ఎవరు కాంగ్రెస్ ? ఎవరు BRS ? ఎవరు TDP ? ఎవరు BJP ? ఎవరు తెలంగాణ బిడ్డ ? ఎవరు ఆంధ్రా బిడ్డ ? అంతా మిధ్య నాయనా . మా ఖర్మ నాయనా మా ఖర్మ .
చూడండి . కౌశిక్ రెడ్డి . 40 ఏళ్ల కుర్రాడు . క్రికెట్ ప్లేయర్ . 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా TRS అభ్యర్థి ఈటెల రాజేందర్ పై పోటీ చేసి ఓడిపోయాడు . 2021 లో TRS లోకి జాయిన్ అయ్యాడు . శాసన మండలికి నామినేట్ చేస్తే ఆనాటి గవర్నర్ తమిళసై ఆమోదించలేదు . MLA ల కోటాలో ఏకగ్రీవంగా MLC గా ఎన్నికయ్యారు . 2023 లో హుజురాబాద్ నుండి BRS MLA గా ఎన్నికయి భగవంతుని దయ వలన అక్కడే ఉన్నాడు .
ఇక గాంధీ గురించి . 63 ఏళ్ళు . 2014 ఎన్నికల్లో శేర్లింగంపల్లి నుండి TDP అభ్యర్థిగా గెలిచి , తర్వాత కాలంలో BRS/TRS లోకి జంపారు . 2018 , 2023 ఎన్నికల్లో BRS టిక్కెట్ మీద గెలిచారు . సాంకేతికంగా ఇద్దరూ ప్రస్తుతం BRS లోనే కొలువై ఉన్నారు .
Ads
ఓ రెండు నెలల కింద కాంగ్రెస్ / రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ ప్రోగ్రాంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు . ఏమంత హడావుడి ? కండువా అవసరం ఏముంది !? ఇప్పుడు నయా ట్రెండ్ ఏమిటంటే ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పక్షంలోకి వెళితే , కండువాల ప్రహసనం లేదు . ముఖ్యమంత్రి గారి సుందర రూపం నచ్చి , వారి ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాం అని ముసిముసి నవ్వులు నవ్వుతూ ప్రకటించటం . నో విడాకులు . నో తాళిబొట్టు తెంచటం . ఓన్లీ వివాహేతర సహజీవనం . భలే బాగుంది . ఇది కదా అభివృద్ధి అంటే .
ముందు అర్జెంటుగా ఈ దరిద్రపు ఏంటి డిఫెక్షన్ చట్టాన్ని రద్దు చేసి పడేయాలి . అప్పుడు అధికారికంగానే అధికార పార్టీ లోకి జంపొచ్చు . అయినా ప్రజలు కూడా ఏం పట్టించుకోవడం లేదు . ఇలా వివాహేతర సహజీవనాన్ని జనం కూడా సరదాగానే ఎంజాయ్ చేస్తున్నారు .
గతంలో TRS కాంగ్రెస్ , టిడిపిలను చక్కగా ఖాళీ చేసింది . ఆంధ్రాలో YSRCP నుండి 23 మందిని టిడిపి ఎత్తుకొచ్చేసి , నలుగురు మంత్రుల్ని కూడా చేసిపడేసింది . దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం .
2019 ఎన్నికల తర్వాత జగన్ కూడా టిడిపి నుండి ఎత్తుకొచ్చుకున్నాడు . పాపం ! KCR లాగా ఎత్తుకొచ్చేయటంలో రేవంత్ కృతకృత్యుడు కాలేకపోతున్నాడు . BRS లెజిస్లేచర్ పార్టీని చీల్చలేకపోయాడు . కెసిఆర్ కెసిఆరే . ఘట్టి బుర్ర . అందుకని రేవంత్ జంపాసురులకు పదవులు కట్టబెడుతున్నారు . సవాలక్ష అవుడియాలు .
మండదూ ? కాలదూ ? ఇప్పుడు అదే జరిగింది . కౌశిక్ రెడ్డిని వదిలారు . కుర్రాడు కదా ! స్పీడులో ఉన్నాడు . ఏక్ దమ్మున BRS MLA ని కృష్ణా జిల్లా వాడిని చేసాడు . తెలంగాణా దెబ్బ రేపు చూపుతాను కాసుకో అన్నాడు . ఇప్పుడు ఆంధ్రా నుండి జనం వెళ్ళి BRS- కాంగ్రెస్ నాయకుడు గాంధీ తరఫున యుధ్ధం చేయాలి . సిధ్ధమా !? (ఇదంతా కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లోని పరిణామాల గురించే… అంతకుముందు వైఎస్ చీల్చిన విధంబు, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఏకంగా పార్టీలనే లేకుండా చేసిన వైనంబు, ప్రభుత్వాల్ని కూల్చిన దూకుడు గట్రా చర్చించలేదని గమనించగలరు…) (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article