హైకోర్టులో విచారణ సాగుతూనే ఉంది కదా… బిగ్‌బాస్ షోలో అశ్లీలం, అసభ్యతలపై కదా ఫిర్యాదులు… పిటిషినర్లు మరో అంశాన్ని కూడా చేర్చాల్సిందేమో… హింస, క్రౌర్యం… లేకపోతే ఇదేమిటి..? ఆకలితో మాడ్చటం, క్రూడ్ వాక్సింగ్ ఎట్సెట్రా… ఆటలు గాయపడేలా, హింసాత్మకంగా ఉండటం ఏమిటి..?
ఓ దశలో టాప్ కంటెస్టెంట్ నిఖిల్ బాధపడుతూ అంటున్నాడు… మొహాలకు ఏమైనా అయితే ఎలా అని..! నిజమే, దాదాపు అందరూ టీవీ, సినిమా, యూట్యూబ్‌ల మీద ఆధారపడి కెరీర్లు నిర్మించుకున్నవాళ్లే… వాళ్ల ఫేసియల్ ఫీచర్స్ దెబ్బతింటే మొత్తం కెరీరే క్లోజ్… ఆటల్లో నెట్టేసుకోవడం, గాయపరుచుకోవడం కూడా ఉంది…
సరే, మిగతా విషయాలకు వస్తే… రేషన్ సంపాదించడానికి, ప్రైజ్ మనీ పెంచుకోవడానికి పిచ్చి ఆటలన్నీ పెట్టాడు బిగ్‌బాస్… కుక్కల కొట్లాటలాగా అరుపులు, కేకలు, పంచాయితీలు… అసలు ఎందుకు అంతగా అరుస్తారు వీళ్లంతా..? ప్రత్యేకించి ప్రేరణ, యష్మి ఎట్సెట్రా… ఈసారి ఒక్కొక్కరికీ, మగాళ్లకే లెండి… హగ్గుల యావ ఇంకా పెరిగిపోయినట్టుంది… అభయ్ అయితే ఊఁ అంటే చాలు పరుగెత్తుకెళ్లి అలుముకుని ఓదారుస్తున్నాడు అందరినీ…
Ads
అవీ ఎమోషనల్ సీన్లలో కాదు, సాదాసీదా సంఘటనల్లో కూడా వెళ్లి హత్తుకుంటున్నాడు… అఫ్కోర్స్, అందరిదీ అదే బాట… ఏదో దిక్కుమాలిన ఇంటర్వ్యూలో బేబక్క చెబుతోంది… నా వాచీ ఖరీదు 78 కోట్లు, నా హ్యాండ్ బ్యాగ్ విలువ 180 కోట్లు అంటూ…! ఇంటర్వ్యూయర్ నోరు తెరిచాడు… ఆమె సెటైర్ అర్థం కాలేదేమో… బ్యాగ్ కు వేసిన లాకెట్ తయారీ లోహం హోల్ భూప్రపంచంలో దొరకదట… బంగారం, ప్లాటినం, వజ్రాలు పొదగడం కాదు, మరేదో అత్యంత విలువైన లోహంతో చేశారట, చెబుతోంది… అవును మరి, చెప్పే నోటికి వినే చెవులు లోకువ… చూపేవాడికి చూసేవాడు అలుసు… యాడ దొరికార్రా మీరంతా…
గత సీజన్లో శివాజీకి డప్పు కొట్టీ కొట్టీ శోభాశెట్టి గ్రూపు మీద మస్తు బురద చిమ్మిన ఓ సెక్షన్ మీడియా ఇప్పుడు విష్ణుప్రియను మోస్తోంది… ఆకుల సోనియాను తెగతిడుతోంది… ఫుల్లు నెగెటివిటీని ప్రమోట్ చేస్తోంది… ఎస్, నిజానికి సోనియా ఈ షోకు సూట్ కాదు, మొన్ననే చెప్పుకున్నాం కదా… అందరూ స్టెప్పులేస్తుంటే ఓ పక్కన సోఫాలో కూర్చుని చూస్తుంటుంది… యాక్టివ్ డిస్కషన్లలోకి రాదు… టాస్కులు, ఆటల్లో వీక్… నిన్న ఏదో పోటీలో పరుగెత్తుతూ బొక్కబోర్లా పడింది…
ఉద్దేశపూర్వకంగా ఆమె మీద నెగెటివ్‌గా సోషల్ మీడియా కత్తికట్టి ప్రచారానికి పాల్పడుతుండటంతో… ఈసారి తన సోషల్ మీడియా టీం గతంలో ఆమె ఉద్దరించిన సేవా కార్యక్రమాల ఫోటోలను ప్రచారంలోకి తీసుకొచ్చి, కాస్త పాజిటివ్ ప్రచారం కోసం తన్లాడుతోంది.,. ఫాఫం…
మణికంఠ మొదట్లో సింపతీ కార్డు ప్రయోగించి… పెళ్లాం వదిలేసింది, బిడ్డ దూరమైంది, తల్లి అంత్యక్రియలకూ కట్టెలకు డబ్బుల్లేవు అంటూ ఏదేదో చెబితే… ఇక సోషల్ మీడియాలో మొత్తం అదే ప్రచారం… మణికంఠ చెల్లె ఏమంది..? ఆయన భార్య ఎక్కడుంది..? తన పెళ్లి ఫోటోలు వేసి మరీ కథలు గుప్పిస్తున్నారు… అప్పటికప్పుడు ఎలిమినేట్ చేస్తే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమో అన్నట్టుగా ప్రవర్తించాడు తను… ఓ దశలో నెత్తి మీద విగ్గు పీకేసి, ఇంతకన్నా ట్రాన్స్పరెంట్గా ఉండలేను బిగ్‌బాస్ అంటూ బోరుమన్నాడు కదా… అది వైరల్…
చివరకు అదే స్టార్ మా పరివారం అనే ప్రోగ్రాములో దీపిక అనే నటితో అదే సీన్ అనుకరించే మీమ్ చేయించారు… అసలే ఆమె తింగరి వేషాలు… (గతంలో సోనియా సింగ్, ఇప్పుడు దీపిక ) తరువాత నెటిజనం బూతులు అందుకునేసరికి, మళ్లీ ఆమెతో క్షమాపణ చెప్పించారు, మళ్లీ అందులోనూ వ్యంగ్యం…
అవునూ… 78 కోట్ల వాచీ, 180 కోట్ల హ్యాండ్ బ్యాగుతో తిరిగే బేబక్కను మరీ ఒకేవారంలో ఎలిమినేట్ చేయడం ఏమిటి బిగ్‌బాస్..? కనీసం రెండుమూడు వారాలు ఉండటం కోసమైనా ఏమైనా గిట్టుబాటయ్యే సంప్రదింపులు జరపకపోయారా..? అంత సంపాదించిన ఆమె మరీ ఓ సాదాసీదా అపార్ట్మెంట్లో నిరాడంబర జీవనం గడపడం ఏమిటో… అదే మరి చెప్పేవాడికి వినేవాడు అలుసు అనేది..!!
Share this Article