షేక్ హసీనా మిలటరీ రవాణా విమానం బంగ్లాదేశ్ నుండి గాల్లోకి ఎగరగానే వెంటనే హిండన్ ఎయిర్ బేస్ నుండి రెండు రాఫెల్ జెట్ ఫైటర్స్ కూడా అదేసమయంలో గాల్లోకి లేచాయి!
షేక్ హసీనా ప్రయాణిస్తున్న విమానం బంగ్లాదేశ్ ఎయిర్ స్పేస్ నుండి భారత ఎయిర్ స్పేస్ లోకి రాగానే రెండు రాఫెల్ ఫైటర్లు షేక్ హసీనా విమానానికి రక్షణగా ఉంటూ హిండన్ ఎయిర్ బేస్ దాక వచ్చాయి!
అంతకు ముందు షేక్ హసీనా ఢాకా నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి తనకి తాత్కాలిక ఆశ్రయం కావాలని అభ్యర్థించారు, దానికి మోడీ అంగీకరించడం జరిగింది!
Ads
మాజీ ప్రధాని అయినా సరే మోడీ హసీనాను గౌరవంగానే ఆహ్వానించారు! సాధారణంగా విదేశీ ప్రధాని, అధ్యక్షులు మన దేశ పర్యటనకి వస్తున్నప్పుడు ప్రాధాన్యతా క్రమంలో మన దేశ జెట్ ఫైటర్స్ ను రక్షణగా పంపిస్తారు! కానీ షేక్ హసీనా విషయంలో VVIP ప్రోటోకాల్ ను అమలు చేశారు!
గత పదేళ్ళుగా మోడీతో కలిసి హసీనా భారత్ తో సత్సంబంధాలను మెరుగు పరచడానికి సహకరించారు! చైనాతో ఒప్పందాల మీద మోడీకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఎవరి అవసరం వాళ్ళది! ఒకవేళ మోడీకి అభ్యంతరాలుంటే VVIP ప్రోటోకాల్ తో షేక్ హసీనాకి ఆశ్రయం కల్పించి ఉండేవారు కాదు! రెండేళ్ళ క్రితం శ్రీలంక అధ్యక్షుడు భారత్ రావడానికి అనుమతి ఇవ్వలేదు అన్న సంగతి మరిచిపోకూడదు!
********
రాహుల్ కి ఎందుకంత అత్యుత్సాహం?
బంగ్లాదేశ్ సంక్షోభం మీద మోడీ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు! ప్రతిపక్ష నాయకులని అందరినీ ఆహ్వానించారు మోడీ! అంతకుముందు కాబినెట్ కమిటీలో రహస్యంగా బంగ్లాదేశ్ సంక్షోభం మీద చర్చించారు కానీ వివరాలు తెలియరాలేదు!
మరీ ముఖ్యంగా మోడీ, అజిత్ దోవాల్, జై శంకర్ లతో చర్చలు జరిపారు! హిండన్ ఎయిర్ బేస్ లో షేక్ హసీనాతో మొదట అజిత్ డోవల్, తరువాత EAM జై శంకర్ చర్చలు జరిపారు! షేక్ హసీనా అజిత్ దోవల్, జై శంకర్ లతో ఏమి చెప్పారో మోడీతో చెప్పారు! విషయం చాలా గంభీరం అయినదే అని నిర్ధారించుకున్న తర్వాతే కాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు మోడీ!
******
తరువాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు! అఖిల పక్ష సమావేశానికి ముందే రాహుల్ హడావిడిగా EAM జై శంకర్ దగ్గరికి వచ్చి ప్రశ్నల వర్షం కురిపించాడు! అంత అవసరమా?
రాహుల్: ఏం జరిగింది? ఏం జరగబోతున్నది? మీరు ఏం చేయబోతున్నారు? ఎయిర్ బేస్ లో షేక్ హసీనా అజిత్ దోవల్ తో ఏం చెప్పింది? మీతో షేక్ హసీనా ఏం మాట్లాడింది?
EAM జై శంకర్ : కొద్ది సేపట్లోనే అఖిల పక్ష సమావేశం జరగబోతున్నది. అందరూ రాగానే ఈ సమావేశంలోనే అందరి ముందూ అడగండి, జవాబు చెప్తాను అని ప్రశాంతంగా వెళ్లి తనకి కేటాయించిన కుర్చీలో కూర్చున్నారు జై శంకర్ !l
అసలెందుకు ఈ రాహుల్ కి అంత ఉత్సుకత?
షేక్ హసీనా రాజీనామా చేసి లండన్ వెళ్ళే క్రమంలో భారత్ రాగానే… ఢిల్లీలోని పాకిస్ధాన్ రాయబార కార్యాలయం రాహుల్ కి మామిడి పండ్ల పెట్టేని బహుమతిగా పంపించింది! ఇది దేనికి సంకేతం? అంటే భారత్ లో కూడా మోడీకి బంగ్లాదేశ్ లో జరిగినట్లే జరుగుతుంది త్వరలో అనే సందేశమా?
********
పైన పేర్కొన్న దానికి అనుసంధానంగా మరో సంఘటనను ప్రస్తావించాలి ఇక్కడ! అదేమిటంటే షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ రాగానే బంగ్లాదేశ్ అద్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ వెంటనే గృహ నిర్బంధంలో ఉన్న BNP నాయకురాలు బేగం ఖాలేదా జియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చాడు!
ఖలేదా జియా బద్ధ శత్రువు షేక్ హసీనాకి! అక్కడ అవామీ లీగ్ Vs బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అని కాదు ఇద్దరికీ వ్యక్తిగత వైరం కూడా ఉంది!
*********
హిండన్ ఎయిర్ బేస్ లో షేక్ హసీనా దిగగానే ముందు NSA అజిత్ దోవల్ షేక్ హసీనాని ఎయిర్ బేస్ లోనే కలుసుకొని రహస్యంగా మాట్లాడారు! దీని గురించే రాహుల్ EAM జై శంకర్ ని అడిగాడు, ఎందుకంటే అజిత్ దోవల్ ని అడగలేడు!
*******
బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ అవతరణ తర్వాత విదేశీ వ్యవహారాల విషయంలో ఒక నిర్దిష్ట పాలసీ ను ప్రకటించారు అది…. Friendship to All , Malice to none! అంటే అందరితో స్నేహంగా ఉందాము! ఎవ్వరితో శత్రుత్వం వద్దు! ఇదీ బంగ్లాదేశ్ ఫారిన్ పాలసీ!
అందుకని షేక్ హసీనా నేరుగా ఎవరి పేరును చెప్పకుండా మూడో దేశం బంగ్లాదేశ్ ను అస్థిర పరచడానికి ప్రయత్నిస్తున్నది అని మాత్రమే అన్నారు! ఇంతకీ హిండన్ ఎయిర్ బేస్ లో షేక్ హసీనా NSA అజిత్ దోవల్ తో ఏం మాట్లాడారు?
బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు జనవరి, 2024 లో జరిగాయి! అంతకు ముందు అంటే అక్టోబర్ 28, 2023 న అమెరికా నుండి మెయిన్ అరాఫీ అనే వ్యక్తి ఢాకా వచ్చాడు. మెయిన్ అరాఫి తనని తాను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కి సలహా దారుగా చెప్పుకున్నాడు!
మెయిన్ అరాఫి ఢాకా వచ్చిన సమయంకి ప్రాధాన్యత ఉంది, అంటే అక్టోబర్ 28 కి కొద్ది రోజుల ముందే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యకర్తలు హింసకు పాల్పడ్డారు కానీ షేక్ హసీనా ఆ అల్లర్లని అణిచి వేసింది విజయవంతంగా!
మెయిన్ అరాఫి ఢాకా వచ్చి నేరుగా BNP కార్యాలయానికి వెళ్లి ఖలీదా జియా (గృహనిర్బంధంలో ఉంది) సన్నిహితులతో మంతనాలు జరిపాడు. అంటే అక్టోబర్ 28, 2023 న ఒక ఖచ్చితమైన ప్రణాళికతో మెయిన్ అరాఫీ అమెరికా నుండి బంగ్లాదేశ్ వచ్చాడు షేక్ హసీనాను ప్రధాని పదవి నుండి దించడానికి!
