ఈ మాట అనడానికి మనం బీజేపీ సానుభూతిపరులమే కానక్కర్లేదు… మామూలుగా పరిశీలించినా సరే ఇట్టే అర్థమైపోతుంది… రాహుల్ గాంధీ సమాజాన్ని చూసే కోణంలోనే ఏదో భారీ తేడా ఉందని..!
మిస్ ఇండియా విజేతల జాబితా చూశాను, దళిత-గిరిజన-ఓబీసీ- మైనారిటీలు లేనే లేరు అని ఎక్కడో వ్యాఖ్యానించినట్టుగా ఓ వార్త వచ్చింది… దీనిపై నెటిజనం విరుచుకుపడుతున్నారు… సహజమే… అంటే మిస్ ఇండియా పోటీల్లో కూడా రిజర్వేషన్లు పెట్టమంటావా అని కొందరు ప్రశ్నిస్తున్నారు…
బీజేపీ, బీజేవైఎం తదితర ప్రత్యర్థి విభాగాలు ఎలా స్పందిస్తాయో చూస్తే… కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు రాహుల్ పిల్లచేష్టలంటూ కొట్టిపారేశాడు… కొందరేమో ఫలానా ఫలానా వాళ్ల జాబితా ఓసారి చూడవోయీ అని వేరే జాబితా ఒకటి రిలీజ్ చేశారు… ఇదుగో ఇలా…
Ads
1947 Esther Victoria Abraham
1952 Indrani Rahman
1953 Peace Kanwal
1959 Fleur Ezekiel
1960 Lona Pinto
1961 Veronica Leonara Torcato
1962 Ferial Karim
1964 Meher Castelino Mistri
1965 Persis Khambatta
1966 Yamin Daji
1967 Nayyara Mirza
1968 Anjum Mumtaz Barg
1971 Raj Gill
1973 Farzana Habib
1978 Alamjeet Kaur Chauhan
1985 Sonu Walia
1991 Christabelle Howie
1995 Manpreet Brar
1999 Gul Panag
2007 Sarah Jane Dias
2013 Navneet Kaur Dhillon
వీరిలో మైనారిటీలు లేరా అనేది వాళ్ల ప్రశ్న… ఇక్కడ మరో ప్రశ్న… దళిత-గిరిజన-ఓబీసీ-మైనారిటీ వర్గాల నుంచి ఒక్కరూ మిస్ ఇండియా ఎంపిక కావడం లేదూ అని అడగడం అంటే… వాళ్లను చివరకు మిస్ ఇండియా పోటీల్లో కూడా తొక్కేస్తున్నారు, ఈ అన్యాయం నుంచి రక్షింపబడాలంటే కులగణన జరగాల్సిందే అని చెబుతున్నాడా..? లేక పరోక్షంగా వాళ్లలో ఎవరూ అందగత్తెలు ఉండరు అని వాళ్లను కించపరుస్తున్నాడా..? అసలు అందాల పోటీలకు కులగణన అవసరానికీ నడుమ లింకేమిటి..?
ప్రధానమంత్రికి పోటీదారుడిగా భావించబడే వ్యక్తి నోటి వెంట ఎంత హుందాగా, ఎంత పరిపక్వతతో కూడిన మాటలు రావాలి… మరీ ఇంత బేకార్ మాటలా..? మిస్ ఇండియా పోటీల్ని ప్రభుత్వం నిర్వహిస్తుందా..? సినిమాలను నటుల్ని కూడా ప్రభుత్వమే ఎంపిక చేస్తుందా..? ఏమిటీ మూర్ఖపు మాటలు అంటూ నెటిజనం పెద్ద ఎత్తున వ్యతిరేకంగా స్పందించింది…
అవును, తను ఊరుకోడు… తన తత్వం ఊరుకోనివ్వదు… ఇది సద్దుమణిగేలోపు ఇంకేదో పిచ్చి వ్యాఖ్యతో మళ్లీ వివాదాల తెర మీదకు వస్తాడు… కంట్రాస్టు ఏమిటంటే..? గతంలో ఏమో గానీ ఈమధ్య ప్రధాన మంత్రి పదవికి అర్హుడు ఎవరు అనే ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ప్రశ్నకు రాహుల్ గాంధీకి పడే వోట్ల శాతం పెరిగింది…! సరే, ఇక్కడే మరో విషయం…
బ్లిట్జ్ అనే మ్యాగజైన్ రాహుల్ గాంధీకి ఆల్రెడీ ఓ విదేశీ మహిళతో పెళ్లయిందనీ, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఓ వార్త ప్రచురించింది కదా… దాని సంగతెలా ఉన్నా… మొన్నామధ్య సుబ్రహ్మణ్యస్వామి కూడా రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం మీద ప్రశ్న లేవనెత్తాడు కదా… వీటిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ… ‘‘రాహుల్ గాంధీ మీద ఇలాంటి ఫిర్యాదులు ఏమొచ్చినా మోడీ ప్రభుత్వం పట్టించుకోదు… విచారణ జరపదు… ద్వంద్వ పౌరసత్వాన్ని దర్యాప్తు చేయదు… ఎందుకంటే… రాహుల్ గాంధీ వంటి ప్రత్యర్థి ఉంటేనే మోడీకి పాపులారిటీ… అందుకే రాహుల్ ఎప్పుడూ ఇలాగే ఉండాలనీ, తమకు తనే ప్రత్యర్థిగా ఉండాలని మోడీ శిబిరం కోరుకుంటుందని’’ వ్యాఖ్యలు చేశారు…!
Share this Article