దాదాపు గంటన్నర సేపు కావచ్చు… సుదీర్ఘమైన ప్రెస్‌మీట్… ఒక టీవీ ఒక రియాలిటీ షో స్టార్ట్ చేసేముందు ఇలా ప్రెస్‌మీట్ ఆర్గనైజ్ చేయడం విశేషం కాగా, అంతసేపు ఆసక్తికరమైన క్వశ్చన్లతో మీడియా కూడా ఎంటర్‌టెయిన్ చేయడం మరో అదనపు విశేషం… అదే జీతెలుగులో త్వరలో స్టార్ట్ చేస్తున్న జీసరిగమప ప్రోగ్రామో… అదేనండీ, సినిమా పాటల పోటీ… (ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ థర్డ్ సీజన్ చెడగొట్టడంతో ఇక అందరు సినిమా పాటల అభిమానుల దృష్టీ జీతెలుగు సరిగమప మీద పడింది…)
జడ్జిలు కోటి, శైలజ, కాసర్లలతోపాటు రేవంత్ కూడా ఇందులో పాల్గొన్నాడు… అసలైన హైపిచ్ శ్రీముఖి కనిపించలేదు… అఫ్‌కోర్స్, ప్రస్తుతం తెలుగు సినిమా పాటల్లో సాహిత్యం తగ్గింది అంటూ… సరిమగప అన్నారు గానీ, సరిగమపదని లేదు, అదేమిటి అనే ఓ మోస్తరు ప్రశ్నలు కూడా వినిపించాయి… ఆ ప్రశ్నల జోలికి వెళ్లడం లేదు గానీ… ఓ ఆసక్తికరమైన ప్రశ్న…
అప్పట్లో ప్రణవి ఓ ఇంటర్వ్యూలో గాయకుల ప్రతిభను ఎలా దోపిడీ చేస్తున్నారో చెప్పింది… (మిటూ తరహా వేధింపుల కథలూ ఉన్నాయట సింగింగ్ ఇండస్ట్రీలో… అది వేరే కథ…) మరీ 3 వేలు ఇచ్చి కూడా పాడించుకున్నారు కొందరు దర్శకులు అని చెప్పింది కదా… పలు టీవీ సింగింగ్ షోలతో కొత్త రక్తం వస్తోంది… చాలా బాగా పాడుతున్నారు, సంగీత దర్శకులు కొందరిని చాన్సులు ఇస్తున్నారు…
Ads
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ వంటి షోలకు జడ్జిగా వస్తున్నానూ అంటే కొత్త నీటి అన్వేషణ కోసమే అని థమన్ చెబుతున్నాడు… తనూ చాన్సులు ఇస్తున్నాడు… కానీ నిజంగా వాళ్లకు ఇస్తున్న పారితోషికం ఎంత..? పెద్ద ప్రశ్న… ఈ ప్రశ్నకు కాసర్ల ఏదో డిమాండ్ అండ్ సప్లయ్ అని చెప్పబోయాడు, సక్సెస్‌ను బట్టి రేటు అని కోటి ఏదో చెప్పాడు గానీ నప్పలేదు… కోటి చెప్పిన జవాబయితే ఆమడల దూరంలో ఉండిపోయింది…
లక్షల స్టేటస్ ఉన్న బాలు కూడా 3 వేలకు పాడాడు తెలుసా అనడిగాడు ఆ ప్రశ్న వేసిన లేడీ జర్నలిస్టును..! సుశీల, జానకి, శైలజ ఎవరూ ఇంత కావాలని డిమాండ్ చేయలేదు, ఇచ్చినంత తీసుకున్నారు అన్నట్టుగా ఏదో చెప్పాడు… రెడిక్యులస్… (బాలు 3 వేలకు పాట పాడింది ఏ కాలంలో స్వామీ..?)
ఎస్, నిజంగానే ఇండస్ట్రీలో గాయకుల దోపిడీ ఉంది… జాతీయ అవార్డు పొందిన మెరిటోరియస్ గాయని పెళ్లిళ్లలో కచేరీలు చేసుకుంటోంది… అలా బోలెడు మంది… సినిమా పాటలు పాడితే, అవి చూపించుకుని ప్రైవేటు కచేరీల్లో పార్టిసిపేట్ చేసి నాలుగు డబ్బులు సంపాదించుకోవాల్సిందే గానీ ఇండస్ట్రీ పే చేస్తుంది చాలా చాలా తక్కువ… ప్రణవి అప్పుడెప్పుడో చెప్పిన సిట్యుయేషనే నేటికీ ఉంది…
ఇప్పుడంతా బాగానే ఉంది అని రేవంత్ ఏదో చెప్పబోయాడు గానీ… ఉత్త డొల్ల సమర్థన… శ్రీరామచంద్ర సింగింగ్ లాభం లేదనే కదా డాన్సులు, వెబ్ సీరీస్ గట్రా చేసుకుంటున్నాడు… ఇదే రేవంత్ డబ్బు కోసమే కదా బిగ్‌బాస్‌లోకి వచ్చాడు… యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి, వేల మిలియన్లు (??) డబ్బు సంపాదించి పెడుతున్నాయి అంటాడు కాసర్ల… కానీ శ్యామ్… ఇక్కడ ప్రశ్న ఇండస్ట్రీ ఏం పే చేస్తుందనేదే..! నిజానికి ఈ ప్రశ్నకు ఇండస్ట్రీ దగ్గర తలెత్తుకునే జవాబు లేదు కదా…!!
Share this Article