సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎలా వార్తలో… వాళ్ల విడాకులూ అంతే ఇంట్రస్టింగ్ న్యూస్ అవుతుంటాయి మీడియాకు..! రీడర్‌షిప్ ఉంటుంది కాబట్టి..! సొసైటీలోనే విడాకుల శాతం బాగా పెరిగిపోయింది… అనేక కారణాలు… మానసిక అశాంతితో వైవాహిక జీవితం గడపడం ఇష్టం లేక విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు… తరువాత వీలైతే మరో పెళ్లి లేదంటే ఒంటరి జీవనం…
మొన్నామధ్య ఒక కేసు చదివాం కదా… పెళ్లయిన గంటలోనే జంట కొట్టుకుని చివరకు ప్రాణాపాయంలోకి జారిపోయారు… సర్దుబాటు, రాజీ అనేవి ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి వైవాహిక బంధాల్లో… నో కమిట్మెంట్స్, వీలయితే సహజీవనం లేదంటే ఒంటరి జీవనం… ఈ ధోరణి పెరుగుతోంది… తాజాగా సుప్రీంకోర్టు ఓ పెళ్లిని రద్దు చేసింది… ఇక వీళ్లిద్దరి బంధమూ సాధ్యం కాదు అని వ్యాఖ్యానించింది… పెళ్లయిన 22 ఏళ్లలో ఆ జంట కలిసి ఉన్నది జస్ట్ 43 రోజులే… ఇద్దరూ డాక్టర్లే… దాదాపు సమస్థాయి సంపాదన…
అందులోనూ ఇద్దరూ ఆరు కేసులు పెట్టుకున్నారు… అందులో క్రిమినల్ కేసులు కూడా… 22 ఏళ్ల సుదీర్ఘ పోరాటం… చివరకు సుప్రీంకోర్టు దాకా చేరింది పంచాయితీ… చివరకు రద్దయింది… ఈ పెళ్లి రద్దుకు సుప్రీంకోర్టు అసాధారణంగా వాడుకునే 142 ఆర్టికల్ ఉపయోగించింది… హేమిటో ఒక్కో విడాకుల కేసు ఒక్కో కథ…
Ads
శిల్పా శైలేష్, వరుణ్ శ్రీనివాసన్ కేసు ఇది… ‘‘ఇక ఈ కేసులో వివాహం పూర్తిగా విఫలమైందని, ఇద్దరూ కలిసి ఉండే అవకాశం ఏమాత్రం లేదని బలంగా నమ్ముతున్నాం… అందుకే ఇకపై చట్టపరమైన సంబంధం వాళ్లు కొనసాగించడం అసాధ్యం… పెళ్లయిన మొదట్లో 23 రోజులు కలిసి ఉన్నారు… తరువాత సెషన్స్ కోర్టు రాజీ పడాలని ఆర్డర్ జారీ చేయడంతో 2005 నుంచి 2025 నడుమ మరో 20 రోజులు కలిసి ఉన్నారు, అంతే…
ఆమె అత్తింటిని మొదటి నెలలోనే వదిలి పెట్టేసింది… 22 సంవత్సరాల పోరాటాలు, వియోగాలు… ఈ యాభై ఏళ్ల వయస్సొచ్చాక, ఎవరి జీవితాలు వాళ్లు సొంతంగా నిర్మించుకున్నాక, ఇక కలిసి ఉండే అవకాశాలూ కనిపించడం లేదు… అందుకే ఆ జంటలో ఒకరు వ్యతిరేకిస్తున్నప్పటికీ కోర్టు తన విచక్షణాధికారంలో ఈ వివాహాన్ని రద్దు చేస్తున్నది’’ అని పేర్కొంది సుప్రీంకోర్టు…
2002 నుంచి ఒకరిపై ఒకరు ఆరు కేసులు పెట్టుకున్నారు… అనేక సంవత్సరాలు న్యాయపోరాటాలే… భార్య ఇప్పుడు వివాహం పవిత్రతను విశ్వసిస్తూ తనతో కలిసి జీవించడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నా సరే, ఆమె గత వైఖరి ఇప్పుడు ఆమె చెబుతున్న మాటలకు అనుగుణంగా లేదని కూడా కోర్టు చెప్పింది… ఈ 22 ఏళ్లు తనతో కలిసి ఉండకుండా ఎవరు వద్దన్నారు..? మధ్యవర్తిత్వం, రాజీ ప్రక్రియలన్నీ విఫలమయ్యాయి కదా అని ప్రశ్నించింది…నేను ఇప్పుడు కలిసి ఉంటానని చెప్పడం విచారణను ఆలస్యం చేయడానికి, తనను వేధించడానికే అని భర్త కోర్టుకు మొరపెట్టుకున్నాడు…
Share this Article