నేను చెప్పబోయే విషయం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు.. భూపీందర్ సింగ్ హుడా లోక్‌సభ సభ్యుడిగా ఉన్న సమయంలో నన్ను కలవడానికి అపాయింట్‌మెంట్ కోరాడు. నేను అప్పుడే ది ట్రిబ్యూన్ పత్రికలో ఎడిటర్‌గా జాయిన్ అయ్యాను. ఆ సమయంలో హుడా నా అపాయింట్‌మెంట్ అడిగాడు. అయితే హుడా ఎందుకు నన్ను కలవాలని అనుకుంటున్నాడో నాకు అర్థం అయ్యింది.
ఆ సమయంలో హుడా కోడలు గీతా గ్రేవాల్ వాళ్ల కుటుంబంపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టింది. భూపేందర్ హుడా కుటుంబం తనను తీవ్రంగా వేధిస్తోందని, అదనపు కట్నం తీసుకొని రమ్మంటున్నారని కేసు వేసింది. భూపేందర్ హుడా తండ్రి కాన్‌స్టిట్యుయెంట్ అసెంబ్లీలో సభ్యుడు. అంతే కాకుండా వాళ్ల కుటుంబం మొదటి నుంచి చాలా సంపన్నమైనదే. ఇలాంటి హుడా ఫ్యామిలీ కట్నం కోసం వేధించారని కోడలు చెప్పడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.
వాస్తవానికి కొడుకు దీపిందర్ హుడా, కోడలు గీత మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వరకట్న వేధింపుల పెట్టినట్లు అర్థం అవుతోంది. అయితే అంత డబ్బున్న కుటుంబం నాలుగైదు లక్షల అదనపు కట్నం అడిగారనే విషయమే నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. ఆ తర్వాత ఆ జంట విడిపోయింది. కోడలు రాజకీయాల్లోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఇవన్నీ నాకు తెలుసు.. అందుకే ఏదో ఫేవర్ కోసం నా అపాయింట్‌మెంట్ కోరి ఉంటాడని అనుకున్నాను.
Ads
అయితే ఆశ్చర్యకరంగా భూపీందర్ హుడా నా నుంచి ఎలాంటి ఫేవర్ కోరలేదు. కానీ.. ది ట్రిబ్యూన్ పత్రిక కోడలు చెప్పిన చాలా విషయాలను కవర్ చేసింది. అదే విధంగా మేము చెప్పే విషయాలు కూడా రాయాలని హుడా కోరారు. మా కుటుంబాన్ని సంప్రదించి.. అలిగేషన్స్ ఎదుర్కుంటున్న వారి వివరణ కూడా రాయమని అన్నారు. అప్పట్లో హర్యానా, ఢిల్లీలో ది ట్రిబ్యూన్ పత్రిక లీడింగ్‌లో ఉంది. అందుకే హుడా ఆ విధంగా కోరారు. జర్నలిజం అన్న తర్వాత ఇరు పక్షాల వాదనలకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో.. నేను ఆ వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టుకు వీళ్ల వాదన కూడా రాయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను.
ఈ ముచ్చట ముగిసిన తర్వాత.. సరదాగానే.. హర్యానాలో ఎన్నికల గురించి ప్రస్తావించాను. అప్పటికే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఆ సమయంలో భూపేందర్ హుడా సీఎం రేసులో ముందున్నారు. అప్పుడు భూపేందర్ హుడా ఏం చెప్పారంటే.. ఒక వేళ కాంగ్రెస్ ఓడిపోవాలని ప్రయత్నించినా.. హర్యానా ప్రజలు మాత్రం మమ్మల్నే గెలిపిస్తారని కుండబద్దలు కొట్టారు. అప్పటికే రాష్ట్ర ప్రజలు ఓం ప్రకాశ్ చౌతాలాతో విసిగిపోయారని.. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.
భూపీందర్ హుడా చెప్పినట్లే 2005లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లకు గానూ 67 గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. భూపీందర్ హుడా సీఎం అయ్యారు. హుడా ప్రిడిక్షన్స్ నిజం అయ్యాయి. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ తగ్గిపోయింది. కానీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేసింది. అయితే 2024 ఎన్నికల్లో భూపేందర్ హుడా ఎందుకు ప్రజల నాడిని పసిగట్టలేక పోయారో అర్థం కాలేదు. ఇది తప్పకుండా అతి విశ్వాసం వల్ల వచ్చిన ఓటమే అని నేను భావిస్తున్నాను.,,, – ఏజే ఫిలిప్, సీనియర్ జర్నలిస్ట్ ……….. (#భాయ్‌జాన్… జాన్ కోరా)
Share this Article