చంద్రబాబు అద్భుత సమర్థ పాలనను విశ్లేషించేంత జ్ఞానం మనకు లేకపోవచ్చుగాక… కానీ చెప్పేవి వేరు, చేసేవి వేరు… మద్యం విషయమే తీసుకుందాం… జగన్ మీద విమర్శ ఏమిటి..?
తనకు డబ్బు సంపాదించి పెట్టే అడ్డమైన రంగు సారా బ్రాండ్లకు మాత్రమే పర్మిషన్లు ఇచ్చి, పాపులర్ బ్రాండ్లను రానివ్వకుండా చేసి, ప్రజల కాలేయాలతో ఆడుకున్నాడు, ఆ రంగు సారాకు కూడా అడ్డగోలు రేట్లు పెట్టి, అడ్డగోలుగా సంపాదించాడు…ఇదే కదా విమర్శ… పలు సభల్లో చంద్రబాబు కూడా విమర్శలు చేశాడు కదా…
మొన్నటి నుంచీ రాస్తున్నారు, కూస్తున్నారు కొందరు… జస్ట్, 99 రూపాయలకే క్వార్టర్… అన్ని పాపులర్ బ్రాండ్లకూ పర్మిషన్ అని… సరే, జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపు పెట్టి ఓ తప్పు చేశాడు… నిజానికి జగన్ పాలనలో మద్యం వ్యాపారం చాలా పెద్ద స్కామ్… కానీ చంద్రబాబు చేస్తున్నదేమిటి..?
Ads
ఎస్, ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి, ప్రైవేటు షాపులకు దరఖాస్తులు పిలిచాడు… ఆ దరఖాస్తు ఫీజే దాదాపు 1700 కోట్లు వచ్చినట్టు ఎక్కడో చదివినట్టు గుర్తు… ప్రైవేటు షాపులు కాబట్టి బెల్టు షాపులూ వస్తాయి, అమ్మకాలు పెరుగుతాయి… ఇబ్బడిముబ్బడిగా ఖజానాకు ఆదాయం కూడా పెరుగుతుంది… అవన్నీ వోకే… కానీ రేట్లు ఏమైనా తక్కువా..? ఊరూపేరూ తెలియని అడ్డమైన బ్రాండ్లకు పర్మిషన్ ఇవ్వడం లేదా..?
99 రూపాయలు కాదు… అప్రూవ్డ్ ఎంఆర్పీ రేట్ల జాబితా ఒకటి వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో కనిపించింది… మినిమం రేటు 120… అవీ ఎలాంటి చీప్ లిక్కర్ బ్రాండ్లో తెలుసా..? ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ అట… చివరకు చౌక ధరలకు దొరికే బ్రీజర్లు కూడా 130 రూపాయలు… బ్లాండే సమ్మర్ స్మాల్ బీర్ ధర 120 రూపాయలు… కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్ ధర హైదరాబాదులో గరిష్టంగా రిటెయిల్‌లో 160, 170… కానీ ఏపీలో ప్రస్తుత రేటు 200 220…
వైట్ హాల్ బ్రాండీ అట… హానీ బీ అట… 150 రూపాయలు… పేర్లు విన్నారా ఎప్పుడైనా..? మా అభిమాన హీరోకు ఇష్టమైన మాన్షన్ హౌజ్ క్వార్టర్ బ్రాందీ ధర మినిమం 220 రూపాయలు… హైదరాబాదులో 170 రూపాయలు… బ్లూ రిజర్వ్, ఓషియన్ బ్లూ, సిల్వర్ స్ట్రయిప్స్, రిజర్వ్ క్లాసిక్, నేవీ క్లబ్ బ్లూ, సీహార్స్, రాయల్ సింహా…. ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా..? జగన్ తెచ్చిన బ్రాండ్లేనా ఈ విస్కీ… 130 నుంచి 150 రూపాయలకు క్వార్టర్ అట ఇప్పుడు ఎమ్మార్పీ…
జాబితాలో చాలా పాపులర్ బ్రాండ్ల పేర్లు లేనే లేవు… తలిస్కర్ సింగిల్ మాల్ట్ 10 ఇయర్స్ స్కాచ్ ధర ఫుల్ బాటిల్ 7900 రూపాయలు అట… అదే గరిష్ట ధర బ్రాండ్ ఆ జాబితాలో… ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ… జగన్, చంద్రబాబు సేమ్ సేమ్… మందు బాబులూ బహుపరాక్… దొందూ దొందే…!!
Share this Article