Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాధ, గోపీ… పునర్జన్మలు… అక్కినేనికి అప్పట్లో ఇదే హ్యాంగోవర్…

September 15, 2024 by M S R

పులి బొమ్మను వేయాలని మొదలుపెడితే అది పిల్లి బొమ్మ అయి కూర్చుందని ఓ పాత సామెత ఉంది . వి బి రాజేంద్రప్రసాద్ మనుషులంతా ఒకటే సినిమాలాగా తీద్దామని అనుకున్నారో లేక మూగమనసులు సినిమాలాగా తీద్దామని అనుకున్నారో తెలియదు . అది మాత్రం బంగారు బొమ్మలు సినిమా అయి కూర్చుంది . ANR సెకండ్ ఇన్నింగ్సులో వచ్చిన ఈ సినిమాలో కూడా ఆలుమగలు సినిమాలోలాగానే చాలా ఎనర్జిటిక్ గా డాన్స్ చేసారు . బహుశా దసరా బుల్లోడి హేంగోవర్ ఉండి ఉండవచ్చు .

By the way , మూగమనసులు సినిమాలోలాగానే ఈ సినిమాలో కూడా అక్కినేని , మంజుల పాత్రల పేర్లు రాధ , గోపిలే . మూగమనసులు సినిమాలాగానే పునర్జన్మ కాన్సెప్ట్ ఆధారంగా తీయబడింది .

ఈ సినిమా అక్కినేని లెవెల్లో హిట్ కాలేదు . కిందాపైనా పడి వంద రోజులు ఆడింది . కె వి మహదేవన్ సంగీతం , ఆత్రేయ పాటలు సినిమాను ఈరోజుకీ గుర్తు ఉండేలా చేసాయి . ముఖ్యంగా నువ్వాదరిని నేనీదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ పాట చాలా శ్రావ్యంగా ఉండటమే కాకుండా బాగా హిట్టయింది .

Ads

ప్రత్యేకంగా చెప్పుకోతగ్గ మరో పాట అయ్యయ్యో బంగరు బాబూ పాట . ఆ పాటలో అక్కినేని , మంజుల నృత్యాలు చాలా బాగుంటాయి . మంజుల అదరగొట్టేసింది . బుట్టబొమ్మ . మిగిలిన పాటలు ఇది పొగరుబోతు పోట్ల గిత్తరా , నేను నేనుగా , ఆ సుబ్బయ్య సూరయ్య ఐ లవ్ యూ పాటలు కూడా థియేటర్లో శ్రావ్యంగానే ఉంటాయి .

రావు గోపాలరావు- ఆయన ఇద్దరు పెళ్ళాలు సూర్యకాంతం , ఛాయాదేవిల గోల గోలగోలగా ఉంటుంది . పంచాయతీ బోర్డు మెంబర్ని , ఇద్దరు పెళ్ళాల మొగుడ్ని అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది ఆరోజుల్లో . వి బి రాజేంద్రప్రసాద్ గారి దసరాబుల్లోడు హేంగోవర్లో నాగేశ్వరరావుని వాణిశ్రీ , చంద్రకళల్లాగా సూర్యకాంతం , ఛాయాదేవిలు కూడా స్నానం చేయిస్తారు . పాపం ! సూర్యకాంతం !!

సత్యనారాయణ , జగ్గయ్య , కె వి చలం , రాజబాబు , ధూళిపాళ , అంజలీదేవి , ఝాన్సీ ప్రభృతులు నటించారు . అంత ప్రాముఖ్యత లేని ఓ నౌకరు పాత్రలో ధూళిపాళ ఎలా నటించాడని ఆశ్చర్యం వేస్తుంది . జగపతి పిక్చర్స్ బేనరుపై వచ్చిన ఈ సినిమా ANR లెవెల్లో ఆడలేదనే చెప్పవచ్చు .

సినిమా యూట్యూబులో ఉంది . అక్కినేని , మంజుల అభిమానులు చూడవచ్చు . పాటల వీడియోలు కూడా ఉన్నాయి . ఈ సినిమాలో నాగేశ్వరరావు బుల్ ఫైట్ ఆరోజుల్లో ఆయన అభిమానులకు బాగా హుషారును ఇచ్చింది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు  (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …
  • హరిహరా… ఓ వీరమల్లూ… నీ కథెప్పటిది..? ఆ చార్మినార్ ఎప్పటిది..?!
  • ఒకే గది… ఒకే రోజు… కథ అక్కడక్కడే తిరిగే ‘షో టైమ్’… రక్తికట్టింది…
  • ఐదు రోజుల టెస్టు మ్యాచ్ 3 BHK… ప్రేక్షకులకు కావల్సింది T20 ….
  • వావ్, మళ్లీ కేవీపీ కనిపించాడు… అద్సరే గానీ సర్కారు గౌరవానికి రోశయ్య అర్హుడే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions