ఈసారి బిగ్‌బాస్ లిమిట్లెస్ ట్విస్టులు, ఫన్ అని నాగార్జున అంటున్నప్పుడే డౌటొచ్చింది… ఈసారి పిచ్చెక్కిస్తాం అంటుంటే… మరీ నిజంగా పిచ్చోళ్లను సెలెక్ట్ చేయడం, పిచ్చిపిచ్చిగా అడ్డదిడ్డం గేమ్స్ రూల్స్ పెట్టేయడం అనే రేంజులో మాత్రం ఊహించలేకపోయాం…
అవునులే… తీసేవాడికి చూసేవాడు లోకువ… చూసేవాడిని ఆ బిగ్‌బాసోడు చులకనగానే చూస్తాడు… గతంలో హౌజులో కెప్టెన్ ఉండేవాడు… అంటే, స్కూల్ క్లాసుల్లో పెబ్బ అన్నట్టుగా… ఈసారి మెగా చీఫ్ అట… అంటే ఏమీలేదు… పనులు చేయనక్కర్లేదు, నామినేషన్లలో ఉండొద్దు కాబట్టి మరో వారం ఇమ్యూనిటీ వస్తుంది… ఏదో శుష్క పెత్తనం…
దానికి మణికంఠుడు చెబుతున్నట్టు కాళ్లూ చేతులూ కొట్టుకుపోయేలా ఆటలు, పరీక్షలు… కండబలం, బుద్ధిబలం పరీక్షలు… సరే, ఏవో పెడతారు, వీళ్లేదో ఆడతారు, హౌజులో ఇంకా చేయడానికి ఏముంటుంది..? కొట్టుకుంటారు, తన్నుకుంటారు, తిట్టుకుంటారు, చివరకు హగ్గులతో కలిసిపోతారు… కానీ మరీ నిన్నటి ఓ పరీక్ష… బిగ్‌బాస్ మూర్ఖత్వానికి జాలేసేట్టుగా…
Ads
రకరకాల పరీక్షల్లో కిందామీదా పడి ఆరుగురు మెగా చీఫ్ కంటెండర్లు అయ్యారు… అంటే వాళ్లు మాత్రమే చివరి పోటీకి అర్హులు… మిగతావాళ్లు రకరకాల కారణాలతో అనర్హులయ్యారు, వాళ్లు నిజానికి ప్రేక్షక పాత్రే పోషించాలి… కానీ ఈసారి బిగ్‌బాస్ ఆట అంటే లిమిట్లెస్ ఫూలిష్‌నెస్ కదా…
ఆ ఆరుగురే చివరి పోటీలో తమ సత్తాను నిరూపించుకోవాలి కదా… అదే దిశలో పరీక్షలు ఉండాలి కదా… కాదట… ఎవరైతే అనర్హులిగా పరిగణించారో వాళ్లకు పోటీ పెట్టాడు… దేేనికి..? మెగా చీఫ్‌గా ఎవరుండాలో తేల్చడానికి..? వాళ్లు ఆల్రెడీ అనర్హులయ్యారు కదా, మళ్లీ వాళ్లకే ఈ తీర్పు చెప్పే పోటీ పెట్టడం ఏమిటో…
మధ్యలో ఓ మిరపకాయ పెడతాడు… ఎవరైతే వెళ్లి ముందుగా పట్టుకుంటారో వాళ్లు ఆ ఆరుగురిలో ఒకరిని మెగా చీఫ్ పోటీ నుంచి తీసేసి, కారణాలు చెప్పాలి… ఈ బేస్‌లెస్, మైండ్‌లెస్ పోటీలో మిరపకాయ దక్కించుకున్నవాళ్లు వరుసగా ఐదుగురిని పోటీ నుంచి లేపేశారు… ఫాఫం, నిఖిల్… భీమసేనుడిలాగా యుద్ధాలు చేసి, ఒక్కొక్కరినీ సోఫాల మీదకు, స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసి, రక్కేసి మరీ గెలిచినా ప్రయోజనం లేకుండా పోయింది… చివరకు గౌతమ్ కృష్ణ సోకాల్డ్ నత్తిబుర్ర విష్ణుప్రియను సెలక్ట్ చేశాడు… అంటే, ఆ ఆరుగురికి కాదు పరీక్ష… అనర్హుల నడుమ పోటీ పెట్టి, అర్హుల్లో మెగా చీఫ్‌ను ఎంపిక చేయడం… ఏం తెలివిరా భయ్ నీది బిగ్‌బాసూ… మధ్యలో వెళ్లిపోయిన మణికంఠుడు, ఈసారి బిగ్‌బాస్ పిచ్చి రూల్స్ ప్రశ్నించి, తన కోపానికి గురై వెళ్లగొట్టబడిన అభయ్ అదృష్టవంతులు…. అనిపిస్తోంది ఇప్పుడు..!!
Share this Article