ఎప్పటిలాగే వచ్చాడు నాగార్జున… ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడం అనే ఓ పెద్ద బోరింగ్ సాగదీత ప్రోగ్రామ్ ఉంటుంది కదా… అలాగే ఏవో చిన్న చిన్న విషయాలపై కంటెస్టెంట్లకు తమలపాకుతో తలంటు కార్యక్రమమూ ఉంటుంది…
యష్మి ఓ పెద్ద క్లాన్ చీఫ్… నామినేషన్లలోనూ ఉండదు… ఏదో అరుస్తుంది, చిత్రమైన కేరక్టర్… కానీ ఏం చేయగలడు..? కొన్నాళ్లు హౌజులో ఉండాలనే ముందస్తు ఒప్పందమేదో ఉన్నట్టుంది… అలా సుతారంగా గిల్లి వదిలేశాడు… ఎప్పటిలాగే ఓ లీక్ వచ్చేసింది… శేఖర్ బాషాను ఇంటికి పంపించేశారు అని…!
నిజానికి హౌజులో ఇప్పుడు అందరూ నెగెటివ్ కేరక్టర్లే… పిచ్చి పిచ్చిగా అరుస్తూ తెగ చిరాకెత్తించే మనుషులే… శేఖర్ బాషా ఒక్కడే అప్పుడప్పుడూ తన మార్కులో సింగిల్ లైన్ డిఫరెంట్ మీనింగుల పంచులు వేస్తుంటాడు… పర్లేదు, ఎంగేజింగ్… కొన్ని అనూహ్యంగా ఉంటాయి కూడా… పైగా వోటింగులో కిరాక్ సీత, పృథ్వి లీస్ట్ వోట్స్ అన్నట్టు ఆన్‌లైన్ వోటింగ్ రిజల్ట్స్ చూపిస్తుంటాయి… వాళ్లకన్నా బాషాకు వచ్చిన వోట్లు ఎక్కువే…
Ads
ఐనా బిగ్‌బాస్ స్క్రిప్టు ప్రకారం వెళ్తాడు తప్ప వోటింగ్ గీటింగ్ జాన్తా నై కదా… ఎలిమినేట్ చేసిపారేశారు… రాజ్‌తరుణ్- లావణ్య వివాదంలో బాషా మీద కేసు కూడా ఉన్నట్టుంది… పైగా భార్య కడుపుతో ఉంది… నిజానికి తను హౌజులోకి రాకుండా ఉండాల్సింది… ఎలాగూ వచ్చాడు కదా, కొన్నాళ్లు ఉంచాల్సింది…
ఇప్పుడు ఇద్దరు వెళ్లిపోయారు కదా… ఇక రోహిణి, అవినాష్, హరితేజ, టేస్టీ తేజలను ప్రవేశపెడతారట… ఐదోవారం తరువాత, వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా… వాళ్లంతా బిగ్‌బాస్ మాజీలే… కాకపోతే ఎవరూ విజేతలు కారు… టేస్టీ తేజ పెద్ద పర్‌ఫార్మర్ ఏమీ కాదు… టాస్కుల్లో గానీ, డాన్సుల్లో గానీ, స్పాంటేనిటీలో గానీ… మరి ఏం ‘శోభ’ను తీసుకొస్తాడు కొత్తగా..? వీలయితే శోభా శెట్టినే తీసుకురావల్సింది… డామినేట్ చేసిపారేసేది… ఆట తీరే మారిపోయేది… సీతలు, విష్ణుప్రియలు, యష్మిల ఆటకట్టేది…
రోహిణి పర్లేదు గానీ, గతంలోనే బిగ్‌బాస్‌లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది… ఇప్పుడు కొత్తగా ఆమె వచ్చి తన ప్రభావాన్ని చూపించేదేమీ ఉండదు… టీవీ షోెలు, సినిమా చాన్సులతో బిజీగానే ఉంటోంది… మంచి టైమింగ్ ఉన్న నటి, కమెడియన్ తను… కానీ హరితేజ బిగ్‌బాస్ ఇమేజీని యూజ్ చేసుకోలేకపోయింది… ఏదో అరకొర సినిమా చాన్సులు తప్ప…
హరితేజ హౌజులో చివరి వారం దాకా ఉన్నట్టు గుర్తు… కానీ అప్పట్లో ఉన్న కంటెస్టెంట్లు వేరు, ఇప్పటి సరుకు వేరు, వీరి నడుమ హరితేజస్సు ఏమీ పనిచేయకపోవచ్చు… అప్పట్లో ఆట కాస్త పద్ధతిగా ఉండేది… పైగా ఆమె మరీ అంత ఎక్సట్రార్డినరీ పర్‌ఫార్మర్ ఏమీ కాదు హౌజులో…
అవినాష్ పర్లేదు… నేను పర్‌ఫార్మర్‌ను, నేను తోపును అన్నట్టుగా గతంలో బిహేవ్ చేసినా సరే… తను హౌజులో ఉంటే సరదా… మిమిక్రీ, పంచులు, స్పాంటేనిటీ గట్రా ఉంటయ్ కాబట్టి వోకే… కానీ ఓ చిన్న ప్రశ్న… ఆల్రెడీ కొత్తవాళ్లు… వీళ్ల నడుమకు హౌజు మీద పూర్తి అవగాహన ఉన్నవాళ్లను తీసుకొస్తే అది ప్రస్తుత కంటెస్టెంట్లకు మైనస్ అయిపోదా..? కొత్తవాళ్లను పోటీపడమనండి… అంతేగానీ అడ్వాంటేజ్ ఉన్న పాతవాళ్లను తెచ్చి, కొత్తవాళ్లను పోటీపడమని చెప్పడమేంటి..? సర్లెండి, అవన్నీ ఆలోచిస్తే వాడు బిగ్‌బాస్ ఎలా అవుతాడు..? పైగా ఈసారి లిమిట్ లెస్ అంటున్నారు కదా… ఫూలిష్‌నెస్‌లోనూ లిమిట్ లెస్..!!
Share this Article