అనూహ్యం… ఏ ముగ్గురు కంటెస్టెంట్లు టాప్ త్రీలో ఉంటారని అనుకుంటున్నామో… ఆ ముగ్గురూ తెలుగు ఇండియన్ మార్కుల్లో, వోటింగులో లీస్ట్ త్రీగా వేదిక మీద నిలబడటం… శ్రీకీర్తి, కీర్తన, భరత్ రాజ్… ఆ ముగ్గురిలో భరత్ రాజ్ ఎలిమినేటయ్యాడు… చిత్రం…
ఎందుకంటే… ఇదే భరత్‌రాజ్ నజీరుద్దీన్‌తో కలిసి పవన్ కల్యాణ్ రాబోయే ఓజీలో పాట పాడాడు… ఇదే థమన్ దర్శకత్వంలో… కానీ ఏమైంది..? సెమీ ఫైనల్స్‌లోనే ఎలిమినేటయ్యాడు… సో, రియాలిటీ షో వేరు… రియల్ లైఫ్ షో వేరు… నిజానికి తను ఎలిమినేట్ గాకుండా ఉండాల్సిన మెరిటోరియస్ కేరక్టర్… బట్, ఆరుగురూ మెరికలే… కానీ పోటీలో ఎవరో ఒకరు పక్కకు తప్పుకోవాల్సిందే కదా…
నిజానికి ఇండియన్ ఐడల్ షో శుక్ర, శనివారాల్లో రెండు భాగాలుగా వస్తుంది కదా ప్రతి ఎపిసోడ్… ఈసారి ఒకేరోజుకు ముగించేసినట్టున్నారు… ఆరుగురి పాటలు, ఎలిమినేషన్ కూడా… అంటే శనివారం ఏమీ లేదా..? ఏమో… అంతా థమన్ ఇష్టం..!
Ads
మనం మొన్నటి నుంచీ చెప్పుకుంటున్నాం కదా… ఈసారి ఈ షో తీవ్రంగా నిరాశపరుస్తోందీ అని… కారణం… పాటల ఎంపిక బాగా లేకపోవడం… ఈసారి ఆ ఫీడ్ బ్యాక్ వాళ్లకు చేరినట్టుంది… భిన్నమైన కాన్సెప్టుతో వచ్చారు… నిజంగా చెవుల్లో అమృతం పోసినట్టుగా… స్వరరాగయుక్తంగా ఒక కీర్తన, దానితో అదే రాగంలో ఉండే సినిమా పాటతో ఫ్యూజన్… తోడుగా ఓ మ్యూజిషియన్ పర్‌ఫామెన్స్… వావ్… అదరగొట్టింది ఈ ఎపిసోడ్…
వాస్తవంగా ఈ ఎపిసోడ్ సంబంధించి మెచ్చుకోవాల్సింది ఇద్దరిని… ఒకరు కామాక్షి, వయోలనిస్టు… రెండు పవన్, డ్రమ్మర్… పవన్ ఫ్యాన్ ఆఫ్ థమన్… నిజానికి తను ఒక్క డ్రమ్మరే కాదు, తబలా, మృదంగం ఎట్సెట్రా అన్నీ… నజీరుద్దీన్ పాటకు నిజంగా అదరగొట్టాడు… థమన్ ప్రశంసలో అతిశయోక్తి ఉండవచ్చుగాక… కానీ మెచ్చుకోవడానికి మాత్రం పవన్ అర్హుడే… శివమణికి వారసుడొచ్చాడు అని…!
తన పర్‌ఫామెన్స్ అయిపోగానే గీతామాధురి వెళ్లి పవన్ ను హగ్ చేసుకుని, బుగ్గ మీద కిస్ ఇవ్వడం అనే ఓ అసాధారణ చర్య గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం… మళ్లీ మళ్లీ వద్దిక..! కామాక్షి గురించి చెప్పడానికేముంది..? ఎక్సలెంట్ వయోలినిస్ట్… ఇద్దరి పాటలకు వయొలిన్ వాయిస్తూ ఆ ఇద్దరు కంటెస్టెంట్ల పర్‌ఫామెన్స్‌ను మించి తనే గొప్పగా ఫోకసైంది…
ఐతే ఇక్కడ రెండు విషయాలు… ఒకటి థమన్ చిన్నప్పటి డ్రమ్స్ వాయింపు గురించి… తను ఏదో ఒకటి, ఏదో ఒక సమయంలో వాయిస్తుంటే పక్క పోర్షన్‌లో ఉండే గురువు వినీ వినీ భరించలేక, కంప్లయింట్స్ చేసీ చేసీ ఇక భరించలేక గుండె ఆగి మరణించాడట… చెప్పుకోవడానికి సరదాగా చెప్పుకున్నా సరే… ఎక్కడో కలుక్కుమనిపించేదే…
మరో విశేషం ఏమిటంటే..? నిన్నటి ప్రోమో ప్రకారం… కామాక్షి వయోలిన్ వాయిస్తున్నప్పుడు ప్రతిసారీ స్కంధ వైపు చూస్తూ ఉంటుంది అని థమన్ వ్యాఖ్య… అసలు గీతామాధురిని మించిపోయి, తనేం జడ్జిమెంట్ చెబుతున్నాడో తనకే అర్థం కానట్టు మాట్లాడుతున్నాడు కదా ఈమధ్య… ఇదీ అలాంటి అసంగతమైన వ్యాఖ్యేనా అనిపించింది… తనకు స్కంధకు ముడిపెట్టడం ఏమిటని చిరాకెత్తింది… కానీ కాంటెక్స్ట్ వేరు…
స్కంధ వయోలిన్ వాయిస్తూ పాడుతూ ఉంటాడు కదా… ఇదీ వయోలిన్ వాయించే విధానం అని చెప్పడానికి అలా చూస్తూ ఉంటుంది అని థమన్ భావన… పర్లేదు, తప్పులేదు… కానీ స్కంధనూ కామాక్షిని అస్సలు పోల్చలేం… మరి ఇదేమిటి, ఆమె పాపం, పవన్‌తో కలిసి రీల్స్ చేస్తూ ఉంటుంది, ఓ పద్ధతిగా ఉంటుంది, ఈ స్కంధతో లింక్ పెట్టడం ఏమిటని కోపం కూడా వచ్చింది ప్రోమో చూస్తే… థమన్ వ్యాఖ్యలు కూడా ఆమెకు నచ్చినట్టు లేదు, తన వైపు ఓరకంగా చూసి వెళ్లిపోబోయింది… థమన్‌కు కాస్త నోటి దూల ఎక్కువే…!!
Share this Article