Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సార్… పేపర్ వేయించుకొండి… చౌకగా ఏడాది ప్యాకేజీ, పైగా ఈ ప్రెషర్ కుక్కర్ ఫ్రీ…

October 18, 2024 by M S R

సేటూ… కొన్ని కిరాణా ఐటమ్స్ చెప్పుతా, జెర జల్దీ ఇచ్చెయ్ అని పురమాయించి, అక్కడే నిలబడ్డాను… మధ్యాహ్నం, చిన్న షాపు… వేరే ఎవరూ గిరాకీ లేరు… షాపు గుమస్తా సరుకులు ఒక్కొక్కటీ ప్యాక్ చేస్తున్నాడు… ఒకాయన వచ్చాడు… మెడలో సాక్షి ఐడీ కార్డు వేలాడుతోంది… డిజిగ్నేషన్ అని ఏదో కనిపిస్తోంది, కానీ అర్థం కాలేదు…

సేటూ… మళ్లీ ఇటువంటి ఆఫర్ రాదు, పేపర్ వేయించుకో… ఇవిగో ఈ కుక్కర్లు ఫ్రీ ఇస్తున్నాం… రెండు కుక్కర్లు వెంట తెచ్చాడు…

అసలే ఖర్చులు పెరిగినయ్, ఆమ్దానీ తగ్గిపోయింది… పేపర్ వేయించుకుంటే అదో ఖర్చు, వద్దులే బ్రదర్… తరువాత చూద్దాం…

Ads

కాదు సేటూ… జస్ట్, 1250 కడితే చాలు… ఏడాదంతా పేపర్ వేస్తాం… ఈ కుక్కర్ ఫ్రీ… సరిగ్గా లెక్క చేస్తే నెలకు 50, 60 రూపాయలు, అంతే…

అది కరెక్టే గానీ… ఇంట్లో కుక్కర్లున్నయ్, ఇది తీసుకుని ఏం చేసుకోవాలి..? ఐనా టీవీల వార్తలు చూస్తే చాలు నాకు, వాట్సపు గ్రూపుల్లో వార్తలు వద్దన్నా వార్తలు వస్తూనే ఉంటయ్… పేపర్లలో అంతకుమించి చదివేది ఏముంటది..? వద్దులే బ్రదర్… పొద్దున్నే మీదే ఈ-పేపర్ చదువుతుంటా…

చూడు సేటూ… నెల కాగానే రద్దీ పేపర్ అమ్ముకున్నా నీ పైసలు నీకొస్తయ్, అంటే పుణ్యానికి ఇంట్లో పేపర్ పడుతున్నట్టే కదా… ఈ-పేపర్ చదివితే అసలు పేపర్ చదివిన ఫీలింగ్ వస్తదా చెప్పు..?

మరీ ఇంత ఉదారమైన స్కీమ్ పెట్టారేమిటి బ్రదర్ అనడిగాను నోరు జారి… చప్పున నావైపు చూశాడు… ‘కాదు కాకా, కాపీలు పెంచాలి, స్కీమ్స్ పెట్టకపోతే ఎవరు కొంటారు..?’ అన్నాడు…

అదేమిటి..? మీ సారుకేం తక్కువ..? మీ పేపరుకేం తక్కువ..? నంబర్ టు పేపర్ అంటుంటారు కదా… ఈ స్కీమ్స్ అవసరం ఏముంది..?

మా సారు ఓడిపోయిండు కదా… జెర కష్టమే ఉంది… కాపీలు పెంచాలని మాకు టార్గెట్లు పెట్టారు…

ఊరుకో బ్రదర్… మీ సారు ఓడిపోయిండు అంటేనే జనంలో వ్యతిరేకత ఉన్నట్టు కదా… ఆ ప్రభావం మీ పేపర్ సర్క్యులేషన్ మీద కూడా పడుతుంది కదా… సహజం… మొన్నటిదాకా ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా అమ్మకాలు తగ్గి ఉంటాయి కదా… ఐనా ఏపీలో కష్టకాలం అనుకుందాం, మరి తెలంగాణలో పేపర్‌కు ఈ బ్యాడ్ పీరియడ్ ఏమిటి..? ఐనా ఆయన కష్టాలకూ, ఈ కాపీలు పెంచడానికీ లింకేముంది..? కాపీలు పెరిగితే ఆయన కష్టాలు తీరతాయా..? ఇదేం ప్రచారం..?

ఆయన నావైపు సాలోచనగా కాసేపు చూశాడు… ఓడిపోయిన డిప్రెషన్ కదా, పేపర్ మీద దృష్టి తగ్గింది, డౌన్ అయిపోయిండు కదా, కాపీలు పెరిగితే బెటర్ కదా… అందుకేనేమో ఈ స్కీమ్స్ అన్నాడు మెల్లిగా…

ఇదే తప్పు బ్రదర్… తెలంగాణలో కూడా మీ పార్టీ స్టాండ్ ప్రొ-కేసీయర్, ఎందుకంటే జగన్‌తో దోస్తీ కాబట్టి… కేసీయార్ మీద కూడా వ్యతిరేకత ఉంది కాబట్టే మొన్న ఓడిపోయిండు, ఆ ప్రభావం మీ మీద కూడా పడుతుంది… సింపుల్… అక్కడా ఇక్కడా జనంలో వ్యతిరేకత ఉన్నవాళ్లకే మీ పేపర్ సపోర్ట్… అందుకే సర్క్యులేషన్ మీద ఇంపాక్ట్… ఐనా జనం డిజిటల్ వైపు వెళ్తుంటే, పెద్ద పెద్ద జాతీయ పత్రికలే ప్రింటింగ్ తగ్గించుకుంటుంటే మీకెందుకు ఈ ఖర్చు పెంచుకునే తిప్పలు..?

ఏమో, సర్క్యులేషన్‌ను బట్టే యాడ్స్, యాడ్స్‌ను బట్టే ఆదాయం కదా… ఏపీలో సర్కారు యాడ్స్ ఇవ్వరు… అంతా అయోమయం, గందరగోళం… ఇవన్నీ చెబుతున్నారు, ఏం చేస్తుంటారు అనడిగాడు… ఈలోపు షాపు గుమస్తా ‘సార్, ఇదుగో మీ సరుకుల పార్శిల్’ అంటూ వచ్చాడు… హమ్మయ్య, నెలాఖరుకు ఖాతా క్లియర్ చేస్తా, వస్తా అని బయటపడ్డాను…

ఏపీలో సాక్షి కాపీల కోసం వాలంటీర్లకు డబ్బులు ఇచ్చేవాళ్లు కదా, దాన్ని చంద్రబాబు రద్దు చేశాడు… ఇక ఈనాడు ఏపీలో కాపీలు ఇంకా పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జిల్లాలు తిరుగుతూ ఎక్కువ సర్క్యులేషన్ కోసం ప్రయత్నిస్తున్నాడు… మిగతా పత్రికలు పెద్దగా లెక్కలోకి రావు…

కొన్ని నామ్‌కేవాస్తే ప్రింట్ చేస్తున్నాయి… ఏదో గవర్నమెంట్ యాడ్స్ కోసం ఎక్కువ ప్రింట్ ఆర్డర్, సర్క్యులేషన్ చూపించుకుంటున్నాయి… ఐనా ఇప్పుడన్నీ వాట్సప్ ఎడిషన్లదే కదా హవా… అనుకుంటూ బండి స్టార్ట్ చేశాను… ఆయన చూపించిన కుక్కర్ బ్రాండ్ ఏమిటో, నాణ్యత ఏమిటో తెలియదు గానీ… కర్రీలీఫ్ అని ప్రముఖంగా కనిపిస్తోంది పేరు… అంటే కరివేపాకు… పేరు బాగుంది, ఈ కాపీల పెంపు ప్రయత్నాలకు, ఈ కరివేపాకు పేరుకూ ఏదో శృతి కుదురుతున్నట్టే ఉంది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాళేశ్వరం గంతలు… హరీష్‌రావు వృథా ప్రయాస..! ఇవీ నిజాలు..!!
  • …. కోటి రూపాయలకు ఓ కింగ్ ఫిషర్ విమానం కొని ఈ హోటల్ పెట్టాను
  • ఈరోజు నచ్చిన వార్త… అర్ధరాత్రివేళ మన వ్యోమవీరుడికి ఘనస్వాగతం…
  • నేల మీదే నడుద్దాం… పడే ప్రమాదముండదు… ఓ డైరెక్టర్ విలువైన మాట…
  • భగవాన్ శ్రీరాం సర్..! విశ్వాసులకు దేవుడే… అంతగా ప్రభావితం చేస్తారు..!!
  • పూప్ సూట్‌కేస్..! పుతిన్ పర్యటనల్లో కనిపించే ఈ భద్రత కథేమిటి..?!
  • మంచి సోర్స్, గైడ్, అప్‌‌డేషన్, క్రాస్‌చెక్… ఆ బ్యూరో చీఫ్‌ల రోజులే వేరు…
  • లేడీ విలన్…! అతిరథుల్ని దాటేసిన ఆమె నటనకు అంతటా చప్పట్లు…!
  • అప్పట్లోనే ఇది ఓ మహా బాహుబలి..! అందుకే తను సూపర్‌స్టార్..!!
  • సరోగేట్ ప్రమోషన్..! ఇది సరైన పద్ధతి కాదు మిస్టర్ జగపతిబాబూ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions