తిరుమల లడ్డూలో జంతుకొవ్వు నూనెల కల్తీ నెయ్యి ఆనవాళ్లు బయటపడటంతో దేశవ్యాప్తంగా గుళ్లల్లో ప్రసాదాలపై భక్తుల్లో సందేహాలు మొదలయ్యాయి… భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆయా రాష్ట్రాలు వెంటనే చర్యలు ప్రారంభించాయి కూడా…
పలు రాష్ట్రాలు తమ గుళ్లలో ప్రసాదం తయారీకి రాష్ట్ర సహకార సంస్థల బ్రాండ్లనే వాడాలని ఆదేశించాయి… తెలంగాణలో కూడా విజయ డెయిరీ నెయ్యినే వాడాలని ఆదేశించారు… ఎందుకైనా మంచిదని కల్తీ పరీక్షలు కూడా చేయించారు… ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లడ్డూల్ని కూడా పరీక్షలకు పంపించి, నాణ్యమైన సరుకులే వాడినట్టు నిర్ధారణ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు…
ఇలా ప్రతి దేవస్థానం భక్తుల్లో నమ్మకాన్ని పెంచే చర్యలకు పూనుకుంటోంది, గుడ్… కానీ ఒకవైపు ఇంత రచ్చ జరుగుతుంటే… కేవలం నెయ్యి, లడ్డూల పరీక్షలే కాదు… ఇతరత్రా ప్రసాదాల్లో వినియోగించే ప్రతి దినుసులకూ నాణ్యత పరీక్షలు, కట్టుదిట్టాలు అవసరమని మరిచిపోతున్నారు… ఎందుకంటే, నెయ్యి మాత్రమే కాదు కదా… శెనగపిండి మొదలు బోలెడు… నిజానికి వాటి కల్తీ నిగ్గుతేల్చడానికి కూడా పరీక్షలు, జాగ్రత్తలు అవసరం…
Ads
ఒకవైపు ఇంత రచ్చ జరుగుతుంటే… ఆంధ్రజ్యోతిలో ఓ వార్త కనిపించింది… అదేమిటీ అంటే… అన్నవరం దేవస్థానం నైవేద్యానికి వాడే బెల్లాన్ని పరీక్ష చేయిస్తే… అదీ ఆహార కల్తీ నిరోధక శాఖ ద్వారా చేయిస్తే… ఆ బెల్లం కూడా కల్తీ బెల్లమే అని తేలిందట… పంచదార కలుపుతున్నారు సప్లయర్స్… మాకేమవుతుందిలే అనే బరితెగింపేమో… అంతకుముందు సేమ్ తిరుమలలోలాగే వైసీపీ హయాంలో లోకల్ రైతు డెయిరీ నుంచి నెయ్యి సప్లయ్ జరిగేదట… పత్రికల్లో వార్తలు రావడంతో ఆ కంట్రాక్టు రద్దు చేశారట…
కానీ నెయ్యి మాత్రమే కాదు… రకరకాల ప్రసాదాలు ఉంటాయి గుళ్లల్లో… అన్నీ పరీక్షలు చేయించాలి… ఇప్పుడు అన్నవరంలో కల్తీ బెల్లం బయటపడింది… ఇలా ఎన్నిరకాల దినుసుల్లో ఎన్ని కల్తీలో… హిందూ భక్తులు అంటే దేవాదాయశాఖకు, పాలకవర్గాల్లో అక్రమార్కులకు నిత్యం పండుగే… అసలు నైవేద్యాలన్నీ వాళ్లకే…
అసలు తిరుమలలోనే కల్తీని నిర్ధారించే ప్రయోగశాలకు దిక్కులేదు… ఇక ఇతర దేవస్థానాలు సొంతంగా ప్రయోగశాలల్ని ఎలా మెయింటెయిన్ చేయగలవు..? సో, ప్రైవేటు లేబరేటరీల్లో పరీక్షలే దిక్కు… కానీ వాటినీ నమ్మలేం… సప్లయర్స్ ఎవరినైనా మేనేజ్ చేయగలరు… అందుకని దేవాదాయ శాఖలు ఈ పరీక్షల్లో కట్టుదిట్టాల కోసం ఓ విధానాన్ని రచించాలి…
మిమ్మల్ని, మీ శాఖను పోషించేదే హిందూ భక్తుల సొమ్ములతో… కనీసం వారి మనోభావాల్ని గౌరవించండి… దేవుళ్లకు పెట్టే నైవేద్యాలు, ప్రసాదాలనైనా పవిత్రంగా, స్వచ్ఛంగా ఉంచండి… అదే మీరు తినే తిండికి సార్థకత…!!
Share this Article