రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ స్థాయికి చేరతారో అనూహ్యమే… ఒకప్పుడు తెలంగాణ ఉద్యమకారులపైనే మర్లబడినట్టు విమర్శలున్న పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమ పార్టీగా ఒకప్పుడు చెప్పుకోబడిన బీఆర్ఎస్‌కు ప్రస్తుతం పెద్ద దిక్కుగా కనిపిస్తున్నాడు… తెర మీద పదే పదే ప్రముఖంగా కనిపిస్తూ తనే ప్రధాన నాయకుడిగా ప్రదర్శించుకుంటున్నాడు… ఫాఫం బీఆర్ఎస్…
హుజూరాబాద్ ఎన్నికల వేళ… నేనోడిపోతే లోకంలో ఉండను, నా పాడె మోయాలి మీరు అని సింపతీ గెయిన్ ప్రచారంతో వోట్ల రాజకీయాన్ని ఓ రేంజుకు తీసుకుపోయిన ఘనత తనది… అప్పట్లో చాలా విమర్శలొచ్చాయి కానీ అవన్నీ పట్టించుకుంటే తను కౌశిక్ రెడ్డి ఎందుకు అవుతాడు..?
నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు… రాజకీయ నాయకుడు కదా, ఏదైనా మాట్లాడొచ్చు, అన్నీ చల్తా అనే ధోరణి… ‘‘పదేండ్లలో ఒక్కరినీ కేసీయార్ చేర్చుకోలేదు, ఒక్కరికే కండువా కప్పలేదు… లేదు, చేర్చుకున్నాడని నిరూపిస్తే రాజీనామా చేస్తా’’ అంటాడు… కేసీయార్ ఎవరినీ బీఆర్ఎస్‌లోకి చేర్చుకోలేదనే వ్యాఖ్యలు మరీ అల్టిమేట్… అవును, ఇలాంటివి రాజకీయాల్లోనే, అదీ కౌశిక్ రెడ్డి మార్క్ రాజకీయాల్లో చల్తా… ఈ నేతలు ఇప్పుడు బీఆర్ఎస్‌కు ఫాఫం పెద్ద దిక్కు… పెద్ద వాయిస్…
Ads
పీఏసీ చైర్మన్‌గా ఎంపికైన ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని ఏదో అన్నాడు కదా, తనను హౌజ్ అరెస్టు చేయడమో లేక ముందస్తు జాగ్రత్తగా అరెస్టే చేయడమో ఉంటుందని పొద్దున్నుంచీ వార్తలు… ఉద్రిక్తత… సరే, అవన్నీ రాజకీయాలు, వాటిని పక్కన పెడితే…
సెన్సిటివ్ ఇష్యూస్ మీద ఆశ్చర్యపరిచే కామెంట్లు… పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గూశరం లేదు, మగాళ్లే కాదు, చీరలు, గాజులు పంపిస్తాను, వేసుకుని తిరగండి అన్నాడు నిన్న… మహిళల్ని అవమానించే వ్యాఖ్యలు… ఈ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా సమర్థించుకుంటుందో, లేక బరాబర్ బాగానే మాట్లాడిండు అని సమర్థిస్తుందో ఆ పార్టీ పెద్ద తలకాయలకే తెలియాలి…
కేసీయార్ మైక్ నమస్తే తెలంగాణ కూడా ఆ వ్యాఖ్యల్ని యథాతథంగా ప్రచురించకుండా, జస్ట్, ఏవో పొలిటికల్ వ్యాఖ్యలతో ఐటమ్ పబ్లిష్ చేసింది… ఈ వ్యాఖ్యల్ని ఎడిట్ చేసింది… ఈ వ్యాఖ్యలు జనంలోకి నెగెటివ్‌గా వెళ్తాయని సందేహించిందో ఆ పత్రిక లేక పత్రిక పెద్దలకే ఆ వ్యాఖ్యలు చిరాకెత్తించాయో మరి…
కాంగ్రెస్ నుంచి మహిళా కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్లు స్పందించారు గానీ వాళ్ల కౌంటర్లకు మీడియాలో పెద్ద ప్రాధాన్యత లభించలేదు… మహిళా కమిషన్ ఉలుకూ పలుకూ లేదు… విచిత్రంగా కాంగ్రెస్ బాపతు సోషల్ మీడియా కూడా సోయి తప్పినట్టు కిమ్మనలేదు… సీతక్క కూడా స్పందించినట్టు ఎక్కడా వార్త కనిపించలేదు…!!
Share this Article