ఎంత పెద్ద సక్సెస్ స్టోరీ అయితేనేం…? ఎంత సాధనసంపత్తి ఉంటేనేం..? ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్ప పేరు ఉంటేనేం..? ఓ టైమ్ వస్తుంది… ఆ టైమ్ తనది కానప్పుడు… అన్ని తెలివితేటలు, చాణక్యుడి వంటి బుర్ర, అపారమైన సంపద అన్నీ అలా క్షణాల్లో కొట్టుకుపోతాయి… చివరకు ఓ భౌతిక దేహం ఒడ్డుకు కొట్టుకొస్తుంది… అంగీకరిస్తారా..? డెస్టినీ అనేదే అల్టిమేట్… నా చేతుల్లోనే నా జీవితం, నా సంపద, నా వైభోగం అనుకున్న చాలామంది కొట్టుకుపోయారు…
ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ బ్యాంక్ ఇంటర్నేషనల్,.. దీనికి చైర్మన్ జోనాథన్ బ్లూమర్.., మరో ప్రముఖుడు అటానమీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మైక్ లించ్… ఈ ఇద్దరినీ తాజాగా సముద్రం మింగేసింది… ఈ ఇద్దరూ ఓ విలాసవంతమైన పడవలో ప్రయాణిస్తుండగా ఇటలీలోని సిసిలీ వద్ద సముద్రంలో బోల్తా కొట్టింది…
ఈ ప్రమాదంలో మోర్గాన్ స్టాన్లీ బ్యాంక్ ఇంటర్నేషనల్ చైర్మన్ జోనాథన్ బ్లూమర్, అటానమీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మైక్ లించ్, బ్లూమర్ సతీమణి, క్లిప్ ఫోర్డ్ చాన్స్ లాయర్ క్రిస్ మోరవిల్లో తదితరులు ఉన్నారని సమాచారం… మృతుల్లో మరో నలుగురు కూడా ఉన్నారని సిసిలీ పౌర రక్షణ విభాగం చెబుతోంది… వారి ఆచూకీ కూడా గల్లంతయింది…
Ads
అది దాదాపు 56 మీటర్ల పొడవున్న బయేసియాన్ అనే విలాసవంతమైన పడవ… పార్టీలకు, వినోద పర్యటనలకు వాడే ఓ రేంజ్ వైభోగపు పడవ అది… అందులో ప్రమాదసమయంలో మొత్తం 22 మంది ఉన్నట్టు సమాచారం… వీరిలో బ్రిటన్, అమెరికా, కెనడా దేశాలకు చెందినవారు ఉన్నారని చెబుతున్నారు… ఈ బయేసియాన్ తీవ్రమైన సుడిగాలుల కారణంగా బోల్తా పడిందట…
ఆ సమయంలో పడవలో ఉన్న 22 మందిలో 15 మందిని రక్షించారు… తన సహోద్యోగుల కోసం మైక్ లించ్ ఈ ట్రిప్ ను ప్లాన్ చేశాడు… ఇటీవలే అమెరికాలో ఒక ఫ్రాడ్ కేసులో బయటపడ్డ లించ్… సముద్ర ప్రమాదం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు… ఫ్రాడ్ కేసులో తనతోపాటు ఆరోపణలు ఎదుర్కున్న స్టీఫెన్ చాంబర్లయిన్ కూడా ఇదేరోజు ప్రాణాలు కోల్పోయాడు… కానీ ఈ ప్రమాదం కాదు, అది వేరే…
పడవప్రమాద ఘటన జరిగిన కొన్ని గంటలకే కేంబ్రిడ్జ్ షైర్ లో స్టీఫెన్ జాగింగ్ చేస్తుండగా ఆయనను ఓ కారు ఢీకొట్టింది… అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు… బ్రిటన్ లో టెక్ మేధావిగా లించ్ కు పెద్ద పేరుంది… ఆయనను బ్రిటన్ బిల్ గేట్స్ గా పిలుస్తారు… ఓ పడవలో సముద్రంలో పార్టీ ఏమిటో… ఏమాత్రం రక్షణ ఏర్పాట్లు లేని స్థితిలో సుడిగాలి మింగేయడం ఏమిటో… అదే మరి… టైమ్ బాగా లేనప్పుడు, కాదు కాదు… మన టైమ్ పూర్తయినప్పుడు… ఇదిగో ఇలాగే కాలం మింగేస్తుంది… ఎవరూ అతీతులు కారు…!!
Share this Article