ఛిఛీ… చివరకు సుమా, నువ్వు కూడా అలాగే గలీజుగా తయారయ్యావేమిటి..? శీర్షిక హార్ష్‌గా ఉన్నట్టు అనిపిస్తోందా..? ఇన్నేళ్లు పవిత్రంగా, మడికట్టుకుని కొన్ని వేల షోలను, ఫిలిమ్ ఫంక్షన్లను అలవోకగా, సరదా సరదాగా నడిపించేసిన సుమలో ఏం గలీజుతనం కనిపించిందనేదే కదా మీ ప్రశ్న…
ఈటీవీలో ఆమె ఓ దిక్కుమాలిన ప్రోగ్రాం చేస్తుంటుంది… గతంలో షోలు ఫ్లాపయ్యాక సుమ అడ్డా అనే పేరుతో ఈ కొత్త షో చేస్తోంది… గరిష్ఠ స్థాయిలో అది సినిమా ప్రమోషన్ల కోసమే… ఎవరో కొత్త సినిమా నుంచి కొందరు వస్తారు, వాళ్లతో కొన్ని పిచ్చాపాటీ ఆటలు, కబుర్లు… బస్, అంతే…
జనానికి సుమ హోస్టింగు మీద భయంకరమైన మొనాటనీ ఫీలింగ్ వచ్చింది… సుమకు అర్థం కావడం లేదు… సేమ్, ఫార్మాట్‌లో షోలు నడిపిస్తూ… అదే ధోరణి… సరే, పోతేపోనీ, అంతకుమించి భిన్నమైన షోలను ఆమె ఆలోచించలేదు, చేయలేదు, మారలేదు… కానీ కొత్తగా ఈటీవీ షోలలో కనిపించే ఆ గలీజు, వెగటుతనాన్ని తనెందుకు పూసుకోవాలి..?
Ads
ఎలాగూ ఆ షోను ఎవడూ పెద్దగా దేకడం లేదు… టీఆర్పీల జాబితాలో ఎక్కడో దిగువన కొట్టుమిట్టాడుతూ ఉంటుంది… ఓ తాజా ప్రోమో చూద్దాం… కొత్త సినిమా వాళ్లు ఎవరూ దొరకనట్టున్నారు… ఇక పదే పదే టీవీ ప్రోగ్రాముల్లో కనిపించే పాత బిగ్‌బాస్ టీంను ప్లస్ మరో ఇద్దరిని పట్టుకొచ్చింది… టేస్టీ తేజ, ఆట సందీప్, శోభాశెట్టి తదితరులున్నారు…
మీరు రాసింది ఆవులు, గేదెలు కలిపి మూడు, కానీ అక్కడ రెండే ఉన్నాయి కదా అంటోంది సుమ… ఆ వెనుక వైపు స్క్రిప్టు ప్రకారం ఓ బర్రెలాగా కాస్త వంగి నిల్చున్నాడు తేజ… కాదు, మూడున్నాయి, చూడండి అంటోంది ఒకామె… ఓ సారీ, నేనే సరిగ్గా చూడలేదు, కానీ నీకు పాలు పిండటం వచ్చా, కాదా అని నేను టెస్ట్ చేయాలని అనుకుంటున్నా అంటోంది సుమ…
వచ్చు, నాకు పాలు పిండటం వచ్చు అంటోంది ఒకామె (పేరు తెలియదు), వోకే కమాన్ అన్నది సుమ… ఆమె వెనుకకు తిరిగి టేస్టీ తేజ ఎదుట నిలబడి, కాస్త వంగి, పాలుపిండటం కోసం వంగినట్టుగా… ఎక్కడ చేయాలి అనడుగుతోంది… అంటే ఎక్కడ నుంచి పిండాలి అని… అందరూ వెకిలి నవ్వులు…
అందుకే, మిమ్మల్ని నమ్మనది, దున్నపోతును పట్టుకుని పాలు పితుకుతాను అంటుంది చూశారా అని సుమ ఇంకేదో కవరింగు… ఓహో, దున్నపోతా అంటోంది తేజ ముందు నిలబడి పాలు పితుకుతానని తయారైన ఆ వయ్యారి… అర్థమైంది కదా సీన్… ఏం పట్టుకుని పితకాలి అనే ప్రశ్నను మనం కామెడీ అనుకోవాలి, అది సుమ మార్క తాజా ఫన్… ఫాఫం సుమ… చివరకు నువ్వు కూడా ఈటీవీ షోల మార్కు బూతును వంటపట్టించుకున్నావా..?! సుమ అడ్డా అని పేరు పెట్టుకున్నంతమాత్రాన అడ్డగోలు వెగటు కామెడీ అక్కర్లేదు సుమా… నీ ఇమేజీ వేరు, కాపాడుకో…
Share this Article