ఓ వార్త… గూగుల్‌లో సెర్చ్ చేస్తే… బిగ్‌బాస్8 తెలుగు సీజన్ విజేత ప్రేరణ అని కనిపిస్తోందనే ఆ వార్త సారాంశం… హవ్వ, ప్రేరణ విజేత కావడం ఏమిటమ్మా, పైగా లేడీ కంటెస్టెంట్ గెలవడం ఏమిటో అని బుగ్గలు బాగా నొక్కుకుని మరీ హాశ్చర్యపోతున్నారట నెటిజనం… తనెవరో రాసుకొచ్చారు… నవ్వొచ్చింది…
అది బిగ్‌బాస్ అట… ఎవరైనా గెలవొచ్చు… ప్రేరణకు ఏం తక్కువ..? గతంలో గెలిచిన పల్లవి ప్రశాంత్‌కన్నా చాలా నయం కదా… నిజానికి ప్రస్తుత సీజన్‌లో సోకాల్డ్ కన్నడ బ్యాచ్ మాత్రమే బాగా ఆడుతోంది… ఆ పృథ్వి మినహా…! యష్మి ఏవేవో వ్యూహాలు రచిస్తోంది గానీ నెగెటివిటీ పెరుగుతోంది ఆమె మీద… విష్ణుప్రియ నాగార్జునకు ఇష్టురాలేమో గానీ ఆమెకు గెలిచేంత సీన్ లేదు, ఆ మెచ్యూరిటీ కూడా కనిపించడం లేదు, నత్తి బుర్ర…
వైల్డ్ కార్డ్ ఎంట్రీలు విజేతలు కావద్దని ఏమీ లేదు… కానీ ఆల్రెడీ ఉన్నవాళ్లకు వీళ్లు జతకూడి, కప్పు ఎగరేసుకుపోతే, అది అనైతికం… ఐనా, బిగ్‌బాస్‌లో నైతికం, అనైతికం ఏముంది లెండి… సరే, వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఎలాగూ మెహబూబ్ ఆట బాగాలేదు, కండబలం ఉంది గానీ మైండ్ పవర్ చూపించడం లేదు… గౌతమ్ కృష్ణ ఎలాగూ మెంటల్ కేసే… గంగవ్వను వదిలేయండి… రోహిణి, అవినాష్, టేస్టీతేజ బాగానే ఎంటర్‌టెయిన్ చేయగలుగుతున్నారు, అవినాష్ బలంగానే ఇతర టాస్కుల్లో పోటీపడుతున్నాడు గానీ…
Ads
ఆల్రెడీ హౌజులో పాతబడిన వాళ్లలో నిఖిల్ బలంగా కనిపిస్తున్నాడు… నబీల్ ఎందుకో పోటీలో వెనకబడ్డాడు గానీ… ఈరోజుకూ నిఖిల్ స్ట్రాటజీపరంగా స్ట్రాంగ్… తను దోస్తుల్లేరు, ప్రత్యర్థుల్లేరు… ఆట, ఫన్, వినోదం, టాస్క్ ఏదయినా సరే, తన మార్క్ చూపిస్తున్నాడు… ప్రత్యేకించి కండబలం, బుద్దిబలం రెండూ చూపించాల్సిన టాస్కుల్లో రెచ్చిపోతున్నాడు… ఇతర కంటెస్టెంట్లు పలుసార్లు నిశ్చేష్టులవుతున్నారు…
అబ్బే, నిఖిల్ కన్నింగ్ అంటున్నారు గానీ… ఆ ఆటకు కావల్సింది అదే… హౌజులో గెలవడానికే రావాలి… ఆడాలి… ఎలా గెలిచారని కాదు, గెలిచారా లేదానేదే ముఖ్యం అక్కడ… బిగ్‌బాస్ లెక్కల్లో గెలిచినవాడే తోపు… నిఖిల్‌కు అర్థమైంది అదే, ఆడుతున్నదీ అలాగే… ప్రత్యేకించి దైహికబలం చూపించే టాస్కుల్లో మెహబూబ్, గౌతమ్, నబీల్, అవినాష్ తదితరులు నిఖిల్ ఎదుట నిలబడలేకపోతున్నారు… మొన్నోసారి ఎవరినో సోఫా మీదకు నెట్టేశాడు ఆటలో నిఖిల్…
ఈరోజు కూడా ఇద్దరు కంటెస్టెంట్లను తోస్తే స్విమ్మింగ్ పూల్‌లో పడ్డారు… తను కూడా… ఆ దూకుడుకు పోటీదారులు చేష్టలుడిగిపోయారు… ఎవరినో కాళ్ల మధ్య ఇరికించుకుని తోసుకొస్తున్న మెహబూబ్ కూడా నిఖిల్ స్పీడ్ ముందు వెలవెలపోయాడు… అవినాష్, టేస్టీ తేజ బావురుమనడమే తక్కువ… సరే, ప్రేరణ దగ్గరకే వద్దాం…
నిఖిల్‌ను దాటేసి వోట్లు పడుతున్నాయి ఆమెకు… పృథ్వి పదే పదే ఆమెను టార్గెట్ చేస్తున్నాడు… నయనిపావని తోడు… కూల్‌గా, సైలెంటుగా తన ఆట తను ఆడుతోంది… ఎస్, నిజంగానే ఆమె విజేత అయితే మాత్రం… ఏమీ ఆశ్చర్యపడనక్కర్లేదు… కన్నడ కస్తూరి అయితేనేం… లేడీ కంటెస్టెంట్ అయితేనేం… తొలి మహిళా విజేత అవుతుంది… గుడ్… అభినందనీయమే… ఓ దశ వస్తే తోటి కన్నడిగుడిగా నిఖిల్ కూడా చప్పట్లు కొడతాడు…
ఏదో ఆటలో అన్నట్టు… గెలుస్తారా ఓడుతారా అనేది వేరు… గెలిచేందుకు ఎంత కసిగా, ఎంత కమిటెడ్‌గా ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నారనేదే ముఖ్యం… వచ్చిన అవకాశాల్ని ఎలా వాడుకుంటున్నారనేది ప్రధానం… ఒక్క పిసరు అదృష్టం ఎవరి వైపు ఉంటే వాళ్లు విజేతలు… అంతే తేడా…!! ఇదుగో తాజా వోట్ల సరళి…
Share this Article