ్ము కనిపించడం లేదు… నాట్ చార్మింగ్ జగన్నాథ్…
Ads
పాత సినిమాలో చిప్ మార్చేసి, బుర్రల్ని ఏమార్చేసి ఏదో కథ నడిపిస్తారు కదా… ఇందులో ఓ భీకర కేరక్టర్ సంజయ్ దత్ మెమొరీస్‌ను మొత్తం హీరో మెదడులోకి మార్చడం అనేది కథ… ఏదో కథ, ప్రజెంటేషన్ బాగుండాలి కదా… సంజయ్ దత్ నాట్ ఇంప్రెసివ్… ఇక పోతినేని రామ్ నుంచి మళ్లీ అదే మాస్ మసాలా లుక్కు, అదే మొనాటనస్ యాక్షన్… అవే స్టెప్పులు… ఏదో సినిమా తీశామంటే తీశాం అన్నట్టుగా ఉంది…
తనకు గతంలో రెండు ఫ్లాపులున్నయ్… అటు పూరీకి లైగర్ అనే మరక ఉంది… ఇద్దరూ కసిగా చేశారు అంటుంటే ఏదో బాగా కొత్తగా ట్రై చేశారు అనుకున్నాం… కానీ సగటు తెలుగు సినిమా హీరో మారడు… అదే ఫార్ములా… విపరీతమైన హీరోయిజం… హీరోయిన్ కావ్య థాపర్ ఉందంటే ఉంది, పాటల్లో ఎగిరింది సగటు తెలుగు హీరోయిన్‌లాగే… పూరి సినిమాల్లో ఆలీ పాత్ర కాస్త కొత్తగా నవ్వించేలా ఉంటుంది… ఈ సినిమాలో అదీ లేదు… చిరాకెత్తించాడు ఆలీ… పూరి వెలిసిపోయిన కెరీర్ ప్రతిభకు ఆలీ పాత్ర కేరక్టరైజేషన్ కూడా ఓ ఉదాహరణే…
కాస్త ఈ సినిమాకు బలం మణిశర్మ… ఓ మోస్తరు సోకాల్డ్ మాస్ బీట్స్ పడ్డాయి… మాస్ మసాలాలు ఉంటే తప్ప సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం లేదనే అంచనాయే అసలు తప్పు… ఈ సోకాల్డ్ మాస్ మసాలా కమర్షియల్ సరుకు అనేదే ఓ బ్రహ్మపదార్థం… ఇప్పుడు ఏమైనా కొత్తదనం ఉంటే తప్ప, దీన్ని తప్పకుండా థియేటర్‌లో చూడాల్సిందే అనుకుంటే తప్ప ప్రేక్షకుడు ఓటీటీని వదిలి రావడంలేదు… మరి ఈ సినిమాలో కొత్తగా ఏముంది..? ఏమీ లేదు… అదే ఫార్ములా, అదే డ్యుయల్ సిమ్ కథను అటుతిప్పీ ఇటుతిప్పీ విసిగించేశాడు పూరి… పూర్ పూరి..!!
Share this Article