మామూలుగా ఫ్రాంక్ కాల్స్ మీద నాక్కొంచెం చిరాకు… టీవీ షోలలో ఇదొక దిక్కుమాలిన వినోదం… మనం హఠాత్తుగా వెనుక నుంచి ఎవరి కళ్లో మూసేసి ఎవరో చెప్పుకో చూద్దాం అంటుంటాం కదా సరదాగా… సరే, ఆటపట్టించడమో, సరదాయో… గుర్తుపడితే చెబుతాం, లేదంటే కాసేపటికి వాళ్లే ఎదుటకు వచ్చి నిలబడతారు, మొహం అదోలా పెట్టి చూస్తారు…
కానీ ఈ ప్రాంక్ కాల్స్ ఇలాంటివే, డిఫరెంట్… ఎవరో ఏదో షోలో ఉంటారు, ఇంటర్వ్యూయర్ ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయండీ అంటారు… చేస్తారు… వాళ్లను విసిగిస్తారు… బయట వాళ్లు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏ మూడ్‌లో ఉన్నారో పట్టదు… ఆటపట్టిస్తున్నాం అనుకుంటారు, కానీ ఈ ఆటలో ఎదుటివాళ్లను బుక్ చేస్తున్నామని మాత్రం ఆలోచించరు…
బట్, ఓ చిన్న వీడియో… కరాటే కల్యాణి తెలుసు కదా… కాస్త కంట్రవర్సీ కేరక్టర్… అప్పట్లో బిగ్‌బాస్‌కు వెళ్లి, వారం పది రోజులకే గోడకు కొట్టిన బంతిలా రయ్‌మని తిరిగొచ్చేసింది కదా… సేమ్, బేబక్క… ఏజ్ ఫ్యాక్టర్, ఇలాంటి వాళ్లను చాన్నాళ్లు ఉంచరు హౌజులో… పంపించేస్తారు… అది వాడి స్ట్రాటజీ… సో, కల్యాణి, బేబక్క దొందూ దొందే…
Ads
మొన్నామధ్య ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూయర్‌తో వాచీ, హ్యాండ్ బ్యాగ్ ధరలు చెప్పి ఆడుకున్నది తెలుసు కదా, మనమూ చెప్పుకున్నాం… ఆ బేబక్కను ఈ కల్యాణి ఇంటర్వ్యూకు పిలిచింది… సరిపోయింది, ఇద్దరికిద్దరూ… (బహుశా కల్యాణి సొంత యూట్యూబ్ చానెల్ ఏదో రన్ చేస్తున్నట్టుంది చూడబోతే… సరే, ఆమె ఇష్టం…)
ఏవేవో పిచ్చి కబుర్ల నడుమ ప్రాంక్ కాల్ చేయమని అడిగింది… బేబక్క అలియాస్ మధు సుధీర్‌కు ఫోన్ చేసింది… అదేనండీ, సుడిగాలి సుధీర్… ఇద్దరూ బెజవాడ సెలబ్రిటీలు కదా… పరిచయం బాగానే ఉన్నట్టుంది… నేను బిగ్‌బాస్ హౌజు నుంచి తిరిగి వస్తూ ఓ బెంజ్ కారుకు డ్యాష్ ఇచ్చాను, వాళ్లు గొడవ చేస్తున్నారు, మీడియాను పిలుస్తా అంటున్నారు, పోలీసులు అంటున్నారు, నాకు భయమేస్తుంది, 5 లక్షలు అడుగుతున్నారు అని బేబక్క కాల్ సారాంశం…
గొడవ చేస్తున్నవాళ్లకు ఈ ఫోన్ ఇస్తున్నా, మాట్లాడు అంటే…. తీసుకుని, కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు, గౌరవం ఇస్తూనే సమస్యను టాకిల్ చేయడానికి ప్రయత్నించాడు… అప్పటిదాకా తనకు అది ప్రాంక్ కాల్ అని తెలియదు… ఇక్కడ నాకు నచ్చింది సుడిగాలి సుధీర్ కూల్‌గా మాట్లాడిన తీరు… ప్లస్ నిజంగా గొడవలో ఉన్న ఓ స్నేహితురాలికి ధైర్యం చెప్పడం, అంతేకాదు, అవసరమైతే ఆ డబ్బు నేనిస్తానులే అని భరోసా ఇవ్వడం… ఎక్కడా కృతిమత్వం లేదు… నిజంగానే తను డౌన్ టు ఎర్త్ మనిషి… తన స్పందన నచ్చింది… గుడ్ సుధీర్… కీప్ దిస్ క్వాలిటీ ఫరెవర్…
ముందుగా నువ్వు సేఫేనా అనడిగాడు, తరువాత డ్యాష్‌కు గురైన వాళ్లు సేఫేనా అనడిగాడు… సో, ఎంత డ్యామేజీ అయితే అంత పే చేద్దాం అన్నాడు… తప్పు మనవైపు ఉన్నప్పుడు కొన్ని నష్టాలొచ్చినా భరించాలి కదా అన్నాడు… వాళ్లు అర్జెంటుగా లక్షన్నర షేర్ చేయమంటున్నారు, నా దగ్గర లేవు అనగానే మరీ అంత అవసరమైతే నేను పే చేస్తాను, కానీ రిపేరుకు ఎంత ఖర్చు అయితే అంత భరిద్దాం, ఇప్పుడే ఇవ్వలేం అన్నాడు…
చివరగా… ప్రాంక్ కాల్స్‌తో ఎదుటి వాళ్లను ఎడ్డోళ్లను చేస్తుంటారు కదా… కానీ ఈ ప్రాంక్ కాల్‌లో ఎవరు ఎడ్డిమొహం వేశారు చివరకు..!!
Share this Article