ముఖ్యమంత్రికి ఓ ఓటర్ విజ్ఞప్తితో కూడిన హెచ్చరికను జారీ చేశాడు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాయలసీమలో
చోటుచేసుకున్న ఒకింత ఆశ్చర్యపర్చి… కాస్సేపు హహ్హా అని నవ్వుకునేలా చేసే ఓ పరిణామమది. అవునూ… నిబంధనల ప్రకారం ఓటర్ పేరు బయటకు చెప్పరేమోగానీ… పోలింగ్ రోజు ఫలితాలు వెలువడే క్రమంలో పోలింగ్ సిబ్బంది మాత్రం బ్యాలెట్ బాక్సులో కనిపించిన ఆ స్లిప్పులను చూసి ఆశ్చర్యంతో నవ్వుకుంటూ… ఆ నవ్వుల్లోనే ఫలితాల లెక్కింపును అలసట తెలియకుండా ముగించేశారట.
ఇంతకీ సదరు ఓటర్ ఏం రాశాడు… అదెక్కడా అనేగా..? కర్నూల్ జిల్లా నంద్యాల్లో మున్సిపోల్స్ ఫలితాల వెల్లడింపు సందర్భంగా .. అందులో కొన్ని స్లిప్పులు కనిపించాయట. ” మద్యం అమ్మకాల్లో కొత్త బ్రాండ్లైన సుప్రీం, దారు, హైదరాబాద్, జంబో వంటివాటిని తొలగించి… పాత బ్రాండ్లైన రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్ రకాలను అందుబాటులోకి తెచ్చి అమ్మకాలు చేపట్టాలన్నది ముఖ్యమంత్రి జగన్ ను అడ్రస్ చేస్తూ రాసిన విజ్ఞప్తి” అయితే అక్కడితో ఆగకుండా సదరు ఓటర్.. ఒకవేళ పాత బ్రాండ్లు అమ్మకపోతేగనుక ఇదే తమ చివరి ఓటని కూడా హెచ్చరించాడట.
Ads
ఇప్పుడీ తాగుబోతుల సంఘం విన్నపంతో కూడిన హెచ్చరిక సోషల్ మీడియాలో తెగ ట్రోలవుతోంది. మీలో గొప్ప తాగుబోతును చూస్తున్నాం సారంటూ.. సినిమా పోస్టర్స్ ను యాడ్ చేసి సెల్యూట్ కొట్టే ఫోటోలతో పాటు… ముఖ్యమంత్రి జగన్ ను అడ్రస్ చేస్తూ రాసిన తాగుబోతుని నీది తాగుబోతుల్లో ఛత్రపతంటి స్థాయంటూ సెటైరికల్ పొగడ్తలతో సోషల్ మీడియా ఓ ఆటాడుకుంటోంది. మొత్తమ్మీద సదరు తాగుబోతు ఓటర్ ఎవరికోటేశాడో అది రహస్యమేగానీ… ముఖ్యమంత్రికి మాత్రం సూటిగా తన సందేశాన్ని చెప్పి.. తమకు నచ్చిన బ్రాండ్లు, నచ్చని బ్రాండ్ల జాబితాతో సోషల్ మీడియాక తెగ పబ్లిసిటీ అయితే కొట్టేశాడు. చూశారా మద్యాన్ని ప్రియులకు అందుబాటులో ఉంచడమే కాదు… వాళ్లకిష్టమైన బ్రాండ్లేవో తెలుసుకుని వాటినే అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే మరి! ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డికెదురైన అనుభవం మీకూ కాకూడదనుకుంటే… మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులూ.. మరి పారాహుషార్!… మందుబాబుల మనోభావాలకు భిన్నంగా వెళ్లిన పార్టీ బాగుపడినట్టు చరిత్రలో లేదు మరి.. !!…………… By….రమణ కొంటికర్ల
Share this Article