********
మొదటి ప్లాన్: 2024 జనవరి 7 న జరగబోయే బంగ్లా పార్లమెంటు ఎన్నికల కంటే ముందే షేక్ హసీనాను పదవి నుండి దించేయాలి. అందుకే అక్టోబర్ 28 న మెయిన్ ఆరాఫీ ఢాకా వచ్చాడు. BNP పార్టీతో మంతనాలు జరిపాడు!
మరుసటి రోజు ఢాకాలోని అమెరికన్ క్లబ్ లో వరసగా వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం అయ్యాడు. మెయిన్ ఆరాఫి వెళ్లిన తర్వాత విద్యార్థుల పేరుతో BNP కార్యకర్తలు, జమాతే ఇస్లామీ కార్యకర్తలు ఢాకాలోని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటిని తగులపెట్టారు! కార్లని ధ్వంసం చేశారు! అయితే బంగ్లా ప్రజలు వీధుల్లోకి వచ్చి తమతో కలిసి పోరాడుతారు అని ఆశించి భంగపడ్డారు BNP, జమాతే ఇస్లామీ నాయకులు!
పై ఘటనలు మనకి తెలిసిన సంఘటనలని గుర్తు చేస్తాయి. షహీన్ బాగ్ నిరసన ప్రదర్శనలు అలానే సాగనిచ్చాడు అమిత్ షా! ఫోర్స్ ఉపయోగించలేదు. రిపబ్లిక్ డే రోజున ఖలిస్థాన్ జెండా ఎగరవేయడం! దీని మీద కూడ ఎలాంటి ఆవేశాలకి పోలేదు అమిత్ షా! అఫ్కోర్స్! ఒక్కో ఖలిస్తాన్ నాయకుడిని విదేశాల్లోనే మట్టుబెట్టారు! మిగిలిన వాళ్ళు సైలెంట్ అయ్యారు!
షేక్ హసీనాకి ఆ అవకాశం లేదు! షేక్ హసీనా పోలీసులతోనే అదుపు చేయడానికి ప్రయత్నించి రెండుసార్లు సఫలం అయ్యింది! మూడో సారి పోలీసులతో కాకపోయేసరికి సైన్యాన్ని దించింది, కానీ అప్పటికే ఆర్మీ చీఫ్ ను మేనేజ్ చేయడంతో అల్లర్లు అదుపులోకి రాలేదు!
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ లోని అమెరికా రాయబారి మూడు సందర్భాలలో St. Martin’s Island లీజు గురుంచి షేక్ హసీనా దగ్గర ప్రస్తావించాడు, కానీ షేక్ హసీనా నుండి ఎలాంటి స్పందన రాలేదు సరికదా ఆ టాపిక్ ను తప్పించి వేరే అంశం మీద మాట్లాడింది! దర్జా తగ్గిపోలేదూ అమెరికా, బ్రిటన్ లకి?
బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటనలు 2014 లో యుక్రెయిన్ రాజధాని కీవ్ మైదాన్ (Maidan ) లో జరిగిన హింసతో పోల్చవచ్చు. డిల్లీ, కీవ్, ఢాకాలలో ఒకే రీతిలో హింసాత్మక ఘటనలు జరిగాయి. భారత్ లో తప్ప యుక్రెయిన్, ఢాకాలలో విజయవంతంగా దేశాధినేతలు దేశం వదిలి వెళ్ళిపోయారు!
2014 లో ఉక్రెయిన్ రాజధాని కీవ్ మైదాన్ లో కూడ హింసని ప్రజ్వరిల్ల చేసింది అమెరికా! అప్పటి ఉక్రేనియన్ అద్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ కూడా 2014 లో ప్రభుత్వాన్ని రద్దు చేసి రష్యాలో పుతిన్ ఆశ్రయం కోరాడు, అప్పటినుండి రష్యాలోని ఉన్నాడు! కానీ భారత్ లో సఫలం కాలేదు! థాంక్స్ అజిత్ డోవల్ ! Contd.. part 6…… ( పొట్లూరి పార్థసారథి )
Share this Article