ఇప్పుడు డిస్కషన్ అంతా మీడియా మాఫియా గురించే కదా… ప్రముఖుల్ని టార్గెట్ చేసి వేధించడం, తరువాత సెటిల్మెంట్లు చేసుకోవాలని చెప్పడం… వేణుస్వామి పేల్చిన బాంబు కూడా అదే కదా… నిజానికి తమకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలో హైదరాబాద్ ఫిలిమ్ జర్నలిస్టులు, డిజిటల్ జర్నలిస్టులు ఏకంగా సంఘాల పేర్లతో వుమెన్ కమిషన్‌ను అప్రోచ్ అయ్యారంటే ఏదో భారీ తేడా కొడుతున్నట్టు లెక్క…
సరే, మళ్లీ పోలీసులకు వద్దకు వెళ్లారు, కంప్లయింట్లు ఇచ్చారు… ఇదిలా కొన్నాళ్లు సాగుతుంది… తాజాగా నటి హేమ వీడియో ఒకటి కలకలం రేపుతోంది… ఆమె వీడియో ఎప్పటిదో గానీ వాట్సప్ గ్రూపుల్లో
మీడియాలో కొన్నాళ్లుగా రకరకాల పుకార్లు పుట్టించారు… మీడియా 35 ఏళ్ల నా పరువును భూస్థాపితం చేసింది… డ్రగ్స్‌కు సంబంధించి నేను టెస్టులు చేయించుకున్నా, నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది… ఆల్రెడీ ఈవిషయం జనానికి చెప్పాను… ఇంకా బహిరంగ టెస్టులకైనా రెడీ.., నన్ను మీడియా ఓ టెర్రరిస్టులా, జీహాద్ కోసం వర్క్ చేస్తున్నట్టుగా చిత్రీకరించింది… బ్లాక్ మెయిల్ చేశారు, కాంప్రమైజ్ చేస్తామన్నారు కొందరు…, సెటిల్మెంట్ చేస్తామని మరికొందరు పెద్దలు అడిగారు… నేనేం తప్పు చేశాను అసలు..? ఎందుకు సెటిల్మెంట్లు..? త్వరలో ఆ బ్లాక్ మెయిలర్ల ఫోన్ నంబర్లు కూడా చెబుతాను…
Ads
ఇలా సాగింది ఆమె వీడియో… సరే, హేమ కేసు డిఫరెంట్… ఆమె మీద కేసు నమోదైంది నిజం… మా అసోసియేషన్ ఆమె సభ్యత్వాన్ని కూడా తాత్కాలికంగా తొలగించిన మాటా నిజం… రేవ్ పార్టీకి నేను వెళ్లలేను ఆమె మొదట్లో బుకాయించింది, ఏవో ఫేక్ వీడియోలతో తిమ్మిని బమ్మి చేయడానికి ప్రయత్నించింది… చివరకు బెంగుళూరు పోలీసులు ఆమె ఫోటో కూడా విడుదల చేసి, పక్కా ఆధారాలతో సీరియస్ అయ్యేసరికి ఇక వెళ్లి లొంగిపోయి, తరువాత బెయిల్ తెచ్చుకుంది…
ఆమె మాట దురుసు కదా, గతంలో మీడియాకు ఆమె మీద ఎన్నాళ్ల నుంచో మంట ఉన్నట్టుంది… దొరికింది కదాని ఇష్టారాజ్యంగా ఏదేదో రాసేశారు… కానీ ఆమె తాజా వీడియోలోనూ ఇదే ప్రస్తావన… మీడియా సెటిల్మెంట్లు… అందుకే మనం మొదట్లో చెప్పుకున్నది… తెలుగు జర్నలిస్టులకు సంబంధించి ఏదో కూటమి బలంగా ప్లే చేస్తున్నట్టుంది… (మెయిన్ స్ట్రీమ్ కాదు, ఈ స్ట్రీమ్ కథలు వేరు…) ఇంకా ఈ చర్చలు ఎటు వైపు వెళ్తాయో మీడియా యవ్వారాలకు సంబంధించి ఇంకేం నిజాలు బయటపడనున్నాయో…!! (హేమ రిలీజ్ చేసిన వీడియో నిజమైనదే అని నమ్ముతూ…)
Share this Article