నిజంగా చంద్రబాబు ఆ మాటన్నాడా…? డౌటొచ్చింది నిన్న సోషల్ మీడియాలో చదువుతుంటే..! ఈనాడు రిపోర్టింగు సరిగ్గా ఉండటం లేదు కాబట్టి చంద్రబాబు వాయిస్ ఆంధ్రజ్యోతిలో రాస్తాడా లేదా చూద్దామని అనిపించింది…
తెల్లవారి ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ ఓపెన్ చేసింది దీనికోసమే… రాసింది, అసలు వార్తలో ఎక్కడో ఒక వాక్యం… అదేమిటంటే..? ‘‘ఏ మతానికి చెందిన ఆలయం లేదా ప్రార్థనా మందిరాల్లో ఆ మతానికి చెందినవారే పనిచేసేలా ఓ చట్టం తీసుకొస్తున్నాం…’’
జగన్ హయాంలో హిందూ గుళ్లపై జరిగిన దాడులు, పొన్నవోలు వంటి లాయర్ల అతి వ్యాఖ్యలు గట్రా ఏవేవో మాట్లాడాడు… పాలిటిక్స్‌ను కూడా రంగరించాడు… అవన్నీ సరే… అన్యమతస్తుల వ్యవహారంలో నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉందా..? ఇదీ అసలు ప్రశ్న…
Ads
ఏ మత ప్రార్థనా మందిరాల్లో ఆ మతస్తులే పనిచేయాలి అంటున్నాడు చంద్రబాబు… అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్‌కూ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో దీన్ని ఎందుకు పట్టించుకోలేదు..? ఇప్పుడే హఠాత్తుగా ఎందుకు గుర్తొస్తోంది..? 2014 నుంచి 2019 వరకు పాలనకాలంలో టీటీడీలో అసంఖ్యాకంగా అన్యమతస్తులు చేరలేదా..?
తిరుమలే కాదు… శ్రీశైలం, ఇతర గుళ్లు… ఆయా గుళ్ల ప్రాంగణాల్లో వ్యాపార సంస్థలు… ముందుగా చంద్రబాబు ఓ శ్వేతపత్రం రిలీజ్ చేయగలడా..? కేవలం ఇప్పుడు లడ్డూ వివాదాలు, డిక్లరేషన్ గొడవలు, హిందూ మతానికి అపచారాలు గట్రా చర్చల్లోకి వచ్చాయి కాబట్టి… ఏదో జగన్‌కు మరింత డిఫెన్సులోకి నెట్టేయడానికి కొత్తగా ఈ అన్యమత ఉద్యోగుల ఇష్యూ తీసుకున్నాడా..?
సరే, ఓ చట్టాన్ని నిజంగానే తీసుకొచ్చాడు అనుకుందాం… మరిప్పుడు టీటీడీలో తిష్ఠవేసిన ఆ ఉద్యోగుల్ని ఏం చేస్తారు..? అది ప్రభుత్వ కొలువు ఏమీ కాదు, వేరే శాఖల్లో అడ్జస్ట్ చేయడానికి..! రాజకీయ ప్రయోజనాల కోసం అందరినీ అలా తీసుకొచ్చి నింపేశారు… ఇక్కడ శ్రీవారి భక్తుల కానుకల సొమ్ము నుంచే జీతాలు తీసుకుంటూ తమ సొంత మతాచరణలో ఉన్నవారిని చంద్రబాబు పంపించేయగలడా..? టీటీడీలో అర్చకగణం, పోటు వంటి విభాగాలు తప్ప దాదాపు ప్రతి విభాగంలోనూ అన్యమతస్తులు చేరారంటారు…
మతసంబంధ సెన్సిటివ్ అంశాలకు సంబంధించి ఏదైనా మాట చెబితే దానికి కట్టుబడి ఉండాలి… కానీ తన నైజం వేరు, మాటకు కట్టుబడి ఉండటం మా ఇంటా వంటా లేదుపో అంటాడు చంద్రబాబు… చంచల సిద్ధాంతి… ఇదీ అంతేనా..? నిజంగానే చేయదలిస్తే ఫలానా కార్యాచరణ ఆలోచిస్తున్నాను అని కాస్త క్లారిటీ ఇవ్వాలి… అదేమీ లేకుండా తాత్కాలికంగా ఏదో ఓ మాట అనేసి, తరువాత ప్రజలే మరిచిపోతారులే అనుకుంటే మాత్రం… అదీ దైవాపరాధమే అధ్యక్షా..!!
అవునూ… అనంతపురం జిల్లాలో రథం తగులబెడితే వెంటనే నిందితుడిని పట్టుకున్నాం, తను వైసీపీ వాడే అంటున్నాడు కదా చంద్రబాబు… మరి రామతీర్థం విగ్రహం తలనరికివేత, అంతర్వేది ఆలయరథం దహనం, కనకదుర్గ వెండిసింహాల అపహరణ వంటి పాత కేసుల్ని కూడా తవ్వి, నిందితులెవరో తేల్చి, జగన్ ఆ కేసుల్ని ఎందుకు ఉపేక్షించాడో కూడా బయటపెడతారా సార్..?!
Share this Article