మణిరత్నం… తన పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చేది తక్కువే… మాట్లాడేదీ తక్కువే… వార్తల తెరపైనా తక్కువగా కనిపిస్తుంటాడు… తన పనేదో తనది… సినిమా ఇండస్ట్రీలో ఒకరికొకరు పొగుడుకోవడమూ ఎక్కువే… కానీ ఆయన ఎవరినీ పెద్దగా అభినందించడు, ప్రశంసించడు…
తన కెరీర్‌లో చాలామంది మంచి ప్రతిభ ఉన్న నటీనటులను చూశాడు, పనిచేయించుకున్నాడు… ఎవరి నటనను ఏ పాత్రకు ఎలా పిండుకోవాలో తనకు బాగా తెలుసు… అందుకే తను ఏకంగా నటి సాయిపల్లవికి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకోవడం ద్వారా అందరినీ ఆశ్చర్యంలో ముంచేశాడు…
ఆమె మణిరత్నంతో ఎప్పుడూ పనిచేయలేదు… ఆమెకు పేరు తెచ్చినవి ఎక్కువగా తెలుగు సినిమాలే గానీ తమిళ సినిమాలు కావు… ఏవో కొన్ని సాదాసీదా రౌడీ బేబీ వంటి పాత్రలు తప్ప తమిళంలో ఆమెకు బాగా నటించడానికి మంచి పాత్రలు కూడా ఏమీ దొరకలేదు…
Ads
మరి ఏ సినిమాలో ఆమె నటన చూసి ఆయన ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాడో వివరించలేదు గానీ… నీతో కలిసి తప్పకుండా పనిచేస్తా, చేయాలని ఆశిస్తున్నా అని చెప్పడం ద్వారా ఆయన సాయిపల్లవి అతి పెద్ద సర్టిఫికెట్ ఇచ్చేశాడు… ఆమెకు అది చాలా పెద్ద సర్టిఫికేటే నో డౌట్…
ఆయన మాటలు కూడా పెద్ద కృతకంగా ఏమీ అనిపించలేదు… ఇండస్ట్రీకి అలవాటైన రొటీన్ మొక్కుబడి హిపోక్రటిక్ స్టేట్‌మెంట్‌లాగా కూడా అనిపించలేదు… మరెందుకు ఆయన ఆమె పట్ల అంత అడ్మిరేషన్..? ఏం స్పెషాలిటీని గమనించాడు తనను, ఏ సినిమాలో..?
అమరన్ అని ఓ సినిమా వస్తోంది కదా… అందులో శివకార్తికేయన్ హీరో… జమ్ము కశ్మీర్‌లో చావుకు ఎదురేగి మరీ ఉగ్రవాద నేతల్ని మట్టుబెట్టిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోగ్రాఫికల్ మూవీ అది… మరణం తరువాత ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన అశోక చక్ర ఇచ్చింది ప్రభుత్వం…
ఆ ముకుంద్ భార్య పేరు ఇందు రెబెకా వర్ఘీస్… ఆమె పాత్రను సాయిపల్లవి పోషిస్తోంది… ఈ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో మణిరత్నం సాయిపల్లవిని ప్రశంసల్లో ముంచెత్తగా… ఒక్కో మెట్టు ఎక్కుతూ శివకార్తికేయన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడని కూడా అభినందించాడు…
అదే ఫంక్షన్‌లో శివకార్తికేయన్ కూడా సాయిపల్లవి తనను అన్నా అని పిలిచిన ఓ సందర్భాన్ని గుర్తుచేసుకుని, అప్పుడు బాధపడ్డానని సరదాగా వ్యాఖ్యానిస్తూనే… తను కూడా ప్రేమమ్ చూసి ఆమెకు అభిమానిని అయ్యానని వెల్లడించాడు… వరుసగా తన సినిమాలన్నీ ఫెయిలవుతూ, గార్గి తరువాత కొన్నాళ్లు ఆమె మాయమైపోయింది…
సినిమాలు మానేస్తుందనీ, హాస్పిటల్ కట్టుకుని డాక్టర్‌గా సేవ చేస్తుందనే వార్తలు వచ్చాయి… కానీ హఠాత్తుగా వరుసగా పెద్ద సినిమాలు వచ్చిపడ్డయ్ ఆమె లిస్టులోకి… హిందీ రామాయణం ప్రిస్టేజియస్ ప్రాజెక్టు… ఇంకేదో హిందీ సినిమా కూడా చేస్తోంది… తెలుగులో చైతూతో తండేల్… తమిళంలో ఈ అమరన్… ఆమెకు ఇంతమంది ప్రముఖులు అభిమానులున్నారు, ప్రేమిస్తున్నారు కదా… ఇన్నేళ్లలో ఒకే ఒక తెలుగు హీరో మాత్రమే ఆమె గురించి ఆరేళ్ల క్రితం నెగెటివ్ వ్యాఖ్యలు చేశాడు… ఆ సినిమా పేరు, ఆ హీరో పేరు గుర్తున్నాయా..?!
Share this Article