కొందరు నాయకులు భలే తమాషాగా మాట్లాడతారు… జనం నవ్వుకుంటారనే సోయి కూడా లేకుండా మాట్లాడతారు… చాలామంది నాయకులు అంతే… టీజీ వెంకటేష్ కూడా అంతే… తనకు రాజకీయం కూడా వ్యాపారమే… తన వృత్తి కూడా వ్యాపారమే…
రాజకీయం అంటే తనకు అంగట్లో దొరికే ఓ సరుకు మాత్రమే… అందుకే తను బీజేపీలోకి జంపయ్యాడు… కొడుకేమో టీడీపీ… పైగా ఇప్పుడు శ్రీమాన్ చంద్రబాబు గారి కేబినెట్‌లో అమాత్యవర్యుడు… బాబు దయామయుడు, మీ తత్వానికి తగిన ఇండస్ట్రీస్ పోర్టుఫోలియో ఇచ్చాడు… అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీ శిబిరాలు… జస్ట్, ఏ కమాడిటీ అండ్ ఏ ట్రేడింగ్…
విషయానికొస్తే… ఆర్య వైశ్యులు టీటీడీకి అనర్హులట… ఓ ప్రవచనం వెలువరించాడు సారు గారు… ఎలా..? నీకు ఇవ్వరు అంటే, అది నీ సొంతం… నీకూ చంద్రబాబుకూ ఉండే సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది… దాన్ని కులానికి ఎందుకు అంటగట్టడం..? ఎందుకు వైశ్యులకు ఇవ్వరు అనడానికి ఓ శుష్క రీజన్ చెప్పాడు తను …
Ads
వైశ్యులు వ్యాపారాల్లో బిజీగా ఉంటారట, టీటీడీ అనేది అక్కడే ఉండి వ్యవహారాలు చక్కబెట్టే పని కాబట్టి, అలాగే చేయాలి కాబట్టి వైశ్యులు పనికిరారట… వీటినే దిక్కుమాలిన వాదనలు అంటారు సేటు గారూ…
నోటికొచ్చింది చెప్పేస్తే ఎలా సేటూ… నీకెలాగూ ఇవ్వరు కాబట్టి నాకు ఆ ఆసక్తి లేదని ఓ కవరింగు, ఓ కలరింగు సరే… కానీ కులానికి ఎందుకు ప్రతిదీ పూయడం..! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఎవ్వరూ వైశ్యుడికి టీటీడీ పగ్గాలు ఇవ్వాలని ఆలోచించలేదు… చివరకు వైశ్య రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు కూడా..!
సరే, జగన్ ఎలాంటివాళ్లను పెట్టి, ఏం ఉద్దరించాడో చూస్తూనే ఉన్నాం గానీ… చంద్రబాబు ఏమైనా తక్కువా..? ఇప్పుడు టీవీ5 నాయుడికి ఇస్తాడట… తన చానెళ్లలో నాస్తికత్వం మీద డిబేట్లు, చాలెంజులకు దిగుతుంటాడు నాయుడి గారి ఛాంపియన్ డిబేట్ ప్రజెంటర్… ఈయన టీటీడీ పగ్గాలు తీసుకుని అర్జెంటుగా జగన్ చెడగొట్టిన వ్యవహారాలన్నీ ప్రక్షాళన చేసి, ఉద్దరిస్తాడట… అరచేతిలో వెంట్రుకల్ని మొలిపించే హెయిర్ ఆయిల్స్ దగ్గర నుంచి జుబ్లీ హిల్స్ సొసైటీ యవ్వారాల దాకా ఎన్నెన్నో కథలు…
ఏం..? వాళ్లతో పోలిస్తే… దేవుడిని అమ్మకానికి పెట్టడం కాదు, దేవుడి మీద నమ్మకాన్ని పెంచేలా… అవసరమైతే తామే నాలుగు డబ్బులు జేబులో నుంచి ఖర్చు పెట్టగల ధర్మపరాయణులైన వైశ్యులు బోలెడు మంది… వ్యాపారాల్ని, కొలువుల్ని చాలించుకుని దైవసేవలో గడపాలని అనుకునేవాళ్లు బోలెడు మంది… మరీ 74 ఏళ్లొచ్చినా ఇంకా వ్యాపారాలు, ఇంకా రాజకీయాల యావ తప్ప మరేమీ పట్టని ఈ టీజీ వెంకటేష్ చెప్పినట్టు ఎప్పుడూ వైశ్యులకు వ్యాపారాలే కాదు ముఖ్యం… వాటిని మించి అన్నీ..!!
అయ్యా టీజీ గారూ… ఆ రోశయ్యను వైశ్య సమాజం ఓన్ చేసుకుంది గానీ, నిన్నెప్పుడూ తమ నాయకుడిగా గుర్తించలేదు… దిక్కూమొక్కూలేని, పబ్లిసిటీ మాంగర్స్ ఎందరో రకరకాల అంతర్జాతీయ సంఘాలు పెట్టి మరీ మీడియాలో కనిపిస్తుంటారు గానీ… నువ్వు ఎంత వ్యాపార, రాజకీయ ప్రముఖుడివైనా సరే… వైశ్య కులానికి చేసిందేమీ లేదు… కులమూ నిన్ను ఓన్ చేసుకున్నదీ లేదు… ఇదుగో ఇందుకే..!! (టీజీ వెంకటేష్ అనగా తెలంగాణ వెంకటేష్ కాదు, ఆయన ఏపీ వెంకటేషే… టీజీ అనేది ఇంటిపేరు… తుంబలం గూటి…
ఈ ఇంటి పేరే ఉన్న ఈయన సోదరుడి కొడుకు విశ్వప్రసాద్ బంజారాహిల్స్‌లోని 100 కోట్ల ప్రాపర్టీ గొడవల్లో నిందితుడు… ఆ ఎఫ్ఐఆర్‌లో ఈయన పేరు కూడా పెట్టారని వార్తలొచ్చాయి… 2022… ఎహె, నా పేరు లేదని ఈయన వివరణ ఇచ్చాడు… సరే, అదంతా వేరే కథ…)
Share this Article