ఏదైనా సందర్భం వస్తే… ఇతర పత్రికలన్నా ఈనాడు ప్రత్యేక కథనాలు వేయడంలో, అవీ భిన్నమైన కోణాల్లో ప్రజెంట్ చేయడంలో ముందుంటుంది… సెంట్రల్ డెస్క్ రెయిజ్ టు అకేషన్ అంటూ వెంటనే రియాక్టయి వర్క్ చేస్తుంది… మిగతా పత్రికలు ఈ విషయంలో వీక్…
కానీ ఫాఫం ఈనాడు… నిన్న మరణించిన రతన్ టాటాతో ఏమైనా పాత పగలున్నాయో ఏమో అన్నట్టుగా అత్యంత పేలవంగా, నాసిరకంగా కవరేజీ ఉంది… ఫస్ట్ పేజీలో తప్పదు కాబట్టి అన్నట్టుగా ఓ చిన్న డబుల్ కాలమ్ వార్త… లోపల పేజీల్లో మరో చిన్న స్టోరీ… అంతే… తెలుగు పత్రికల్లో ఆంధ్రజ్యోతి కవరేజీ బాగుంది… సాక్షి పర్లేదు… చివరకు నమస్తే తెలంగాణ కూడా సరైన ప్రాధాన్యమిచ్చింది…
చిన్నాచితకా పత్రికలు, సోషల్ మీడియా, టీవీ మీడియా, ఇంగ్లిష్ మీడియా కూడా రతన్ టాటా విశిష్ట జీవితాన్ని పాఠకులకు, ప్రేక్షకులకు తెలియజెప్పాయి… మరి ఈనాడుకే ఎందుకీ నిర్లిప్తతో తెలియదు… విచిత్రం ఏమిటంటే..? ఈనాడు వెబ్‌సైట్‌లో టాటా సంబంధిత వార్తలు బాగానే ఉన్నాయి… ఎటొచ్చీ ఈనాడు పత్రికే వెలతెలాబోయింది… ఏదో తెలియని స్పందనారాహిత్యం ఈనాడును హఠాత్తుగా కమ్మేసినట్టుంది… (ఏపీ ఎడిషన్‌లో మరీ దయనీయమైన కవరేజీ)…
Ads
పోనీ, రతన్ టాటా ఓ ఘనమైన నివాళికి అర్హుడు కాడా..? ఎవరో ఓ పారిశ్రామికవేత్త మరణించాడులే అన్నట్టుగా మొక్కుబడిగా వ్యవహరించింది… రతన్ టాటాది ఓ అరుదైన, ఆదర్శ జీవితం… పరిశ్రమలు, వ్యాపారాలు, కంపెనీలు, విస్తరణ పక్కన బెడితే… అభినందనీయమైన దాతృజీవితం తనది… అంబానీ సామ్రాజ్య విస్తరణ మీద, ఆదానీ సంపాదనల మీద బోలెడు ఆరోపణలు… దోచుకోవడమే తప్ప జనానికి ఇచ్చిందేమీ ఉండదు పెద్దగా…
చివరకు మన తెలుగు మేఘా కంపెనీ ఎక్కడి నుంచి ఎంత వేగంగా, ఏ పద్ధతిలో ఎంతకు ఎదిగిందో చూడండి… కానీ టాటాల మీద ఆరోపణలుండవ్… గమనించండి… చివరకు కరోనా వేక్సిన్ వాటర్ బాటిల్ ధరకు ఇస్తానన్న మన తెలుగు ఎల్లా కృష్ణుడు ఎంత ధర పెట్టి ఎంతగా జనం నుంచి దండుకున్నాడో తెలియదా..? ఈనాడు చుట్టమే కదా…
ఉద్యోగులను ఓన్ చేసుకోవడంలో కూడా ఇండియన్ మెగా కంపెనీల్లో టాటా గ్రూప్ టాప్… ఒక్కసారి గమనించండి, అంబానీ ఇంట పెళ్లికి ఎన్ని వందల కోట్ల ఖర్చు, ఎంత అట్టహాసం… రతన్ టాటా నిరాడంబర వ్యవహారశైలితో ఒక్కసారి పోల్చి చూడండి… బీజేపీని వాడుకుని ఆదానీ సాగించే అరాచకంతో టాటా వ్యాపార నిర్వహణను ఒక్కసారి పోల్చి చూడండి…
వ్యాపారవేత్తలు చాలామంది ఉంటారు… కానీ రతన్ టాటాలు చాలా తక్కువ మంది ఉంటారు… ఒక హెచ్‌సీఎల్ శివ నాడార్, ఒక విప్రో ప్రేమ్‌జీ… ఇలా… చివరకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ఖర్చులను కూడా మాయ చేసే కంపెనీలు బోలెడు… అలాంటిది సొసైటీ నుంచి తీసుకున్న డబ్బును తిరిగి సొసైటీకే ఖర్చు పెట్టే అరుదైన కొందరు వ్యక్తుల్లో, కంపెనీల్లో టాటా టాప్… నాకు తెలిసి రతన్ టాటాను వ్యతిరేకించి, తన మీద బురద జల్లిన పార్టీ గానీ, లీడర్ గానీ లేరు… సర్వామోదయోగ్యుడు… యోగ్యుడు… అనితర పథికుడు… ప్చ్, ఈనాడుకు, ఈనాడు భాగస్వామి అంబానీకి ఎందుకో అంత వైముఖ్యం రతన్ టాటా అంటే..! ఇంత అగౌరవ ప్రదర్శన ఊహించలేదు…
Share this Article