ఈనాడు సంపాదక పేజీ రీడర్ షిప్ ఎప్పుడూ చాలా పూర్… సాక్షి మరీ పూర్… ఆంధ్రజ్యోతిలో భిన్న అభిప్రాయాలకు వేదికగా మార్చినందున కొంత రీడర్ షిప్ ఉన్నట్టుంది… మిగతా పత్రికల సంపాదక పేజీల గురించి ప్రస్తావనే అనర్హం…
ఈనాడులో కొన్నాళ్లుగా సంపాదక పేజీలో మార్పులు… హాయ్ బుజ్జీ, అంతర్యామి ఈ పేజీలోకి వచ్చేశాయి… ఆఫ్ బీట్ మాయం… రెండు ఫీచర్లు మూడయ్యాయి… చిన్నగా… ప్రజెంటేషన్ కూడా అనాసక్తంగా… ఎడిటోరియల్ సగమైపోయింది… మొత్తానికి ఏదేదో చేస్తున్నారు…
నేషనల్ పేజీని కూడా సగం చేశారు… మెల్లిమెల్లిగా ఒకటీరెండు పేజీల్నే కుదించేయాలనే దిశలో వెళ్తున్నట్టున్నారు… కరోనా కాలంలో తగ్గిన రీడర్స్, అడ్డగోలుగా పెరిగిపోయిన ముద్రణ- పంపిణీ వ్యయాలు పత్రికలను కకావిలకం చేశాయి, పలు ప్రధాన పత్రికలు చాలా ఎడిషన్లకు మంగళం పాడాయి…
Ads
కొన్ని ఈ-పేపర్లుగా మారిపోయాయి… మెల్లిమెల్లిగా పరిస్థితులు చక్కబడ్డాయి, కానీ ఈరోజుకూ వ్యయం విపరీతమే… వెబ్ రీడింగ్ పెరుగుతున్న ఈకాలంలో కవర్ ప్రైస్ పెంచితే మరింత నష్టం… తెలుగు పత్రికల యాడ్ రెవిన్యూ కూడా పడిపోయి, చివరకు కార్డు రేట్లకు పైసా తగ్గని ఈనాడు కూడా ఎడాపెడా రిబేట్లు ఇస్తోంది… సో, ఈ స్థితిలో పేజీల కుదింపు ఓ అనివార్యత…
కొన్ని వామపక్ష పత్రికలయితే మరీ 6 పేజీలకు కుదించుకుపోయాయి… తప్పదు… కొన్ని కేవలం ప్రభుత్వ యాడ్స్, ప్రైవేట్ యాడ్స్ కోసం, జస్ట్, చూపించుకోవడం కోసం ప్రింట్ ఆర్డర్లలో వేల కాపీలు ఉంటాయి… నిజంగా ప్రింట్ చేసేవి చాలా చాలా తక్కువ… ఏబీసీ ధ్రువీకరణ దాకా వెళ్లేవి మూడే పత్రికలు కదా…
మరీ కొన్ని చిన్న పత్రికలయితే వాట్సప్ ఎడిషన్లు అయిపోయాయి… అలా పేజీనేషన్, ఇలా ఈ-పేపర్లుగా నెట్‌లో ప్రత్యక్షం… కొన్నేళ్ల ముందు హిందూ నో, నో, ఈ వెబ్ ఎడిషన్ల వ్యాప్తి, పేజీల కుదింపు ఏమిటి, నాన్సెన్స్, మేం పేజీలు పెంచుతాం, పాఠకుడు ఫిజికల్‌గా పత్రికను పట్టుకుని చదవడానికే ఇష్టపడతాడు అనే తప్పు అంచనాతో వెళ్లింది… నాలుగు రోజులకు తలబొప్పి కట్టి మళ్లీ పాత పేజీల సంఖ్యకు రిట్రీట్ అయిపోయింది…
ఈ స్థితిలో ఆంధ్రజ్యోతి ఒకటీరెండు పేజీలు పెంచుకోవాలని భావిస్తున్నదనే వార్త ఆశ్చర్యపరిచింది… సాహసమే… ఈనాడు రామోజీరావు స్థానాన్ని పొందాలంటే ఈ చర్య ఏమీ ఉపయోగపడదు మరి… ఎంతగా కాపీలు పెరిగితే అంత నష్టం… సరే, రెండు రాష్ట్రాల్లో తన అనుకూల ప్రభుత్వాలు వచ్చాయి, పాత గండాలు పోయాయి, యాడ్స్ రెవిన్యూ పెరుగుతుంది, నిజమే… కానీ పేజీలు పెంచితే పాఠకులు పెరుగుతారనేది బహుశా ఓ తప్పుడు అంచనా… జనం ఇప్పుడు వార్తల కోసం పెద్దగా పత్రికల మీద ఆధారపడటం లేదు, సమాచార మార్గాలు బోలెడు…
ప్రస్తుతం జనంలోకి వెళ్లేవి ఎక్కువగా ఈ-పేపర్లే… మూడు నాలుగు గంటలకు ఒకటి చొప్పున కొన్ని మీడియా సంస్థలు డైనమిక్ ఎడిషన్లను కూడా రిలీజ్ చేస్తున్నాయి… ఆంధ్రజ్యోతి పేజీల పెంపు ప్రయత్నాలు- ఆలోచనలు సాక్షి ఉన్నత స్థాయి సమావేశంలో ప్రస్తావనకు వస్తే చైర్మన్ భారతీరెడ్డి మనకు ఆ అవసరం లేదని తోసిపుచ్చింది…
మార్కెట్‌లో ప్రస్తుతం డెస్కు స్టాఫ్‌కు బాగా కొరత ఉంది… ట్రెయిన్‌డ్ జర్నలిస్టులు లేరు… ఫీల్డ్ జర్నలిస్టుల సంఖ్య పర్లేదు కానీ ఆఫీసుల్లో నైట్ డ్యూటీలు చేయాల్సిన జర్నలిస్టులు దొరకడం లేదు, మళ్లీ జర్నలిజం స్కూళ్లు తెరిచి, కొత్తగా అభ్యర్థులను తీసుకుంటున్నారు… ఐనా స్పందన ఉండటం లేదు… ఆల్రెడీ పనిచేస్తున్నవాళ్లు కూడా సరిగ్గా పనిచేసే సిట్యుయేషన్ లేదట… రాబోయే రోజుల్లో కృత్రిమ మేధను ఆశ్రయిస్తే తప్ప ఈ సమస్య తీరేట్లు లేదు… ఇదీ స్థూలంగా తెలుగు పత్రికల ప్రస్తుత స్థితి…
Share this Article