.
ఇంగ్లీషునే దేశ వ్యాప్తంగా అఫీషియల్‌గా ఉపయోగించాల్సిన అవసరం ఎందుకుందో.. ఇలాంటి బోర్డులే నిరూపిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ‘బేటీ బచావో బేటీ పడావో’ అనే స్కీమ్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ నెల ఆయా ప్రాంతంలో జన్మించిన బాలబాలికల జనాభాను తెలియజేస్తూ.. బోర్డుల మీద ప్రదర్శిస్తున్నారు.
ఇలా బాలబాలికల జనన రేటును జిల్లా స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు డిస్‌ప్లే చేస్తున్నారు. 2015లో తొలిసారి మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఇలాంటి వివరాలను స్థానిక అధికారులు ప్రజలకు ప్రదర్శించారు. బాలబాలికల జనన సంఖ్యని ప్రదర్శించే బోర్డును స్థానిక భాషలో ‘గుడీ గుడా బోర్డ్’ అంటూ రాశారు. ఈ విధానం నచ్చడంతో.. దేశమంతా ‘Guddi Gudda’ బోర్డు విధానాన్ని అమలు చేయాలని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ, ఆరోగ్య శాఖలు ఆదేశాలు జారీ చేశాయి.
Ads
ఇంకేముంది.. దేశమంతా Guddi Gudda పేరుతో అధికారులు బోర్డులు పెట్టేశారు. అది మన తెలుగు భాషలో బూతు టైప్‌లో ధ్వనిస్తోంది. బాలబాలికల జనన వివరాలు అని రాశారు. కానీ ఆ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన పేరునే కొనసాగిస్తున్నారు.
అయ్యా.. మోడీజీ.. విభిన్న భాషలు ఉన్న ఈ దేశంలో ఏదో ఒక భాషను దేశమంతా రుద్దితే ఇలాగే ఉంటది. అందుకే అందరికీ హాయిగా ఉండే ఇంగ్లీషు భాషలో బోర్డులు రాయించండి. ఇది హిందీ, ఇతర భాషలపై ద్వేషం కాదు. ఇలా Guddi Gudda తప్పులు జరగొద్దనే బాధ. అంతే..
PS : ఇవిగో కేంద్రం ఇచ్చిన ఆదేశాలు చూడొచ్చు……. జాన్ కోరా
Share this Article