Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డబుల్ మీనింగ్ డైలాగుల పైత్యం నాటి నుంచే… కాకపోతే ఇప్పుడు ముదిరింది..!

September 7, 2024 by M S R

అక్కినేనికి దసరాబుల్లోడు లాగా , యన్టీఆర్ కు అడవిరాముడు లాగా , శోభన్ బాబుకు సోగ్గాడు . Super duper mass entertainer . రిలీజయిన 31 కేంద్రాలలో యాభై రోజులు ఆడింది . విజయనగరం , విశాఖపట్టణం , అనకాపల్లి రాజమహేంద్రవరం , కాకినాడ , ఏలూరు , భీమవరం , తణుకు , విజయవాడ , బందరు , గుంటూరు , ఒంగోలు , చీరాల , నెల్లూరు , కర్నూలు , హైదరాబాద్ , వరంగల్ కేంద్రాలలో వంద రోజులు ఆడింది . విజయవాడలో జరిగిన శత దినోత్సవానికి శివాజీ గణేశన్ ముఖ్య అతిధిగా వచ్చారు . శోభన్ బాబు కెరీర్లో ఓ పేద్ద హిట్ .

ఈ సోగ్గాడు సినిమా టెక్నికల్ గా 1975 లో వచ్చింది . డిసెంబర్ 19 న రిలీజయింది . ఆడిందంతా 1976 లోనే . అందువలనే 1976 సినిమాలలో ఒక సినిమాగా దీని సమాచారాన్ని పంచుకుంటున్నాను . వాస్తవానికి అడవిరాముడు ఈ సినిమా తర్వాత వచ్చింది కాబట్టి కంపేర్ చేయకూడదు . ఎందుకు కంపేర్ చేసానంటే రెండు సినిమాలు రికార్డులు సృష్టించాయి . ఇద్దరు హీరోయిన్లు . రెండింటిలోనూ హీరోలు చాలా ఎనర్జిటిక్ గా దుమ్ము దులిపారు .

ఈ సినిమా విజయానికి కారణం బాలమురుగన్ కధ , దర్శకుడు బాపయ్య స్క్రీన్ ప్లే , మోదుకూరి జాన్సన్ డైలాగులు . అన్నీ చాలా బిర్రుగా ఉన్నాయి . మరో ప్రధాన కారణం కె వి మహదేవన్ సంగీత దర్ళకత్వం . ఇరగ్గొట్టేసాడు . ఏడూ కొండలవాడా వెంకటేశా ఓరయ్యా ఎంత పనీ చేసావు తిరుమలేశా , ఒలె ఒలె ఓలమ్మీ ఉఫ్ఫంటేనే ఉలిక్కిపడ్డావు రెండు పాటలు శోభన్ బాబు- జయచిత్రల మీద షూట్ చేయబడ్డాయి . రెండూ చాలా హుషారుగా ఉంటాయి . జయసుధతో కూడా రెండు పాటలున్నాయి . అవ్వ బువ్వా కావాలంటే అయ్యేదేనా అబ్బాయీ , చలి వేస్తుంది చంపేస్తుంది కొరికేస్తుంది పాటలు చాలా బాగుంటాయి . ఎంతగా పాపులర్ అయ్యాయంటే ఈరోజుకీ 38 ఎళ్ళ తర్వాత కూడా మూడ్లో ఉండే జంటలు పాడుకుంటూ హుషారవుతుంటారు .

Ads

ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది సోగ్గాడు లేచాడు చూసి చూసి నీ దుమ్ము దులుపుతాడు గ్రూప్ డాన్స్ . రామానాయుడు మార్క్ గ్రూప్ డాన్స్ . దసరా బుల్లోడులో ఊరు ఊరంతా పాల్గొనే గ్రూప్ డాన్సులాగా , ఈ గ్రూప్ డాన్స్ కూడా అదరగొట్టేసింది . నృత్య దర్శకుడు హీరాలాల్ కష్టాన్ని తప్పక మెచ్చుకోవాలి . కష్టం ఫలించింది . మంజు భార్గవి , జయసుధ , జయచిత్ర ముగ్గురితో శోభన్ బాబు డాన్స్ దసరాబుల్లోడు అక్కినేనిని గుర్తుకు తెస్తుంది .

అలనాటి హీరోయిన్ అమ్మాజీ కూతురు జయచిత్రకు మొదటి తెలుగు సినిమా . అయినా బాగా నటించింది . లక్షణరేఖ , జ్యోతి సినిమాలతో పాపులరయిన జయసుధ ఈ సినిమాతో స్టారయింది . ఈ ముగ్గురితో పాటు సత్యనారాయణ , శాంతకుమారి , గుమ్మడి , అంజలీదేవి , అల్లు రామలింగయ్య , గిరిబాబు , రాజబాబు , పద్మనాభం , నాగేష్ , రమాప్రభ , ఝాన్సీ ప్రభృతులు నటించారు .

ఈ సినిమా మొత్తంలో నాకు నచ్చని ఒక సన్నివేశం , అందులోని ద్వందార్ధ డైలాగులు పద్మనాభం- రమాప్రభలవి . ఇంత చక్కని సినిమాలో ఇంత చెత్త ద్వందార్ధ డైలాగులు పెట్టకుండా ఉంటే బాగుండేదని నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను . అన్ని సినిమాలలో లాగానే రామానాయుడు ఈ సినిమాలో కూడా తళుక్కుమన్నారు . తనతోపాటు టి సుబ్బరామిరెడ్డిని కూడా తళుక్కుమనిపించారు .

దసరాబుల్లోడులో అక్కినేని స్పోర్ట్స్ కారు లాగానే ఈ సోగ్గాడు సినిమాలో శోభన్ బాబుకు అందంగా తయారుచేయబడిన ఎద్దు బండి బాగుంటుంది . నిర్మాత రామానాయుడు ఔట్ డోర్ షూటింగులన్నీ ఆయన స్వంత ఊరు కారంచేడులో , కోలవెన్ను , ఈడ్పుగల్లులలో చేసారు . ఆ గ్రూప్ డాన్స్ బహుశా కారంచేడులో ఏమయినా చేసారేమో !

బాపయ్య దర్శకత్వంలోనే రామానాయుడు హిందీలో కూడా దిల్దార్ టైటిల్ తో రీమేక్ చేసారు . రేఖ , జితేంద్ర నజ్నీన్ నటించారు . రామానాయుడు అదృష్టవంతుడు కదా ! అక్కడా డబ్బులు బాగానే వచ్చాయి . ఈ సినిమాలో కబడ్డీ పోటీలను పెట్టడం గ్రామీణ ప్రేక్షకులకు బాగా నచ్చింది . అప్పట్లో ఆటలంటే జనానికి , ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు , కబడ్డీ , కోకోలు .

ఈ సినిమా ఓ మూడు నాలుగు సార్లు చూసి ఉంటా . టివిలో వచ్చినప్పుడల్లా కాసేపు చూస్తుంటా . నేను జయసుధ అభిమానిని . మాతరంలో చూడనివారు ఎవరూ ఉండరు . ఇప్పటి తరంలో ఒకరూ అరా ఉంటే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . ముఖ్యంగా పాటల వీడియోని అస్సలు మిస్ కావద్దు . గొప్ప వినోదాత్మక ఊర మాస్ సినిమా . చూసేయండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions