Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బ్రహ్మచారి… పెళ్లి కాలేదు గానీ రతన్ టాటా జీవితంలో ఆడది లేకుండా లేదు..!

October 10, 2024 by M S R

సర్లెండి సారూ… ఆజన్మ బ్రహ్మచారి సరే… రతన్ టాటాకు ఏ అఫెయిర్స్ లేవంటారా..? అసలే అమెరికాలో చదివిన బాపతు… అపారమైన సంపద… అందగాడు… అలా ఎలా వదిలేస్తారు తనను హైప్రొఫెైల్ లేడీస్ అనడిగాడు ఓ మిత్రుడు…

లేదు, మిత్రమా… తనేమీ రిజిడ్ కాదు, పైగా సోకాల్డ్ అమెరికా మోడరన్ కల్చర్‌లో పెరిగినవాడు… తనే చెప్పాడు నాలుగుసార్లు పెళ్లి దాకా వెళ్లి వెనక్కి తగ్గాల్సి వచ్చిందని…! అమెరికాలోని ప్రియురాలితో 1961-62లో పెళ్లి ప్రయత్నం చైనా యుద్ధం కారణంగా వర్కవుట్ కాలేదనీ తనే చెప్పాడు… కానీ ఆ కారణంగానే తను ఇక పెళ్లికి దూరంగా ఉన్నాడా..? కాదు…

తన జీవితంలో ఆడది లేకుండా లేదు… ఏకంగా సినిమా నటి, హైఫై సొసైటీలో పెరిగిన సిమి గరేవాల్‌తో డేటింగ్ కూడా చేశాడు… అది సిమి తనే స్వయంగా 2011లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది… అప్పట్లో ఆమె ఇండియన్ యూత్ దిల్ కా దడ్కన్… రతన్ టాటా కూడా ఆ ఆకర్షణలో పడిపోయి, ఆమెకు చేరువయ్యాడు… ఆమెకు ఇప్పుడు 76 ఏళ్లు… రతన్ టాటా మరణవార్త వినగానే హృదయవేదనతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది…

Ads

‘నువ్వు వెళ్లిపోెయావని అంటున్నారు అందరూ… ఈ నష్టాన్ని వినడానికే భారంగా ఉంది… వీడ్కోలు మిత్రమా’… అంతే… సింపుల్‌గానే చెప్పినా తన వేదనను వ్యక్తీకరించింది… రతన్ టాటాకు మహిళాసాంగత్యం లేదని కాదు… సిమి గరేవాల్‌ గురించి చెప్పనక్కర్లేదు… ఓ ఆర్మీ బ్రిగేడియర్ బిడ్డ ఆమె… బ్రిటన్‌లో చదువుకుంది… అప్పట్లో కొన్ని సినిమాల్లో అర్ధనగ్నంగా నటించిన తీరు మీద బోలెడన్ని విమర్శలు…

జామ్‌నగర్ మహారాజా‌తో కొన్నేళ్లు… తరువాత రవి మోహన్‌తో కొన్నేళ్లు… ఆ తరువాత రతన్ టాటాతో సంబంధం… అంతేనా..? క్రికెటర్ పటౌడీ, రాజకపూర్, పాకిస్థానీ వ్యాపారి సల్మాన్ తసీర్… వీరిలో రవి మోహన్‌తోనే పెళ్లి, తరువాత విడాకులు… ఆమె సినిమా నటి మాత్రమే కాదు, సినిమా నిర్మాత, దర్శకురాలు, టీవీ ప్రజెంటర్… అన్నీ…

అమెరికా ప్రియురాలు… సిమి గరేవాల్… మరి మిగతా ఆ ఇద్దరు ఎవరు..? రహస్యం… తనెప్పుడూ తన వ్యక్తిగత జీవితం మీద ఏ మీడియాతోనూ మాట్లాడలేదు… గాసిప్స్, రూమర్స్‌లోకి వచ్చేవాడు కాదు… తను తన వ్యాపార ప్రపంచం… బయటికి తెలియకుండా తన వ్యక్తిగత జీవితం… అంతే…

తనకు కార్లంటే ఇష్టం… అంతేకాదు, లైసెన్స్‌డ్ పైలట్… 69 ఏళ్ల వయస్సులో ఎఫ్-18 ఫైటర్ జెట్ కూడా నడిపించాడు… అస్తవ్యస్త విధానాలతో భ్రష్టుపట్టించబడిన టాటా ఎయిర్‌లైన్స్‌ను టేకోవర్ చేశాడు… విమానాలంటే తనకు అంత ఇష్టం… నిజానికి మొదట్లో ఆ సంస్థ టాటాలదే… అమితాబ్ హీరోగా ఓ సినిమాకు తన సహనిర్మాత కూడా… అఫ్‌కోర్స్, అదొక డిజాస్టర్… తరువాత ఇక సినిమాల్లో చేతులు పెట్టలేదు, కాల్చుకోలేదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions