కంగనా రనౌత్ ఇందిరాగాంధీగా నటించి, తనే దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది… ఇంకా రిలీజ్ కాలేదు, రిలీజ్ డేట్ ప్రకటించినా సరే, ఇంకా సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు… ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తానని ఆమె ప్రకటించింది…
సిక్కులను ఈ సినిమాలో ఉగ్రవాదులుగా, దేశద్రోహులుగా చిత్రీకరించారనీ, స్థూలంగా ఇది తమను అవమానించడమేననీ శిరోమణి గురుద్వారా ప్రబంధన్ కమిటీ ఆక్షేపిస్తోంది… ఈ సినిమా ట్రెయిలర్లు కూడా ప్రచార ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాలని, సినిమాకు అనుమతి ఇవ్వకూడదనీ డిమాండ్లు వస్తున్నాయి…
వివాదాస్పద వ్యాఖ్యలకు, చేష్టలకు కంగనా కొత్తేమీ కాదు… వివాదాలు ఆమె దగ్గరకు రావు, ఆమే వాటిల్లోకి నడుస్తుంటుంది… తను రాజకీయాల్లోకి వచ్చాక, ఎంపీగా ఎన్నికయ్యాక వస్తున్న సినిమా ఇది… బహుశా ఇప్పటికిది ఆమె చివరి సినిమా కావచ్చునేమో… అంతకుముందు ఆమె సినిమాలు భీకరమైన డిజాస్టర్లు… మంచి నటే… అందులో డౌౌట్ లేదు, పైసా సాహసి, ధిక్కారి… బాలీవుడ్ మాఫియా, శివసేన పెత్తనాలపై ఒంటరి పోరాటం చేసింది చాన్నాళ్లు… (రీసెంటుగా బెంగాల్‌లో అల్లర్ల మీద ఏదో కామెంట్ చేసి బీజేపీ మందలింపుకి కూడా గురైంది…)
Ads
కానీ ఆమె గత వ్యవహారశైలిని బట్టి చూస్తే… ఆ సినిమా బీజేపీ భావజాలం నుంచి ఎమర్జెన్సీని చిత్రీకరించబడిందేమో అని అందరిలోనూ సందేహం… ట్రెయిలర్ పెద్ద వివాదాస్పదంగా లేదు… ఐతే స్థూలంగా కథ ఎలా ఉంటుందో తెలియదు… నిజానికి ఎమర్జెన్సీ పరిస్థితులు వేరు, స్వర్ణదేవాలయంపై దాడి కారణాలు వేరు…
ఆమె హత్యకు స్వర్ణ దేవాలయంపై దాడికీ లింక్ ఉంది… కానీ ఎమర్జెన్సీకి ఏ లింకూ లేదు… సో, కేవలం ఎమర్జెన్సీ పూర్వాపరాలు, ఇందిరాగాంధీ నిర్ణయాలు, దేశంలో అత్యవసర పరిస్థితి దుష్ప్రభావాలకే సినిమా కథ గనుక పరిమితమై ఉంటే సిక్కులను బ్యాడ్ లైట్‌లో చూపించారనేది సందేహమే అవుతుంది… సెన్సార్ ఏమంటుందో చూడాలి… మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే అంశాల్ని గనుక కంగనా తీసుకుని ఉన్నట్టయితే సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చు…
తెలంగాణలో షబ్బీర్ ఆలీ సిక్కుల ఆందోళనలను సీఎం దృష్టికి తీసుకుపోయాడని ఒక వార్త… ఇందిరాగాంధీ నిర్ణయాలకు తప్పుడు బాష్యాలు చెబుతూ సినిమా తీశారని కూడా విమర్శలు ఆల్రెడీ వస్తున్నందున తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సినిమా ప్రదర్శనను రాష్ట్రంలో నిషేధిస్తారనే దాకా వార్తలు నడుస్తున్నాయి… ఆలూలేదు, చూలూలేదు అన్నట్టుగా అసలు దానికి సెన్సార్ పర్మిషనే రాలేదు…
అప్పుడే నిషేధ నిర్ణయమా..? బీజేపీకి పొలిటికల్‌గా మరో చాన్స్ ఇచ్చినట్టే ఇక..! మరింత ప్రచారమూ వస్తుంది… బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాగూ రిలీజ్ చేస్తారు… ట్రెయిలర్ చూస్తుంటే ఇందిరాగాంధీని గుర్తుచేయడంలో కంగనా రనౌత్ ఫెయిలైనట్టే కనిపిస్తోంది… పెద్ద ఇంప్రెసివ్‌గా సినిమా ఔట్‌పుట్ లేదనీ అంటున్నారు… మరలాంటప్పుడు ఓ ప్రభుత్వమే ఈ ప్రచారం చేసిపెట్టడం దేనికి..? ప్రేక్షక జనమే తిరస్కరిస్తారు కదా…!
మరీ అవసరమైతే ప్రభుత్వ ముఖ్యులు ఓ స్పెషల్ షో వేయించుకుని, నిజంగానే అభ్యంతకరంగా ఉందోలేదో నిర్ధారించుకుని, ఆ తరువాత నిర్ణయం మేలు..!! ఐనా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నిర్ణయం, ప్రభావాలపై ఇప్పటికే కుప్పలుతెప్పలుగా పుస్తకాలు, కథలు, కథనాలు, నవలలు వచ్చాయి కదా… వాటిని మించి కంగనా రనౌత్ ఇంకేం చూపించగలదు..?!
Share this Article