దగ్గుబాటి కుటుంబంలో హీరో వెంకటేష్ ఓ చిత్రమైన… కాదు, కాదు, ఓ విశిష్టమైన కేరక్టర్… అరవయ్యేళ్లు దాటాడు… కానీ తనకు నప్పిన, నచ్చిన పాత్రల్నే ఎంచుకుంటూ… ఇక ఆ సొల్లు ఫార్ములా కథల్లోకి వెళ్లడం లేదు… గోల్డెన్ స్పూన్‌తో పుట్టినవాడు, అందుబాటులో అన్నీ… విలాసాలు, వైభోగాలు… కానీ తన మాటల్లో ఏదో స్పిరిట్యువాలిటీ, ఫిలాసఫీ వినిపిస్తుంటాయి… చుట్టూ ఓ గిరిగీసుకుంటాడు… ఫ్యామిలీ కూడా పెద్దగా ఫోకస్‌లోకి రాదు… ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు… వారసుడి కోసం తాపత్రయమా..? తను పెద్దగా గాసిప్స్లోకి కూడా రాడు… తన ప్రపంచమేదో తనది… పెద్ద బిడ్డ ఆశ్రితకూ ఆ లక్షణాలే కొన్ని వచ్చినట్టున్నయ్… ఆశ్రిత ఎవరూ అంటారా..? హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్, వెరీ హైప్రొఫైల్ ఆర్.సురేందర్‌రెడ్డి మనమడు వినాయక్‌రెడ్డి భార్య… స్పెయిన్, బార్సిలోనాలో ఉంటుంది…
ఈమె గురించి ఎందుకు చెప్పుకోవాలి ఇప్పుడు అంటారా..? ఈమధ్య చాలామంది సెలబ్రిటీల పిల్లలు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, ఉనికి కావాలని కోరుకుంటున్నారు… తమకు ఇష్టమున్న రంగాలకు సంబంధించి ఏదో ఒక వర్క్‌లో బిజీగా ఉండాలని అనుకుంటున్నారు… ఫోకస్లో ఉండాలని కాంక్షిస్తున్నారు… తమ ఫీలింగ్స్‌ను జనంతో షేర్ చేసుకోవాలి, తమ ఫ్యామిలీల యాక్టివిటీస్‌కు భిన్నంగా..! సత్యం రామలింగరాజు కోడలు సంధ్యారాజు నాట్యం మీద ప్రేమతో ఏం చేస్తున్నదో ఈమధ్య చెప్పుకున్నాం కదా… ఘట్టమనేని కృష్ణ కూతురు మంజుల స్టార్ట్ చేసిన ఓ యూట్యూబ్ చానెల్ గురించి కూడా మనం చెప్పుకున్నాం… కాస్త యోగ, కాస్త ఫిట్నెస్, కాస్త స్పిరిట్యుయల్ ఎట్సెట్రా కలగలిపిన చానెల్ అది… ఇప్పుడు ఆశ్రిత కూడా అదే బాట పట్టింది… తను సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసింది… దాని పేరు ఇన్ఫినిటీ ప్లాటర్… తెలుగులో అనంతమైన పళ్లెం… తెలంగాణ భాషలో చెప్పాలంటే పే-ద్ద తల్లె..! తిండి తినే ప్లేటు…
Ads
ఎందుకు ఆ పేరు..? అది ఆమె ప్యాషన్… ఒక అంశానికి పరిమితం కాదల్చుకోలేదు… అందుకే అనంతం అంటోంది… వివిధ ప్రాంతాలకు జర్నీ, భిన్న ప్రదేశాల పరిచయం… ప్రత్యేకించి అనేక ప్రాంతాల భిన్నమైన వంటకాలు… కల్చర్, ఫుడ్ కల్చర్‌ను కూడా పరిచయం చేస్తానంటోంది… యూట్యూబ్‌లో అనేకానేక వంటకాల చానెళ్లున్నయ్, టూరిజం చానెళ్లు, కల్చరల్ చానెళ్లు, హిస్టరీ బోధించే చానెళ్లు… బోలెడు… ఒకే ఒక క్లిక్ దూరంలో అనేకానేక సంస్కృతులు కనిపిస్తున్నయ్, వినిపిస్తున్నయ్… మరి ఆశ్రిత కొత్తగా ఏం చెబుతుంది..? అది కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యేదేనా..? కాకపోవచ్చు… ఆమెకేదో ప్యాషన్ ఉంది… ఏదో చెబుతానూ అంటోంది… చూద్దాం, ఏం చెప్పనుందో… సెలబ్రిటీ అనగానే తెలిసిన నలుగురు సినిమా పెద్దల్ని ఓ స్టూడియోలో కూర్చోబెట్టి.., పిచ్చి పిచ్చి కిట్టీ పార్టీ ప్రశ్నలడిగి.., టాక్ షో, చాట్ షో అని పేర్లు పెట్టి, ప్రేక్షకుల బేజా తినేసి… యాడ్స్ కుమ్మేసే ఈ రోజుల్లో ఈమె డిఫరెంట్ పంథాలో పోతానంటోంది… మంచిదేగా…!
Share this Article