పక్కా బద్మాష్గిరీ… బిగ్బాస్దే… డౌట్ లేదు… ఎన్నాళ్లుగానే ఉన్న ఆరోపణే… తను ఎవరిని ఎలా చూపించాలో అలాగే చూపిస్తాడు… ఎవరినైనా నెగెటివ్‌గా చూపాలనుకుంటే… అక్కడ జరిగేది వేరు, వాడు ప్రోమో కట్ చేసి జనంలోకి తీసుకుపోయేది వేరు… ఎవరినైనా పాజిటివ్‌గా ప్రదర్శించాలి అనుకుంటే తప్పుల్ని కట్ చేసేసి, మిగతావే చూపిస్తాడు… ఎక్కువ సేపు, పదే పదే తెర మీద కనిపించేలా… ప్రమోట్ చేస్తూ…
అంతే కంటెస్టెంట్ల గేమ్ ప్లాన్ అని భ్రమపడతారు… కానీ అసలు గేమ్ ప్లాన్ బిగ్బాస్దే… ఆ టీం ఏది చెబితే అదే అవుతుంది… వాడే కట్ చేస్తాడు, వాడే ప్రమోట్ చేస్తాడు, వాడు రాసిచ్చిందే నాగార్జున గుడ్డిగా వల్లెవేస్తాడు… వెరసి బకరాలు బిగ్‌బాస్ ప్రేక్షకులు…
ఒక బోల్డ్ సీత… మరో బోల్డ్ విష్ణుప్రియ… కానీ వాళ్లు నెగెటివ్‌గా జనంలోకి పోవద్దు… అందుకని వాళ్లు బలంగా వ్యతిరేకించే ఆకుల సోనియాను బదనాం చేసే దిక్కుమాలిన ప్లాన్ బిగ్‌బాస్‌ది… వాడే విష్ణుప్రియతో ఏవో అడల్ట్ ప్రశ్న అడిగిస్తాడు… ఇక దాని మీద వాడే రచ్చ స్టార్ట్ చేయిస్తాడు… ఆమె ఆ బుర్రలేని జోక్ నచ్చలేదని రియాక్టయింది… అది తన తత్వానికి పడదు, దాన్నెందుకు వ్యతిరేకించాలి…
Ads
అరె, ఇదేదో విష్ణుప్రియ, సీతలకు వ్యతిరేకంగా జనంలోకి వెళ్తుందేమోనని బిగ్‌బాస్ గాడే ఫీలయ్యాడు… దాంతో నిఖిల్, సోనియా మధ్య నిజంగానే ఏదో యవ్వారం నడుస్తుందనేట్టుగా ప్రచారం మొదలుపెట్టాడు… నువ్వు సిగరెట్ మానేస్తే నువ్వేది అడిగితే అదిస్తా అని సోనియా నిఖిల్‌తో చెబుతున్నట్టు… ఆ మేరకే ప్రోమో కట్ చేసి… జనంలోకి వదిలారు… ఛిఛీ, చివరకు సోనియా కేరక్టర్ ఇదా అని జనం అనుకునేట్టు… ఇదే బద్మాష్గిరీ…
అసలు జరిగింది ఏమిటి… నిఖిల్ నన్ను బిడ్డగా దత్తత తీసుకో అని సోనియాను ఏదో అడుగుతుంటే, నువ్వు సిగరెట్ మానెయ్, నువ్వేది అడిగితే అది చేస్తా అని సోనియా చెప్పింది… ఇందులో ఏదో సరదా సంభాషణే తప్ప సోనియా దిగజారింది ఏముంది..? వోకే, సోనియా గానీ, నిఖిల్ గానీ… ఎవరి గేమ్ ప్లాన్ వాళ్లది… పదే పదే తెర మీద కనిపించడానికి ఏవేవో ప్లాన్లు చేస్తుంటారు… దాన్ని ఇలా నీచంగా పోట్రే చేయడం బిగ్‌బాస్ నైచ్యం… నిఖిల్ ఆల్రెడీ బయట సీరియల్ టీవీ నటి కావ్యతో కమిటెడ్… వయస్సులో పెద్దదైన సోనియాకు వేరే కుటుంబం ఉంది బయట… ఐనా ఈ లింకులేమిట్రా బిగ్‌బాస్..?
మణికంఠ, ప్రేరణ, పృథ్వి, ఆదిత్య, నిఖిల్, సీత, బాషా, నైనిక …. బిగ్ క్లాన్ పేరిట ఏవో పిచ్చి పవర్స్ అని యష్మికి చాన్స్… ఎవరినైనా సేవ్ చేయొచ్చునట, మరెవరినో బుక్ చేయవచ్చునట… తలకుమాసిన గేమ్… ఆమె ఏవో మతిమాలిన వాదనతో ప్రేరణను సేవ్ చేసి, విష్ణుప్రియను బుక్ చేసింది…
చెప్పుకోవాల్సింది మరొకటుంది… కన్నడ, కన్నడ అంటున్నారు గానీ… ఆ నటులు, ఆ కూటమి మంచి తెలుగులో మాట్లాడుతోంది… ఎటొచ్చీ అర్థం కాని తెలుగులో వాగుతున్నది తెలుగు కంటెస్టెంట్లే… సగం ఇంగ్లిషు, సగం తెలుగు… ఈరోజుకు పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్‌తో కదులుతున్నది నిఖిల్… కొందరికి చిరాకు పుడుతున్నా సరే… శేఖర్ బాషా స్పాంటేనియస్ జోక్స్ సరదాగా బాగున్నాయి..!!
Share this Article