కొన్ని చెప్పుకోవాలి… తప్పదు… నాడు హత్రాస్ అత్యాచారం మీద ప్రతిపక్షాలు గాయిగత్తర చేశాయి… మూక పర్యటనలతో ఇష్యూను దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసి రచ్చ రచ్చ చేశాయి… ఓ పీఎఫ్ఐ కార్యకర్త తన అనుచరులతో వెళ్లి గొడవ చేయబోతే పోలీసులు అరెస్టు చేశారు, దాని మీద ఎడిటర్స్ గిల్డ్ మూర్ఖంగా స్పందించి తన పరువు కోల్పోయింది.., దాదాపు ప్రతీ ప్రతిపక్షం అక్కడకు వెళ్లి గొడవలు చేసింది…
సీన్ కట్ చేస్తే,.. పశ్చిమ బెంగాల్‌లో ఓ జూనియర్ డాక్టర్ దారుణ హత్యాచారానికి గురైతే ఒక్కడి గొంతూ పెగలదేం…? అంటే మహిళల శవాలపైనా పేలాలు ఏరుకోవడం, రాజకీయ లబ్ధికి ప్రయత్నించడం, బీజేపీ మీద చాన్స్ దొరికింది కదాని విషం చిమ్మడం… అరె, హత్యాచారం ఎక్కడైనా అత్యాచారమే కదా… హత్రాస్‌లో ఒక తీరు, మెడికల్ కాలేజీలో ఒక తీరు ఉండదు… బాధితురాలు మహిళే… అదీ దారుణమైన హత్యాకాండ…
ఇక్కడ కూడా పాలిటిక్సే… ఇండి కూటమిలో ప్రధాన సభ్యురాలు మమత బెనర్జీ… అసలే రౌడీ సర్కార్… ఆమె రౌడీయిజానికి అసలు రౌడీ పాలిటిక్స్ నడిపే మార్క్సిస్టులే మట్టిగొట్టుకుపోయారు… దీంతో ఆమెకు కోపం వస్తుందనే భయంతో… ఒక్క సెక్యులర్ గొంతూ పెగలడం లేదు… ఒక్కడూ మాట్లాడటం లేదు… పొరపాటున రాహుల్ గాంధీ ఏదో అనబోతే చర్రుమన్నది ఆమె… దాంతో అందరూ కీప్ క్వయిట్…
Ads
తన పోలీసులకు చేతకాదు, తనకు పాలన చేతకాదు, తనే బజారుకెక్కి ఆ మహిళకు న్యాయం జరగాలని ఊరేగింపు తీస్తుంది ఆమె… ఒకవైపు బంగ్లాదేశ్ నుంచి ఎందరు వచ్చినా సరే అంటుంది… వాళ్లందరికీ ఆశ్రయం కల్పించాలి మోడీ అంటుంది… మరోవైపు సీఏఏను వ్యతిరేకిస్తుంది… అసలు ఏం మనిషో ఏమో… ఓ సోషల్ పోస్టు చూశాం…
11 మంది మహిళా ఎంపీలున్నారు బెంగాల్‌లో… ఒక్కరూ ఆ జూనియర్ డాక్టర్ హత్యాచారం మీద కిక్కుమనలేదు… నోరు మెదిపితే మమత చంపేస్తుంది కదా… రచన బెనర్జీ వంటి కొత్త ఎంపీలను వదిలేస్తే… సోకాల్డ్ ది ముదుర్ మహువా మొయిత్రా ఉంది కదా… పార్లమెంటు ప్రశ్నల్ని అమ్ముకునే బ్యాచ్… ప్రపంచంలో ఏం జరిగినా మోడీకి ముడిపెట్టి గొంతెత్తే బ్యాచ్… అత్యంత వివాదాస్పదమైన లీడర్… ఈరోజుకూ ఒక్క మాట మాట్లాడలేదు…
యథా బాసూ తథా స్టాఫూ అన్నట్టుగా… మమతే బోలెడు డబుల్ స్టాండర్డ్స్… ఇక ఈ అయోమయం కేరక్టర్లు ఏం మాట్లాడతారు..? ఒకప్పుడు సీబీఐ వాళ్లు వస్తే కేసులు పెట్టి, పోలీస్ స్టేషన్లకు తరలించిన కేరక్టర్ మమత… ఇప్పుడు తనే సీబీఐని నిందిస్తోంది… నిజంగా ఇలాంటి లీడర్లే దేశానికి అత్యంత ప్రమాదకరం… ఈమెను సపోర్ట్ చేసే స్టాలిన్, తేజస్వి, అఖిలేష్ వంటి నేతలు సరేసరి…
అదుగో 376 ఆర్టికల్ ప్రయోగిస్తారు, సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గా ఉంది… అని బోలెడు వార్తలు… కానీ మోడీకి అంత సీన్ లేదు, ఆశలు పెట్టుకోకండి, మమత జోలికి పోవడానికి గడగడా… ఎన్నికల తరువాత టీఎంసీ హింసాకాండతో రాష్ట్రం వదిలి అస్సోం పారిపోయిన వందల బీజేపీ కుటుంబాలే ఇంకా తిరిగి రాలేదు… అర్థమైంది కదా… మోడీకి ఏమాత్రం చేతనవునో…!!
Share this Article